IPL 2022, KL Rahul Records: కేఎల్‌ రాహుల్‌ ధోనీసేనను ఊచకోత కోసింది గుర్తుందా? KL ముందర మరో రికార్డు!

IPL 2022, KL Rahul Records: లక్నో సూపర్‌జెయింట్స్‌ (Lucknow Supergiants) కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో (Chennai Superkings) నేడు జరిగే మ్యాచులో ఒక అర్ధశతకం చేస్తే చాలు!

Continues below advertisement

KL Rahul performance against csk in 2021: లక్నో సూపర్‌జెయింట్స్‌ (Lucknow Supergiants) కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో (Chennai Superkings) నేడు జరిగే మ్యాచులో ఒక అర్ధశతకం చేస్తే చాలు! టీ20 క్రికెట్లో 50 అర్ధసెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనత అందుకుంటాడు. మరో 2 బాదితే 500 బౌండరీల ఘనతకు చేరుకుంటాడు.

Continues below advertisement

అంతర్జాతీయంగా టీ20 క్రికెట్లో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)కు తిరుగులేదు. కొన్నేళ్లుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (IPL) అతడు నిలకడగా రాణిస్తున్నాడు. మూడేళ్లుగా కనీసం 600 పరుగులు చేస్తున్నాడు. 2019లో 53.9 సగటుతో 593 పరుగులు చేశాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2020లో 55.8 సగటుతో 670 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. 5 హాఫ్‌ సెంచరీలు కొట్టాడు. 2021లోనూ 62.6 సగటుతో 626 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇందుకోసం 6 హాఫ్‌ సెంచరీలు కొట్టాడు.

కేఎల్‌ రాహుల్‌ ఇప్పటి వరకు 173 టీ20 (ఐపీఎల్‌, అంతర్జాయతీ, దేశవాళీ)లు ఆడాడు. 43 సగటు, 137 స్ట్రైక్‌రేట్‌తో 5742 పరుగులు చేశాడు. 49 అర్ధశతకాలు, 498 బౌండరీలలు బాదేశాడు. నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచులో మరో అర్ధశతకం చేస్తే 50 హాఫ్‌ సెంచరీల రికార్డు సాధిస్తాడు. దాంతో ఆటోమేటిగ్గానే 500 బౌండరీల రికార్డూ వచ్చేస్తుంది.

సీఎస్‌కేతో (CSK) మ్యాచుకు ముందు అభిమానులు గతేడాది ధోనీసేనపై రాహుల్‌ దూకుడును గుర్తు చేసుకుంటున్నారు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదట సీఎస్‌కే 134/6 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ 13 ఓవర్లలోపే పూర్తి చేసింది. ఈ పోరులో కేఎల్‌ రాహుల్‌ 42 బంతుల్లోనే 7 బౌండరీలు, 8 సిక్సర్లతో అజేయంగా 98 పరుగులు చేశాడు. ఏకంగా 234 స్ట్రైక్‌రేట్‌తో దంచికొట్టాడు. ఈ రోజు జరిగే మ్యాచులోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Continues below advertisement
Sponsored Links by Taboola