IPL 2022 SRH won the toss opted to field against DC match 50 brabourne : ఐపీఎల్ 2022లో 50వ మ్యాచ్ టాస్ పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెంటనే దిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తమ జట్టులో 3 మార్పులు చేస్తున్న పేర్కొన్నాడు. గాయపడ్డ నటరాజన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జన్‌సెన్‌కు విశ్రాంతి ఇచ్చామన్నాడు. వారి స్థానాల్లో కార్తీక్ త్యాగీ, సేన్ అబ్బాట్, శ్రేయస్ గోపాల్‌ను తీసుకున్నామని చెప్పాడు.
తమ జట్టులో నాలుగు మార్పులు చేశామని దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ చెప్పాడు. గాయాల కారణంగా కొందరు, టెక్నికల్స్ వల్ల మరికొందరు దూరమయ్యారని పేర్కొన్నాడు. పృథ్వీ షా, అక్షర్ పటేల్, ముస్తాఫిజుర్, చేతన్ సకారియా ఆడటం లేదన్నాడు. ఆన్రిచ్ నోకియా, మన్‌దీప్, రైపల్ పటేల్, ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్క్‌క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, శ్రేయస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, సేన్ అబ్బాట్, కార్తీక్ త్యాగీ, ఉమ్రాన్ మాలిక్
దిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మన్‌దీప్ సింగ్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రోమన్ పావెల్, రైపల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఆన్రిచ్ నార్జ్
సన్‌రైజర్సే పైచేయి.. అయినా?
ఈ సీజన్ ఆఖరి దశకు చేరుకుంటోంది. అందుకే ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకమే! ఈ దశలో గెలిస్తేనే సులభంగా ప్లేఆఫ్స్‌కు చేరుకోవచ్చు. అందుకే నేడు జరిగే పోరు దిల్లీ, హైదరాబాద్‌కు డూ ఆర్ డై లాంటిది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన కేన్ సేన్ ఆఖరి రెండు మ్యాచుల్లో ఓడింది. 9 మ్యాచుల్లో 5 గెలిచి 4 ఓడి 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు దిల్లీ 9 మ్యాచుల్లో 4 గెలిచి 5 ఓడి 8 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. మెరుగైన రన్‌రేట్ ఉన్న పంత్ సేన ఈ మ్యాచును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్‌లో 20 సార్లు తలపడ్డాయి. 11 సార్లు హైదరాబాద్ గెలవగా దిల్లీ 9 గెలిచింది.