IPL 2023, CSK vs MI:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2022లో మరో ఎల్‌క్లాసికో పోరుకు రంగం సిద్ధమైంది! సంయుక్తంగా 9 సార్లు ట్రోఫీలు గెలిచిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ధోనీ సేన అడ్డా.. చెపాక్‌లో మ్యాచ్ జరుగుతోంది. మరి ఈ పోరులో విజయం ఎవరిది?
జోష్‌లో ముంబయి!
చిదంబరం మైదానం! చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కంచుకోట! ఇక్కడ విజయాలు సాధించడం ప్రత్యర్థులకు అంత ఈజీ కాదు! కానీ ముంబయి ఇండియన్స్‌కు (Mumbai Indians) చెపాక్‌లో మెరుగైన రికార్డు ఉంది. 6-2తో సీఎస్‌కేను డామినేట్ చేసింది. ఇప్పుడున్న ఫామ్ కొనసాగిస్తే గెలుపు సులువే! అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పెద్ద ఇన్నింగ్సే బాకీ ఉన్నాడు. అతడి నుంచి మెరుపులు ఆశిస్తున్నారు. ఇషాన్ కిషన్ తనదైన దూకుడుతో అదరగొడుతున్నాడు. ముంబయి మిడిలార్డర్ భీకరమైన ఫామ్‌లో ఉంది. టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), తిలక్ వర్మ.. అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తున్నారు. వీరిలో ఏ ఇద్దరు నిలిచినా మ్యాచును తమ వైపుకు లాగేస్తారు. బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లోనే కొంత వీక్‌నెస్ ఉంది. జోఫ్రా ఆర్చర్ ఎఫెక్ట్ చూపించడం లేదు. స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌పై హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ కీలకం అవుతాడు. పేస్‌లో మరింత పటిష్ఠత అవసరం.
పట్టు.. తప్పింది!
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌ది విచిత్రమైన పరిస్థితి! బ్యాటర్లు బాగున్నా బౌలింగ్ బాగాలేదు. దాంతో ప్రత్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రుతురాజ్ (Ruturaj Gaikwad) స్కోరింగ్ రేట్ తగ్గింది. డేవాన్ కాన్వేనూ త్వరగానే ఔట్ చేస్తున్నారు. వీరిద్దరూ మంచి ఓపెనింగ్ పాట్నర్‌షిప్ అందించాలి. అజింక్య రహానె (Ajinkya Rahane), శివమ్ దూబె ఫర్వాలేదు. రవీంద్ర జడేజా దూకుడుగా రన్స్ చేస్తున్నాడు. అయితే అంబటి రాయుడు, మొయిన్ అలీ చేసిందేమీ లేదు. మహీ వరకు బ్యాటింగే రావడం లేదు. వచ్చినా ఎప్పుడో ఒకసారి మెరుస్తున్నాడు. బెన్‌స్టోక్స్ వారం నుంచి బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ ఆడతాడో లేదో తెలియదు. డెత్ ఓవర్లలో పతిరన ఆకట్టుకున్నాడు. దాంతో కోలుకున్నా సిసింద మగలకు చోటు దక్కకపోవచ్చు. తీక్షణ, జడ్డూ, అలీ స్పిన్ చూస్తున్నారు. దేశ్ పాండే రన్స్ లీక్ చేస్తున్నాడు. దీపక్ చాహర్ రావడం కాస్త ఊరట.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్
ముంబై ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.