GT vs MI, IPL 2023:
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. 'మేం మొదట బౌలింగ్ చేస్తాం. పిచ్‌ను పరిశీలించాం. చాలా హార్డ్‌గా ఉంది. ఎక్కువ నీళ్లు చల్లారు. పరిస్థితులను చక్కగా వినియోగించుకోవాలని అనుకుంటున్నాం' అని రోహిత్ అన్నాడు. జట్టులో రెండు మార్పులు చేసినట్టు చెప్పాడు.
'మంచి స్టార్ట్ లభిస్తే ఆట ఎలా సాగుతుందో చూడాలి. పంజాబ్ కింగ్స్‌తో పోరాడిన తరహా మ్యాచులు జరుగుతుంటాయి. మేం కొన్ని పొరపాట్లు చేశాం. డ్రెస్సింగ్ రూమ్‌లో వాటిని అంగీకరించాం. అలాంటి పరిస్థితుల నుంచి ముందుకెళ్లడం ముఖ్యం. తర్వాతి మ్యాచులకు చక్కని ప్రణాళికలు అమలు చేయడం కీలకం. ఆటగాళ్లం అందరం మాట్లాడుకున్నాం. మళ్లీ బాగా ఆడతామనే అనుకుంటున్నాం. హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్ ఆడటం లేదు. కుమార్ కార్తికేయ, రిలే మెరిడీత్ వస్తున్నారు' అని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
'పిచ్ బాగుంది. కాస్త ఎక్కువ తేమ కనిపిస్తోంది. పిచ్‌లో పెద్దగా పస ఉండకపోవచ్చు. చివరి మ్యాచులో మేం పోరాడాం. కానీ లక్నో సూపర్ జెయింట్స్ మమ్మల్ని 36 ఓవర్ల పాటు డామినేట్ చేసింది. అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడేసిన కుర్రాళ్లకే క్రెడిట్ దక్కుతుంది. మేం అస్సలు ఓటమిని అంగీకరించం. అదృష్టం మా వైపు ఉంది. జట్టులో ఎలాంటి మార్పుల్లేవు. జోష్ లిటిల్ వస్తున్నాడు' అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు.
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వాదెరా, కుమార్ కార్తికేయ, అర్జున్ తెందూల్కర్, రిలే మెరిడీత్, పియూష్ చావ్లా, జేసన్ బెరెన్‌డార్ఫ్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ