South African Players, IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభమైంది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ మార్చి 31వ తేదీన జరిగింది. ప్రారంభ మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్ కారణంగా చాలా మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వారి సంబంధిత ఐపీఎల్ జట్లకు చేరుకోలేకపోయారు. నెదర్లాండ్స్‌తో జరిగే వన్డే సిరీస్ ఏప్రిల్ 2వ తేదీన ముగిసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ 2023 కోసం భారతదేశానికి చేరుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.


ఈ ఫ్రాంచైజీలకు ఉపశమనం
ఐపీఎల్ జట్లు గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌లకు పెద్ద ఊరట లభించింది. జట్టులో ఉన్న సౌత్ ఆఫ్రికన్ ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు, తదుపరి మ్యాచ్‌ల నుండి జట్టుకు అందుబాటులో ఉంటారు.


సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఆఫ్రికన్ ప్లేయర్‌లు చేరుకోవడం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చాలా ఉపశమనం లభించింది. భారత్‌కు వస్తున్న ఆఫ్రికన్ ఆటగాళ్లలో జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఉన్నాడు. మార్క్రమ్ గైర్హాజరీలో భువనేశ్వర్ కుమార్ జట్టు బాధ్యతలు స్వీకరించాడు. ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ ఆటగాళ్లు హైదరాబాద్‌కు ఆడనున్నారు.


గుజరాత్ టైటాన్స్ - దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ భారత్‌కు చేరుకున్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఐపీఎల్ 2022లో జట్టు కోసం చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను జట్టు కోసం 17 మ్యాచ్‌లలో ఫినిషర్ పాత్రను కూడా పోషించాడు. గత సీజన్‌లో ఏకంగా 481 పరుగులు చేశాడు.


పంజాబ్ కింగ్స్ - ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ ఐపీఎల్ 2023 కోసం పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. కగిసో రబడ జట్టుకు ప్రధాన ఫాస్ట్ బౌలర్ పాత్రను పోషిస్తాడు.


లక్నో సూపర్ జెయింట్స్ - దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ ఐపీఎల్ 2023 కోసం లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరాడు. ఐపీఎల్ 2022లో డి కాక్ అద్భుతమైన రిథమ్‌తో కనిపించాడు.


చెన్నై సూపర్ కింగ్స్ - ఫాస్ట్ బౌలర్ సిసంద మగల కూడా IPL 2023 కోసం అతని జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాడు. గాయపడిన కైల్ జేమీసన్ స్థానంలో చెన్నై మగలాను జట్టులో భాగంగా చేసింది.


ఢిల్లీ క్యాపిటల్స్ - సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్లు లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే IPL 2023 కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరారు.


ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డును సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అజేయమైన అర్థ సెంచరీతో జట్టును గెలిపించాడు. కేవలం 49 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.


ఇది విరాట్ కోహ్లీకి ఐపీఎల్‌లో 50కి పైగా పరుగులను సాధించడం ఇది 50వ సారి. ఈ మార్కును అందుకున్న మొదటి భారతీయ బ్యాటర్ విరాట్ కోహ్లీనే. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 60 అర్థ సెంచరీలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. విరాట్ రెండో స్థానంలో ఉండగా, 49 సార్లు ఈ ఫీట్ సాధించిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 45 అర్థ సెంచరీలు, ఐదు సెంచరీలను ఐపీఎల్‌లో సాధించాడు.