IPL 2022, KKR vs DC Preview: ఐపీఎల్‌ 2022లో 19వ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders) తలపడుతున్నాయి. దిల్లీకి నాయకుడైన రిషభ్ పంత్‌ (Rishabh Pant), కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) మంచి మిత్రులు. ఒకప్పుడు దిల్లీకే కలిసి ఆడారు. ఇప్పుడు వీరిద్దరూ వేర్వేరు జట్ల తరఫున పోటీ పడుతున్నారు. మరి ఈ రెండు జట్లలో ఆధిపత్యం ఎవరిది? బ్రబౌర్న్‌ వేదికగా జరిగే మ్యాచులో గెలిచేదెవరు? తుది జట్టు ఎలా ఉండబోతున్నాయి.

Continues below advertisement


kkr vs dc సమవుజ్జీలే అయినా!


ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అత్యంత బలంగా కనిపిస్తోంది. శ్రేయస్‌ రాకతో వారిలో ఉత్సాహం మరింత పెరిగింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ డెప్త్‌ అద్భుతంగా ఉంది. సునిల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులు విలవిల్లాడుతున్నారు. బ్యాటింగ్‌లోనూ ఒకరు కాకపోతే మరొకరు రెచ్చిపోతున్నారు. అందుకే ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచిన కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ పొజిషన్లో ఉంది. ఇక దిల్లీ క్యాపిటల్స్‌లోనూ తిరుగులేని క్రికెటర్లు ఉన్నారు. బౌలింగ్‌ అటాక్‌ సైతం బాగుంది. అయితే అదృష్టం కలిసి రావడం లేదు. బ్యాటర్లు అప్పుడప్పుడు చేతులెత్తేస్తున్నారు. నిలకడ లోపం సరిదిద్దుకుంటే వారు ఏమైనా చేయగలరు. ఈ సీజన్లో మూడు మ్యాచులాడిన పంత్‌ సేన ఒకటి గెలిచి ఏడో స్థానంలో ఉంది.


KKRదే ఆధిపత్యం


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (IPL) దిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌దే ఆధిపత్యం. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 28 మ్యాచుల్లో తలపడితే కేకేఆర్‌ 16 గెలిచింది. దిల్లీ 11కే పరిమితమైంది. ఇక చివరగా తలపడ్డ ఐదు మ్యాచుల్లోనూ 3-2తో కేకేఆరే ముందుంది. చివరి సీజన్‌ లీగు మ్యాచుల్లో చెరోటి గెలిచాయి. కానీ రెండో క్వాలిఫయర్‌లో దిల్లీని ఓడించే కేకేఆర్‌ ఫైనల్‌ చేరుకుంది. అంటే గణాంకాల పరంగా, మానసికంగా వారిదే పైచేయి.


KKR Probable XI


కోల్‌కతా నైట్‌రైడర్స్‌: వెంకటేశ్‌ అయ్యర్‌, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌, శామ్‌ బిల్లింగ్స్‌, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, సునిల్‌ నరైన్‌, ఉమేశ్‌ యాదవ్‌, రసిక్‌ సలామ్‌, వరుణ్‌ చక్రవర్తి


DC Probable XI


దిల్లీ క్యాపిటల్స్‌: డేవిడ్‌ వార్నర్‌, పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌, రిషభ్ పంత్‌, లలిత్‌ యాదవ్‌, రోమన్‌ పావెల్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆన్రిచ్‌ నోకియా, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌