DC vs GT,IPL 2023:


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో అరుణ్ జైట్లీ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. జీటీ ఇప్పటికే ఒక మ్యాచ్‌ గెలిచింది. బోణీ కొట్టాలని డీసీ పట్టుదలగా ఉంది. మరి నేటి పోరులో ఇంపాక్ట్ ప్లేయర్ల స్ట్రాటజీలు ఎలా ఉండబోతున్నాయి!


చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్ సాయి సుదర్శన్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకుంది. గాయపడిన కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో అతడు బ్యాటింగ్‌కు వచ్చాడు. అంచనాలకు తగినట్టే ఫర్వాలేదనిపించాడు. ఇక లక్నోతో మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ అమన్ ఖాన్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఎంచుకుంది. బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ప్లేస్‌లో అతడు క్రీజులోకి వచ్చాడు. నాలుగు పరుగులకే ఔటయ్యాడు.


దిల్లీ క్యాపిటల్స్‌ స్ట్రాటజీ


తొలుత బ్యాటింగ్‌ చేస్తే: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), మనీశ్‌ పాండే, రోవ్‌మన్ పావెల్, అమన్ ఖాన్‌, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్‌ నోకియా, ముఖేష్ కుమార్/చేతన్‌ సకారియా


తొలుత బౌలింగ్‌ చేస్తే: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, అమన్ ఖాన్‌, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్‌ యాదవ్‌/చేతన్‌ సకారియా, ఖలీల్ అహ్మద్


దిల్లీ క్యాపిటల్స్‌ స్ట్రాటజీ సింపుల్‌! తొలుత బ్యాటింగ్‌ చేస్తే బ్యాటింగ్‌ డెప్త్‌ ఉన్న టీమ్‌ను ఎంచుకుంటుంది. అప్పుడు మనీశ్‌ పాండే లేదా లలిత్‌ యాదవ్‌లో ఎవరో ఒకరు నేరుగా జట్టులోకి వస్తారు. ఆన్రిచ్‌ నోకియా వస్తుండటంతో స్వదేశీ బ్యాటర్‌కు అవకాశం దక్కుతుంది. ఒకవేళ ఛేదన చేస్తే ఖలీల్‌ అహ్మద్‌ తుది జట్టులో ఉంటాడు. అతడి స్థానంలో మనీశ్‌ పాండే లేదా లలిత్‌ యాదవ్‌ ఇంప్టాక్‌ ప్లేయర్‌గా వస్తారు.


గుజరాత్‌ టైటాన్స్‌ స్ట్రాటజీ


తొలుత బ్యాటింగ్‌ చేస్తే : వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభ్‌మన్‌ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాయి సుదర్శన్‌, విజయ్ శంకర్, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, అల్జారీ జోసెఫ్


తొలుత బౌలింగ్‌ చేస్తే: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభ్‌మన్‌ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, యశ్‌ దయాల్‌/ సాయి కిషోర్


గుజరాత్ టైటాన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే సాయి సుదర్శన్‌ను నేరుగా జట్టులోకి తీసుకుంటుంది. డేవిడ్‌ మిల్లర్‌ రాకతో మిడిలార్డర్‌ పటిష్ఠం అవుతుంది. ఒకవేళ బౌలింగ్‌ చేయాల్సి వస్తే సుదర్శన్‌ బెంచ్‌పై ఉంటాడు. పిచ్‌ను బట్టి యశ్‌ దయాల్‌, సాయికిషోర్‌లో ఒకరు తుది జట్టులోకి వస్తారు. ఛేదన టైమ్‌లో వారిలో ఒకరి స్థానంలో సాయి సుదర్శన్‌ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉంటాడు.