MI vs SRH, Match Highlights: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆశలు మిగేలే ఉన్నాయి. ముంబయి ఇండియన్స్‌పై ఆ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 194 పరుగుల టార్గెట్‌ను నిలబెట్టుకొంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (48; 36 బంతుల్లో 2x4, 4x6), ఇషాన్ కిషన్ (43; 34 బంతుల్లో 5x4, 1x6), టిమ్ డేవిడ్ (46; 18 బంతుల్లో 3x4, 4x6) దంచికొట్టినా 19వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ రక్షించాడు. వికెట్ మెయిడిన్‌తో ఆకట్టుకున్నాడు. అంతకు ముందు సన్‌రైజర్స్‌లో రాహుల్ త్రిపాఠి (76; 44 బంతుల్లో 9x4, 3x6) చితక్కొట్టాడు. విలువైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడుగా ప్రియమ్ గార్గ్ (42; 26 బంతుల్లో 4x4, 2x6), నికోలస్ పూరన్ (38; 22 బంతుల్లో 2x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడేశారు.
దాదాపుగా గెలిచేసిన ముంబయి
భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్‌కు సూపర్బ్ స్టార్ట్ దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (48; 36 బంతుల్లో 2x4, 4x6), ఇషాన్ కిషన్ (43; 34 బంతుల్లో 5x4, 1x6) చక్కగా ఆడారు. తొలి వికెట్‌కు 66 బంతుల్లోనే 95 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. తొలి రెండు ఓవర్లు స్లోగా ఆడిన ఈ జోడీ లయ అందుకోగానే చెలరేగింది. నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరూ ఆడారు. దాంతో 6 ఓవర్లకే స్కోరు 51కి చేరుకుంది. ఇదే జోరు కొనసాగిస్తున్న కీలక సమయంలో అర్ధశతకానికి చేరువైన హిట్‌మ్యాన్‌ను జట్టు స్కోరు 95 వద్ద వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. మరికాసేపటికే ఓ ఫాస్టెస్ట్ డెలివరీతో ఇషాన్ కిషన్‌ను ఇమ్రాన్ మాలిక్ పెవిలియన్ పంపించాడు. డేనియెల్ సామ్స్ (15), తిలక్ వర్మ (8) అతడే ఔట్ చేశాడు. కష్టాల్లో పడ్డ ముంబయిని టిమ్ డేవిడ్ ఆదుకున్నాడు. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు సాధించాడు. అయితే ఆఖరి బంతికి అనవసర సింగిల్‌కు ప్రయత్నించి అతడు రనౌట్ అయ్యాడు. 12 బంతుల్లో 18 పరుగులు అవసరమైన సమయంలో 19వ ఓవర్‌ను భువీ వికెట్ మెయిడిన్‌గా మలిచాడు. ఆ తర్వాతి ఓవర్లో రమన్‌దీప్ (14) బౌండరీ, సిక్స్ బాదినా 15 పరుగులే
రావడంతో ఓటమి పాలైంది.
త్రిపాఠి చితక్కొట్టుడు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు (SRH) శుభారంభం దక్కలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ (9) జట్టు స్కోరు 18 వద్ద డేనియెల్ సామ్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే కేన్ విలియమ్సన్ బదులు ఓపెనింగ్‌కు వచ్చిన ప్రియమ్ గార్గ్ రెచ్చిపోయాడు. రాహుల్ త్రిపాఠితో కలిసి బీభత్సమైన షాట్లు ఆడేశాడు. నిలకడగా ఆడుతూనే దూకుడుగా బౌండరీలు కొట్టేశాడు. రెండో వికెట్‌కు 43 బంతుల్లో 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పదో ఓవర్ ఆఖరి బంతికి గార్గ్‌ను రమన్‌దీప్ ఔట్ చేశాడు. మరోవైపు త్రిపాఠి సొగసైన షాట్లు ఆడాడు. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అతడికి తోడుగా నికోలస్ పూరన్ సిక్సర్లు, ఫోర్లు బాదేయడంతో 15.2 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 150కి చేరుకుంది. మూడో వికెట్‌కు 42 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని పూరన్‌ను ఔట్ చేయడం ద్వారా మెరిడీత్ విడదీశాడు. అప్పటికి స్కోరు 172. మరో 3 పరుగుల వ్యవధిలోనే త్రిపాఠి, మార్‌క్రమ్‌ను రమన్‌దీప్ ఔట్ చేశాడు. కేన్ (8), సుందర్ (9) కలిసి స్కోరును 193కు తీసుకెళ్లారు.