IPL 2023, GT vs MI:
ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ -2 టాస్ ఆలస్యమవుతోంది. అహ్మదాబాద్‌లో వర్షం కురిసింది. దాంతో పిచ్‌పై కవర్లు కప్పారు. ఏడు గంటల తర్వాతే వాన తెరపినివ్వడంతో కవర్లు తొలగించారు. 7:30 గంటలకు పిచ్, మైదానాన్ని అంపైర్లు పరీక్షించనున్నారు. దానిని బట్టి టాస్ వేస్తారు. లేదా మరికాస్త సమయం తీసుకుంటారు.
వర్షం ఇలాగే కురిస్తే ప్లేఆఫ్ మ్యాచ్ రాత్రి 9:40 గంటలకు స్టార్ట్ చేసేందుకు అవకాశం ఉంది. ఎలాంటి ఓవర్లూ కోత విధించకుండా నిర్వహించొచ్చు. ఒకవేళ అవసరమైతే ఐదు ఓవర్ల మ్యాచ్ పెట్టొచ్చు. రాత్రి 11.56 గంటలకు ఎలాంటి ఇంటర్వెల్స్ లేకుండా ఐదు ఓవర్ల మ్యాచ్ పెట్టొచ్చు. దానికి రాత్రి 12.50 గంటల వరకు టైమ్ ఇస్తారు. ఒకవేళ మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకుంటే లీగు స్టేజిలో అగ్రస్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు వెళ్తుంది. ఎందుకంటే రిజర్వే డే లేదు!
లేటెస్ట్ అప్‌డేట్: మ్యాచ్ టాస్ రాత్రి 7:45 గంటలకు వేస్తారని అంపైర్లు ప్రకటించారు. 8 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ముంబయి ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.
గుజరాత్ టైటాన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.