ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మొదటి గెలుపు దక్కింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం ముంబై 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
భారీ స్కోరు చేయడంలో విఫలం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ ఇన్నింగ్స్ మెల్లగా ప్రారంభం అయింది. 26 పరుగుల స్కోరు వద్ద హృతిక్ షౌకీన్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (15: 15 బంతుల్లో, మూడు ఫోర్లు) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శామ్సన్ (16: 7 బంతుల్లో, రెండు సిక్సర్లు) వేగంగా ఆడే ప్రయత్నంలో రెండు సిక్సర్లు కొట్టి అవుటయ్యాడు.
ఆ తర్వాత జోస్ బట్లర్, డేరిల్ మిషెల్ (17: 20 బంతుల్లో, ఒక ఫోర్) నిదానంగా ఆడటంతో స్కోరు మందకొడిగా ముందుకు కదిలింది. ఇంతలోనే డేరిల్ మిషెల్ కూడా అవుటయ్యాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వరకు జోస్ బట్లర్ స్ట్రైక్ రేట్ 100 కూడా దాటలేదు. హృతిక్ షౌకీన్ వేసిన 16వ ఓవర్లో మొదటి నాలుగు బంతులకు సిక్సర్లు కొట్టిన జోస్ బట్లర్ చివరి బంతికి అవుటయ్యాడు.
రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు ఈ ఓవర్ కావాల్సిన ఊపిచ్చినా దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఈ మధ్యే అర్థ సెంచరీ చేసిన రియాన్ పరాగ్ (3: 3 బంతుల్లో) విఫలం అయినా... రవిచంద్రన్ అశ్విన్ (21: 9 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడాడు. చివరి ఓవర్లో షిమ్రన్ హెట్‌మేయర్ (6: 14 బంతుల్లో) నాలుగు బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేశాడు. దీంతో రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో హృతిక్ షౌకీన్, రైలే మెరెడిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. డేనియల్ శామ్స్, కుమార్ కార్తికేయ చెరో వికెట్ తీసుకున్నారు.
పడుతూ, లేస్తూ కొట్టేశారు
159 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో లేకుండా ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. క్రీజులో ఉన్నంత సేపు వేగంగా ఆడిన ఇషాన్ కూడా ఆరో ఓవర్లోనే అవుట్ కావడంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 41 పరుగులు మాత్రమే.
అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అయితే జట్టు స్కోరు 122 పరుగుల వద్ద వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో ముంబై మళ్లీ కష్టాల్లో పడింది. ఆ తర్వాత పొలార్డ్ విఫలం అయినా... చివర్లో టిమ్ డేవిడ్, డేనియల్ శామ్స్ మ్యాచ్‌ను ముగించారు. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్‌లకు తలో వికెట్ దక్కింది.