IPL 2022, MI vs SRH Toss Update: ఐపీఎల్ 2022లో 65వ మ్యాచులో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. చివరి మ్యాచులో ఆడిన స్పిన్నర్లను తీసుకోలేదని చెప్పాడు. మయాంక్ మర్కండే, సంజయ్ యాదవ్‌కు చోటిచ్చామని పేర్కొన్నాడు. వచ్చే ఏడాదిని దృష్టిలో పెట్టుకొని కుర్రాళ్లను పరీక్షిస్తున్నామని వెల్లడించాడు. సన్‌రైజర్స్‌లోనూ రెండు మార్పులు చేశామని కేన్ విలియమ్సన్ చెప్పాడు. శశాంక్ స్థానంలో ప్రియమ్ గార్గ్, మార్కో జన్‌సెన్ బదులు ఫజల్ ఫరూఖీ ఆడుతున్నారని వెల్లడించాడు. అభిషేక్‌తో కలిపి ప్రియమ్ గార్గ్ ఓపెనింగ్ చేస్తాడని పేర్కొన్నాడు.
SRH vs MI Playing XI
ముంబయి ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, త్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, డేనియెల్ సామ్స్, మయాంక్ మర్కండే, రమన్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరిడీత్, సంజయ్ యాదవ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, ప్రియమ్ గార్గ్, ఫజల్ ఫరూఖీ, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
SRH 2 గెలిచినా చెప్పలేం!
ముంబయి ఇండియన్స్ ఈ సీజన్లో 12 మ్యాచులాడితే 3 గెలిచి 9 ఓడింది. 6 పాయింట్లతో ఆఖర్లో నిలిచింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం 12 మ్యాచుల్లో 5 గెలిచి 7 ఓడారు. 10 పాయింట్లు, -0.270 రన్‌రేట్‌తో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన కేన్ సేన ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి టాప్-2లోకి వెళ్లింది. మధ్యలో అనూహ్యంగా చతికిల పడింది. వరుసగా ఐదు ఓడిపోయింది. ఇప్పటికే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేవు! టెక్నికల్‌గా ఉన్న ఛాన్స్ నిజం అవ్వాలంటే నేడు కచ్చితంగా భారీ రన్‌రేట్‌తో గెలవాలి. లేదంటే నిరాశగా వెనుదిరగాలి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 10-8తో సన్‌రైజర్స్ కాస్త వెనకబడింది.