Mayank Agarwal appointed Punjab Kings captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) ఈ మార్చి 26న ప్రారంభం కానుంది. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో తాజా సీజన్‌ మహారాష్ట్ర వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 సీజన్‌కుగానూ ఆటగాళ్ల వేలం బెంగళూరు వేదికగా నిర్వహించారు. అన్ని ఫ్రాంచైజీలు ఐపీఎల్ తాజా సీజన్‌కు సన్నద్ధం అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌ని నియమించింది. మయాంక్ అగర్వాల్‌ను పంజాబ్ కింగ్స్‌కు కొత్త కెప్టెన్‌ (Punjab Kings New Captain)గా బాధ్యతలు అప్పగించారు.


పంజాబ్ కింగ్స్‌కు కొత్త సారథి.. 
మయాంక్ అగర్వాల్ కొత్త అని పంజాబ్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. టీమిండియా క్రికెటర్ మయాంక్‌కు విషెస్ తెలుపుతూనే తాజా సీజన్‌లో రాణించాలని ఆల్ ద బెస్ట్ చెబుతూ వీడియో పోస్ట్ చేసింది. గతంలో కేఎల్ రాహుల్ పంజాబ్ కెప్టెన్‌గా సేవలు అందించాడు. ఈ ఏడాది మార్చి 26న ఐపీఎల్ తాజా టోర్నీ ముంబైలో ప్రారంభం కాగా, మే 29న సీజన్ ముగుస్తుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. 


ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ చేరాయి. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ముంబై, పుణెలలోని 4 వేదికల్లో తాజా సీజన్ జరగనుంది. ప్లే ఆఫ్ రౌండ్ మ్యాచ్‌ల వేదికలను పూర్తి వివరాలను త్వరలోనే బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి ప్రకటించనుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లపై భారీగా అంచనాలు ఉన్నాయి. 






IPL Mega Auction 2022లో 25 ఆటగాళ్లతో జట్టును ఏర్పాటు చేసింది. మొత్తం వేలం పూర్తయ్యాక సైతం 3.45 కోట్లు మిగుల్చుకుంది. కొంతమంది ప్లేయర్లకు ఎక్కువగా ఖర్చు పెట్టినప్పటికీ  దేశవాళీ ఆటగాళ్లను తక్కువ ధరకు తీసుకుంది. తాజాగా పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌ను నియమించింది.


Also Read: IPL 2022 Update: ఐపీఎల్‌ 2022 తొలి మ్యాచ్‌ CSK vs KKR, ఇక ఫాన్స్‌ పండగ చేస్కోవడమే!


Also Read: IPL 2022: ఐపీఎల్‌ మొదలవ్వనే లేదు - అప్పుడే ప్రత్యర్థులను దెబ్బకొట్టేసిన CSK ధోనీ భాయ్‌!