LSG vs RCB, Eliminator: ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్! ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచు టాస్ ఆలస్యమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చిరు జల్లులు కురుస్తుండటంతో మైదానం మొత్తం కవర్లతో కప్పేశారు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ కోసం మైదానానికి వచ్చారు. ఆ తర్వాత వర్షం మొదలవ్వడంతో మైదానం సిబ్బంది వెంటనే కవర్లు తీసుకొచ్చారు. అసలు సిసలైన మ్యాచుకు ముందు రెండు జట్లను వరుణుడు టెన్షన్ పెడుతున్నాడు.
ప్లేఆఫ్స్ మ్యాచుకు వర్షం పడితే నిబంధనలు ఇలా ఉన్నాయి.
* ప్లేఆఫ్స్ మ్యాచులను ఆలస్యంగానైనా సరే రాత్రి 9:40 గంటలకు మొదలు పెడతారు. ఓవర్లలో ఎలాంటి కోత ఉండదు.
* 11:56 గంటలకు రెండు జట్లకు ఐదు ఓవర్ల ఆట నిర్వహిస్తారు.
* ఒకవేళ ఐదు ఓవర్ల ఆట కుదరకపోతే రాత్రి 12:56 కన్నా ముందు సూపర్ ఓవర్ ఆరంభం అవుతుంది.
* ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట జరగకపోతే లీగ్ స్టేజ్‌లో మొదట ఉన్న జట్టు విజేతగా ఆవిర్భవిస్తుంది. అంటే లక్నో సూపర్ జెయింట్స్ క్వాలిఫయర్ 2కు చేరుకుంటుంది.