IPL 2022 gt vs srh rashid khan struggles against rahul tripathi : ఐపీఎల్‌ 2022లో బుధవారం గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (GT vs SRH) తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు తలపడ్డ మొదటి మ్యాచులో కేన్‌ సేనే గెలిచింది. మరోసారీ అదే ఫీట్‌ రిపీట్‌ చేయాలని హైదరాబాద్‌ అనుకుంటోంది. మ్యాచ్‌ అప్స్‌ సైతం అలాగే ఉన్నాయి.


* అఫ్గాన్‌ మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) బౌలింగ్‌ అంటే చాలామందికి హడల్‌! అంతర్జాతీయంగా మహామహులైన బ్యాటర్లు అతడిని ఎదుర్కొనేందుకు ఇష్టపడరు. అలాంటిది రాహుల్‌ త్రిపాఠి (Rahul Tripathi) మాత్రం అతడికి చుక్కలు చూపిస్తున్నాడు. అస్సలు భయపడటం లేదు. త్రిపాఠిపై రషీద్‌ రికార్డు అంత బాగాలేదు. 26 బంతుల్లో 35 పరుగులు ఇచ్చాడు. 135 స్ట్రైక్‌రేట్‌తో రన్స్‌ ఇచ్చాడు. ఒకే ఒక్కసారి డిస్మిస్‌ చేశాడు. అంటే నేటి మ్యాచులో రషీద్‌ ఖాన్‌ను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌ త్రిపాఠిని రంగంలోకి దించుతుంది అనడంలో సందేహం లేదు.


* యార్కర్‌ కింగ్‌ నటరాజన్‌ (T Natarajan)తో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రమాదం తప్పదు. ఈ ఐపీఎల్‌లోనే బెస్ట్‌ బౌలర్‌గా అతడు కొనసాగుతున్నాడు. అటు పవర్‌ప్లే ఇటు డెత్‌ ఓవర్లలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. వికెట్లు తీస్తున్నాడు. పవర్‌ప్లేలో 6 వికెట్లు తీశాడు. మరెవ్వరికీ ఈ రికార్డు లేదు. డెత్‌లో అతడి 6 వికెట్లతో పోలిస్తే డ్వేన్‌ బ్రావో (9), భువి (7) మాత్రమే ముందున్నారు.


* గుజరాత్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman gill) స్వింగ్‌ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌ (Bhuvaneshwar) బౌలింగ్‌లో ఆడలేకపోతున్నాడు. అతడు వేసిన 37 బంతుల్లో 86.48 స్ట్రైక్‌రేట్‌తో 32 పరుగులే చేశాడు. రెండుసార్లు ఔటయ్యాడు.


* కేన్‌ మామకూ ఓ గండం పొంచివుంది. షమి బౌలింగ్‌లో ఔటవుతున్నాడు. 10 టీ20 ఇన్నింగ్సుల్లో 47 బంతుల్లో 66 పరుగులే చేశాడు. నాలుగు సార్లు ఔటయ్యాడు.