IPL 2023, CSK:
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌పుల్ టీమ్ చెన్నై సూపర్‌కింగ్స్! మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వమే దానికి కొండంత బలం! నిషేధం తర్వాత కప్పు గెలిచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. అలాంటిది మూడేళ్లుగా సీఎస్‌కేకు అన్నీ అపశకునాలే! బ్యాటర్లు రాణిస్తే బౌలర్లు ఫెయిల్. లేదంటే కలిసికట్టుగా విఫలమవుతున్నారు. కీలక క్రికెటర్లు గాయాలతో దూరమవుతున్నారు. నేడే, రేపో మహీ రిటైర్మెంట్ తప్పదు! దాంతో కెప్టెన్సీ సమస్యలూ ఎదుర్కోకతప్పదు. ఇన్నింటి మధ్య సరికొత్త సీజన్‌కు విజిల్‌పొడు టీమ్ ఎలా సన్నద్ధమైందంటే?
ఆలస్యంగా ఆటగాళ్లు
మూడేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ చిదంబరం మైదానంలో మళ్లీ మ్యాచులు ఆడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్టేడియం, ఇక్కడి వాతావరణం ఎంఎస్ ధోనీకి కొట్టిన పిండి! ఎప్పుడు వర్షం పడుతుంది? ఏ దిశలో గాలి వీస్తుందో సహా అన్నీ చెప్పగలడు. ధోనీ ప్లస్ చెపాక్ కాంబినేషన్ ప్రత్యర్థులకు యమా డేంజర్! అయితే ఈ సీజన్లో తొలి ఏడు మ్యాచుల్లో నాలుగు బయటే ఆడాల్సి వస్తోంది. పైగా కొందరు పేసర్లు అందుబాటులో ఉండటం లేదు. సీఎస్‌కే ఎక్కువగా లంక బౌలర్లపై ఆధారపడుతోంది. న్యూజిలాండ్ సిరీసు వల్ల వాళ్లు నాలుగైదు మ్యాచులకు రావడం లేదు. ఇక తుది జట్టు కూర్పూ అంత ఈజీగా సెట్టయ్యేట్టు లేదు.
బ్యాలెన్స్ కష్టం!
శ్రీలంక, న్యూజిలాండ్ ఆరు మ్యాచుల పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతున్నాయి. దాంతో మహీశ్ థీక్షణ, మతీశ పతిరణ ఏప్రిల్ 8 వరకు అందుబాటులో ఉండటం లేదు. అప్పటికే సీఎస్‌కే మూడు మ్యాచులు ఆడేస్తుంది. డేవాన్ కాన్వే, మిచెల్ శాంట్నర్ వస్తుండటం ఊరట. కైల్ జేమీసన్ ప్లేస్‌లో తీసుకున్న సఫారీ పేసర్ సిసందా మగల కూడా ఆలస్యంగానే రావొచ్చు. నెదర్లాండ్స్‌తో వన్డేలే ఇందుకు కారణం. వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న లెఫ్టార్మ్ సీమర్ ముకేశ్ చౌదరీ డౌటే! ఈ మధ్యే గాయం నుంచి కోలుకొని వస్తున్న ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ బంతి పట్టుకోవడం కష్టమే. దీపక్ చాహర్‌పై ఎక్కువ భారం మోపితే గాయపడే ఛాన్సుంది. కొన్ని నెలలుగా అతడు క్రికెట్టే ఆడని సంగతి తెలిసిందే. నిషాంద్ సందు, అజయ్ మండల్.. జడ్డూకు బ్యాకప్‌గా ఉండటం శుభసూచకం. అజింక్య రహానె, షేక్ రషీద్ రిజర్వు బ్యాటర్లు.
చెపాక్‌లో స్పిన్నే ఆయుధం!
చెపాక్ మందకొడి పిచ్. పైగా స్పిన్ ట్రాక్. దాంతో మిస్టరీ స్పిన్, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, లెఫ్టార్మ్ ఫింగర్ స్పిన్ బౌలర్లను తీసుకుంది. మ్యాచులు గెలిచేందుకు ఒకప్పటికి స్పిన్ విన్ ఫార్ములానే వాడుకుంటామని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అంటున్నాడు. ఒకవేళ ప్రత్యర్థి స్పిన్నర్లు దాడిచేస్తే అటాక్ చేసేందుకు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, మొయిన్ అలీ వంటి బ్యాటర్లు ఉన్నారు. గాయం నుంచి కోలుకొని రవీంద్ర జడేజా మంచి ఫామ్‌లో ఉన్నాడు. టీమ్‌ఇండియాకు అన్ని ఫార్మాట్లలో కీలకంగా ఆడి వస్తున్నాడు. ఇక సీఎస్‌కే మ్యాచ్ ఫినిషర్ అతడే. పేస్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉండటం సీఎస్‌కే లక్కు. అయితే టాప్ 7 బ్యాటింగ్ ఆర్డర్లో ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లే ఉండటం ఒక వీక్‌నెస్. అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆఫ్ స్పిన్నర్లు వీరిని బోల్తా కొట్టించగలరు.
ఫైనల్ XI నాట్ ఈజీ!
సీఎస్‌కే తుది జట్టు కూర్పు ఈజీగా కనిపించడం లేదు. రుతురాజ్ గైక్వాడ్‌కు తోడుగా డేవాన్ కాన్వే ఓపెనింగ్ చేయొచ్చు. మొయిన్ అలీ, శివమ్ దూబె, అంబటి రాయుడు ఆ తర్వాత వస్తారు. బెన్‌స్టోక్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ ఉంటారు. ఇప్పటికే ముగ్గురు విదేశీయుల్ని తీసుకుంటే మిగిలేదే ఒకే స్పాట్. ప్యూర్ పేసర్‌ను తీసుకుంటే ప్రిటోరియస్‌కు ఛాన్స్ ఉండదు. అతడిని తీసుకుంటే బౌలింగ్‌లో పూర్తిగా భారతీయులపైనే ఆధారపడాలి. అందుబాటులో ఉన్నవాళ్లతో తుది జట్టును రూపొందించడం ధోనీకే సవాలే. ఈ సీజన్ ఆరంభ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై శనివారం ఢీకొడుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్
వికెట్ కీపర్లు: మహేంద్ర సింగ్ ధోని, డెవాన్ కాన్వే (న్యూజిలాండ్).
బ్యాటర్లు: రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, అజింక్యా రహానే.
ఆల్ రౌండర్లు: మొయిన్ అలీ (ఇంగ్లండ్), శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్ (SA), మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), కైల్ జామీసన్ (న్యూజిలాండ్), అజయ్ మండల్, భగత్ వర్మ, నిశాంత్ సింధు.
బౌలర్లు: దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ (శ్రీలంక), సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ (శ్రీలంక)