Rahmanullah Gurbaz On Shardul Thakur: శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్లు ముఖాముఖి తలపడగా, నితీష్ రాణా జట్టు తమ సొంత మైదానంలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. అయితే హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.


శార్దూల్ ఠాకూర్ ఎందుకు బౌలింగ్ చేయలేదు?
కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ మేనేజ్‌మెంట్ శార్దూల్ ఠాకూర్‌ను బ్యాటింగ్‌కు పంపినప్పటికీ, ఈ బౌలర్ బౌలింగ్‌కు మాత్రం కాలేదు. వాస్తవానికి, కోల్‌కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్‌పై ఆరుగురు బౌలర్లను ఉపయోగించింది. కానీ శార్దూల్ ఠాకూర్ మాత్రం బౌలింగ్ చేయలేకపోయాడు.


ఈ ప్రశ్నకు సమాధానం తనకు కూడా తెలియదని కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ అన్నాడు. ‘దీని గురించి నేనేమీ చెప్పలేను... టీమ్ మేనేజ్‌మెంట్‌కి, కోచ్‌కి నాకంటే బాగా తెలుసు. మ్యాచ్‌కు ముందే నిర్ణయించుకున్న మా జట్టు ప్రణాళికలో ఇది భాగం.’ అని చెప్పాడు. అలాగే శార్దూల్ ఠాకూర్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడని రహ్మనుల్లా గుర్బాజ్ పేర్కొన్నాడు. 


ఐపీఎల్‌ 2023 సీజన్ 39వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.


గుజరాత్ బ్యాటర్లలో విజయ్ శంకర్ (51 నాటౌట్: 24 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బ్యాటర్లలో ఓపెనర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ (81: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు) అత్యధిక స్కోరును సాధించాడు.. గుజరాత్ బౌలర్లలో షమి మూడు వికెట్లు తీసుకున్నాడు.


180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఇన్నింగ్స్ వేగంగా ప్రారంభం అయింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (49: 35 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అయితే మొదటి వికెట్‌కు 4.1 ఓవర్లలోనే 41 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. వన్‌డౌన్‌లో వచ్చిన హార్దిక్ పాండ్యా (26: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), శుభ్‌మన్ గిల్ రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు.


అనంతరం రెండు పరుగుల వ్యవధిలోనే హార్దిక్, గిల్ ఇద్దరూ అవుటయ్యారు. అయితే విజయ్ శంకర్ (51 నాటౌట్: 24 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (32 నాటౌట్: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) ఇద్దరూ కలిసి వేగంగా ఆడుతూ మ్యాచ్‌ను గెలుపు వైపు నడిపించారు. నాలుగో వికెట్‌కు కేవలం 39 బంతుల్లోనే 87 పరుగులు జోడించారు. దీంతో గుజరాత్ ఏడు వికెట్లతో విజయం సాధించింది.