IPL 2022 Gujarat Titans opt to bat against punjab kings match 48 in dy patil stadium: ఐపీఎల్ 2022లో 48వ మ్యాచులో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మంచు పెద్దగా ప్రభావం చేయకపోవచ్చని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను బౌలింగ్ చేయగలిగే సామర్థ్యంతో ఉన్నానని వెల్లడించాడు. ఇప్పటికే జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో 2-3 మ్యాచుల వరకు బౌలింగ్ చేయబోనని ప్రకటించాడు.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమి, ప్రదీప్ సంగ్వాన్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భానుక రాజపక్స, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, కాగిసో రబాడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ
2 పాయింట్లు వస్తే ప్లేఆఫ్స్
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (GT) ఎదురే లేకుండా ఉంది. ఆడిన 9 మ్యాచుల్లోనే 8 గెలిచి 16 పాయింట్లతో నంబర్‌వన్ పొజిషన్లో ఉంది. మరో రెండు పాయింట్లు సాధిస్తే ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 9 మ్యాచుల్లో 4 గెలిచి 5 ఓడింది. ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్ చేరుకోవాలంటే ఇకపై వరుస విజయాలు అందుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో వీరిద్దరూ తలపడ్డ మొదటి మ్యాచులో టైటాన్స్ చివరి బంతికి గెలిచింది. ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం కాగా రాహుల్ తెవాతియా వరుసగా రెండు సిక్సర్లు బాదేసి పంజాబ్‌కు గుండెకోత మిగిల్చాడు.
మూమెంటమే గుజరాత్ బలం