ఐపీఎల్ 2023 వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చాలా తెలివిగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్‌ను గుజరాత్ అతని బేస్ ధర రూ.2 కోట్లకే దక్కించుకుంది. జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా తన జట్టులో విలియమ్సన్‌ను కలిగి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. వేలంపై నెహ్రా ఎలా స్పందించాడో తెలుసుకుందాం.
ఒక ఇంటర్వ్యూలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ, "కేన్ విలియమ్సన్ చాలా అనుభవం కలిగి ఉన్నాడు. అతని క్లాస్‌ను నిరూపించుకున్నాడు. తను గత కొన్ని సీజన్లలో మోచేతి సమస్యల కారణంగా ఇబ్బంది పడ్డాడు. విభిన్నంగా ఆలోచించాల్సిన ఆట ఇది. మేం అతనిని పొందడానికి మరింత చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.మేం అతనిని బేస్ ధర వద్ద కొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. మూడో నంబర్‌లో విలియమ్సన్ బ్యాటింగ్ చేయనున్నాడు." అన్నాడు.
మినీ వేలంపై నెహ్రా స్పందిస్తూ, “మొదట మీ వద్ద ఎంత నిధులు ఉన్నాయో చూడాలి, ఆపై మీరు వేలం పట్టికలో ప్రతి ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్‌ను పొందడం లేదు. కామెరాన్ గ్రీన్ లేదా శామ్ కరన్‌ల కోసం పోటీ ఎక్కువగా ఉన్నందున మేం వారి కోసం వెళ్లలేమని మాకు మొదటి నుండి తెలుసు. మా ఖాళీలను భర్తీ చేయడం చాలా సంతోషంగా ఉంది." అన్నారు.
హార్దిక్ బ్యాటింగ్ ఆర్డర్‌పై నెహ్రా ఏం చెప్పాడు?
విలియమ్సన్ రాకతో హార్దిక్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పుపై నెహ్రా మాట్లాడుతూ, "గత సీజన్‌లో హార్దిక్ ఒక్కసారి మాత్రమే మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. విలియమ్సన్ మూడో స్థానానికి వచ్చిన తర్వాత హార్దిక్ నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతాడు. మేం టోర్నమెంట్ దగ్గరకు వచ్చేసరికి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. కానీ హార్దిక్ చివర్లో బ్యాటింగ్ చేస్తాడని, ఫినిషర్ అని నేను అనుకోను. అతను సెట్ అయితే మ్యాచ్‌ని పూర్తి చేస్తాడని భావిస్తున్నాను." అన్నాడు.
Also Read: IPL 2023 Auction: ఐపీఎల్ వేలంలో యువ క్రికెటర్లపై ఫ్రాంచైజీల ఆసక్తి- భవిష్యత్ కోసమేనా!