ఐపీఎల్‌లో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. రెండు జట్లూ తుది బృందాల్లో ఎటువంటి మార్పులూ చేయలేదు.


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుఫ్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లొమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్


రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టు
యశస్వి జైస్వాల్, సంజు శామ్సన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మేయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్, యుజ్వేంద్ర చాహల్