ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటే పరుగుల ప్రవాహం, పరుగుల వరదే అని అంతా అనుకుంటారు. చాలా సార్లు బౌలర్ల కంటే బ్యాటర్ల ఆధిపత్యమే కనిపిస్తుంది. కానీ ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఐపీఎల్ 2024 వరకు పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న బ్యాటర్ల జాబితా పరిశీలిస్తే షాకవుతారు. ఎందుకంటే 17 సీజన్లలో కేవలం రెండు సీజన్లలో మాత్రమే ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ప్లేయర్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ సీజన్7లో 2014లో రాబిన్ ఉతప్ప (KKR), ఐపీఎల్ 14వ సీజన్ 2021లో రుతురాజ్ గైక్వాడ్ (CSK) లు మాత్రమే ఆ సీజన్లలో తమ జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపి ప్రత్యేకమైన ఆటగాళ్లుగా నిలిచారు.

  1. 2008లో ఆరెంజ్ క్యాప్ విజేత షాన్ మార్ష్ (KXIP) 11 మ్యాచ్‌లాడి 616 పరుగులు సాధించాడు. కానీ ఐపీఎల్ సీజన్ 1 విజేతగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. 
  2. 2009లో మాథ్యూ హెడెన్ (CSK) ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. 12 మ్యాచ్‌లాడిన హెడెన్ 572 రన్స్ చేశాడు. కానీ ఐపీఎల్ 2 విజేతగా దక్కన్ ఛార్జర్స్ నిలిచింది.
  3. 2010లో సచిన్ టెండూల్కర్ (MI) 15 మ్యాచ్‌లాడి 618 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కానీ ఐపీఎల్ 3 సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్
  4. 2011లో క్రిస్ గేల్ (RCB) ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. 12 మ్యాచ్‌లలో 608 పరుగులు చేశాడు. కానీ ఐపీఎల్ 4 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.
  5. 2012లో క్రిస్ గేల్ (RCB) వరుసగా రెండో సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. 15 మ్యాచ్‌లలో గేల్ 733 రన్స్ సాధించాడు. కానీ కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 5 విజేత అయింది
  6. 2013లో మైకెల్ హస్సీ (CSK) 16 మ్యాచ్‌లలో 733 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కానీ ఐపీఎల్ 6 విజేతగా ముంబై ఇండియన్స్ కప్ అందుకుంది
  7. 2014లో రాబిన్ ఉతప్ప (KKR) ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 16 మ్యాచ్‌లాడిన ఉతప్ప 660 పరుగులు చేసి కోల్‌కతాకు రెండో ఐపీఎల్ ట్రోఫీ రావడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ 7 విజేతగా కేకేఆర్ నిలిచింది.
  8. 2015లో డేవిడ్ వార్నర్ (SRH) 14 మ్యాచ్‌లలో 562 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. కాపీ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 8 విజేతగా అవతరించింది.
  9. 2016లో విరాట్ కోహ్లీ (RCB) 16 మ్యాచ్‌లలో 973 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. ఏ సీజన్‌లోనైనా ఇదే ప్లేయర్ అత్యధిక స్కోరు. కానీ ఐపీఎల్ 9 సీజన్ విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్.
  10. 2017లో డేవిడ్ వార్నర్ (SRH) ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. 14 మ్యాచ్‌లలో 641 పరుగులు చేశాడు. కానీ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్ 10 విజేతగా మూడో కప్ సొంతం చేసుకుంది.
  11. 2018లో కేన్ విలియమ్సన్ (SRH) 17 మ్యాచ్‌లలో 735 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ సీజన్ 11 విజేతగా నిలిచింది. సీఎస్కేకు ఇది మూడో టైటిల్
  12. 2019లో డేవిడ్ వార్నర్ (SRH) మూడోసారి ఆరెంజ్ క్యాప్ నెగ్గాడు. 12 మ్యాచ్‌లలో 692 పరుగులు చేశాడు. కానీ ఐపీఎల్ సీజన్ 12 విజేతగా ముంబై ఇండియన్స్(4) నిలిచింది.
  13. 2020లో కేఎల్ రాహుల్ (KXIP) 14 మ్యాచ్‌లలో 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కానీ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్ 13 విజేతగా నిలిచి 5వ టైటిల్ దక్కించుకుంది
  14. 2021లో రుతురాజ్ గైక్వాడ్ (CSK) 16 మ్యాచ్‌లలో 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విన్నర్ అయ్యాడు. ఐపీఎల్ సీజన్ 14 విజేతగా సీఎస్కే నిలిచింది. నాలుగో టైటిల్ కైవసం చేసుకుంది.
  15. 2022లో జాస్ బట్లర్ (RR) తొలి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. 17 మ్యాచ్‌లలో 863 పరుగులు చేశాడు. కానీ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ సీజన్ 15 విజేతగా నిలిచింది.
  16. 2023లో శుభ్‌మన్ గిల్ (GT) 17 మ్యాచ్‌లలో 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ సీజన్ 16 విజేతగా నిలిచి 5వ టైటిల్ అందుకుంది.
  17. 2024లో విరాట్ కోహ్లీ (RCB) 15 మ్యాచ్‌లలో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచినా.. ఐపీఎల్ సీజన్ 17 విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. కేకేఆర్‌కు ఇది మూడో ఐపీఎల్ ట్రోఫీ.  
సీజన్ ప్లేయర్ మ్యాచ్‌లు పరుగులు
2008 షాన్ మార్ష్ (KXIP) 11 616
2009 మాథ్యూ హెడెన్ (CSK) 12 572
2010 సచిన్ టెండూల్కర్ (MI) 15 618
2011 క్రిస్ గేల్ (RCB) 12 608
2012 క్రిస్ గేల్ (RCB) 15 733
2013 మైకెల్ హస్సీ (CSK) 16 733
2014 రాబిన్ ఉతప్ప (KKR) 16 660
2015 డేవిడ్ వార్నర్ (SRH) 14 562
2016 విరాట్ కోహ్లీ (RCB) 16 973
2017 డేవిడ్ వార్నర్ (SRH) 14 641
2018 కేన్ విలియమ్సన్ (SRH) 17 735
2019 డేవిడ్ వార్నర్ (SRH) 12 692
2020 కేఎల్ రాహుల్ (KXIP) 14 670
2021 రుతురాజ్ గైక్వాడ్ (CSK) 16 635
2022 బట్లర్ (RR) 17 863
2023 శుభ్‌మన్ గిల్ (GT) 17 890
2024 విరాట్ కోహ్లీ (RCB) 15 741