IPL 2022: ఇక పుణెలో మ్యాచులు లేనట్టే! DC vs RR వేదిక మార్చేసిన బీసీసీఐ

IPL 2022: ఐపీఎల్‌ 2022 లీగ్‌ దశ మొత్తం ముంబయిలోనే జరిగే ఛాన్సుంది! ఇకపై పుణెలో మ్యాచులు ఆడించకపోవచ్చని సమాచారం. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

Continues below advertisement

ఐపీఎల్‌ 2022 లీగ్‌ దశ మొత్తం ముంబయిలోనే జరిగే ఛాన్సుంది! ఇకపై పుణెలో మ్యాచులు ఆడించకపోవచ్చని సమాచారం. రాజస్థాన్‌ రాయల్స్‌తో శుక్రవారం దిల్లీ క్యాపిటల్స్‌ తలపడాల్సిన మ్యాచును ముంబయికి తరలించడమే ఇందుకు కారణం.

Continues below advertisement

ఈ ఏడాది ముంబయి, పుణెను ఐపీఎల్‌ వేదికలుగా ఎంపిక చేశారు. వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌ స్టేడియాలు ముంబయిలో ఉన్నాయి. మహారాష్ట్ర క్రికెట్‌ మైదానం పుణెలో ఉంది. లీగ్‌దశలో పుణెకు 15 మ్యాచులు కేటాయించారు. దిల్లీ క్యాపిటల్స్‌లో కరోనా కలకలం రేగడంతో ఇక్కడ జరగాల్సిన మ్యాచులను నిలిపివేశారు.

వాస్తవంగా దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ బుధవారం పుణెలోనే జరగాలి. కానీ దిల్లీ శిబిరంలో ఆరుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో మ్యాచును ముంబయికి మార్చారు. జట్లు ఎక్కువగా ప్రయాణం చేస్తే ఇంకా కేసులు పెరుగుతాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే శుక్రవారం జరిగే రాజస్థాన్‌, దిల్లీ పోరునూ వాంఖడేకు తరలించారు. టిమ్ సీఫెర్ట్‌కు కరోనా రావడంతో పంజాబ్‌ మ్యాచ్‌పై సాయంత్రం వరకు సందిగ్ధం నెలకొన్న సంగతి తెలిసిందే.

దిల్లీలో మొదట ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హర్ట్‌కు కొవిడ్‌ సోకింది. అక్కడ్నుంచి ముగ్గురు సిబ్బందికీ వచ్చింది. మిచెల్‌ మార్ష్‌కు రావడంతో ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం చేసిన టెస్టుల్లో న్యూజిలాండ్‌ కీపర్‌ టిమ్‌ సీఫెర్ట్‌కు పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఈ సంఖ్య ఆరుకు చేరింది.

'దిల్లీ శిబిరంలో ఆరో కొవిడ్‌ కేసు రావడంతో ముందు జాగ్రత్తగా రాజస్థాన్‌తో మ్యాచు వేదికను మార్చాలని నిర్ణయించుకున్నాం. బుధవారం చేసిన ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులో న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ టిమ్‌ సీఫెర్ట్‌కు పాజిటివ్‌ వచ్చింది' అని బీసీసీఐ తెలిపింది.

పంజాబ్‌పై దిల్లీ ప్రదర్శన సూపర్‌

DC vs PBKS, Match Highlights: ఐపీఎల్‌ 2022లో దిల్లీ క్యాపిటల్స్‌ అతిపెద్ద విక్టరీ సాధించింది. కేవలం 10.3 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించింది. పంజాబ్‌ నిర్దేశించిన 116 పరుగుల టార్గెట్‌ను 9 వికెట్ల తేడాతో ఛేదించింది. పృథ్వీ షా (41; 20 బంతుల్లో 7x4, 1x6), డేవిడ్‌ వార్నర్‌ (60*; 30 బంతుల్లో 10x4, 1x6) నువ్వానేనా అన్నట్టుగా ఆడారు. కేవలం పవర్‌ప్లేలోనే 81 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లను చితకబాదారు. ఐపీఎల్‌ 2022లో అత్యధిక పవర్‌ప్లే స్కోరు సాధించారు. 6.3వ బంతికి షాను రాహుల్‌ చాహర్‌ ఔట్‌ చేసినా సర్ఫరాజ్‌ ఖాన్‌ (12*; 13 బంతుల్లో 1x4) సాయంతో వార్నర్‌ గెలిపించేశాడు.  

దిల్లీ బౌలింగ్‌కు విలవిల

మొదట బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్‌ కింగ్స్‌కు ఏ మాత్రం కలిసి రాలేదు. పవర్‌ప్లేలో 47 పరుగులు చేసి 3 వికెట్లు చేజార్చుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ నాలుగు బౌండరీల బాదడం వల్లే ఆ మాత్రం పరుగులు వచ్చాయి. అయితే దిల్లీ బౌలర్ల సమష్టి ప్రదర్శనకు పంజాబ్‌ విలవిల్లాడింది. సగటున ప్రతి 10 పరుగులకు ఒక వికెట్‌ చేజార్చుకున్నారు. అయితే జితేశ్ శర్మ (32) ఓ ఐదు బౌండరీలు బాదడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. తొలి వికెట్‌కు ధావన్‌, మయాంక్‌ (33), ఐదో వికెట్‌కు షారుక్‌, జితేశ్‌ (31) నెలకొల్పిన భాగస్వామ్యాలే స్కోరును వంద దాటించాయి. ఖలీల్‌, లలిత్‌, అక్షర్‌, కుల్‌దీప్‌ తలో 2 వికెట్లు తీయడంతో పంజాబ్‌ 115కు ఆలౌటైంది.

Continues below advertisement