India Next T20 Squad Based Selection On IPL: క్రికెట్ లో గత చరిత్ర, పాత రికార్డులను పక్కన పెట్టి కేవలం ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ నే ప్రామాణికంగా తీసుకుంటే వచ్చే ఇండియా టీ20 టీమ్ కంప్లీట్ గా షాకింగ్ గా ఉంటుంది. సీనియార్టీని, పాత క్రెడిట్స్ ను పూర్తిగా తుడిచేసి సెలెక్ట్ చేసిన ఈ 15 మంది స్క్వాడ్ ట్రెండ్ సెట్ చేస్తోంది. గత వరల్డ్ కప్ టీమ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లకు ఈ లెక్కన టీమ్ లో చోటే దక్కదు. కేవలం ఈ ఒక్క సీజన్ లో అద్భుతంగా ఆడిన అభిషేక్, ఇషాన్, అక్షర్, రింకూ, సిరాజ్, వరుణ్ చక్రవర్తి మాత్రమే పాత టీమ్ నుంచి ఇందులో ప్లేస్ దక్కించుకోగలిగారు.
కెప్టెన్ గా టైటిల్ విన్నర్ రజత్ పాటిదార్..
ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ టీమ్ కు కెప్టెన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలిపిన రజత్ పాటిదార్ ను విశ్లేషకులు ఎంపిక చేశారు. అతడు ఈ సీజన్ లో 193 పైగా స్ట్రైక్ రేట్ తో 501 రన్స్ చేసి లీడర్ షిప్ క్వాలిటీస్ చూపించాడు. ఇక ఈ స్క్వాడ్ లో మోస్ట్ పవర్‌ఫుల్ సెలెక్షన్ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. అతడు ఏకంగా 776 రన్స్, 72 సిక్సర్లతో 238 స్ట్రైక్ రేట్ తో విరుచుకుపడి డైరెక్ట్ గా ప్లేయింగ్ ఎలెవెన్ లోకి వచ్చాడు. అతడితో పాటు లెఫ్ట్ హ్యాండ్ హిట్టర్ అభిషేక్ శర్మ (563 రన్స్) ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. మూడో ప్లేస్ లో 602 రన్స్ చేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సెట్ అయ్యాడు.
సూర్య, హార్దిక్ లపై వేటు..
స్టార్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ 732 రన్స్ చేసినా టీమ్ కాంబినేషన్ వల్ల బెంచ్ కే పరిమితం కాగా ఐదో నంబర్ లో మిడిల్ ఆర్డర్ ను బ్యాలెన్స్ చేయడానికి శ్రేయస్ అయ్యర్ (498 రన్స్) ను తీసుకున్నారు. ఫినిషర్ గా రింకూ సింగ్ సేవలు అందిస్తాడు. హార్దిక్ పాండ్యా ఈ సీజన్ లో ఫెయిలవడంతో అతడి ప్లేస్ లో 302 రన్స్, 8 వికెట్లు తీసిన యంగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి టీమ్ లోకి వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కంటే బెటర్ గా 226 రన్స్, 14 వికెట్లు తీసిన కృనాల్ పాండ్యా స్పిన్ ఆల్ రౌండర్ గా ఎంపికయ్యాడు. అక్షర్ పటేల్ బ్యాకప్ గా బెంచ్ కే పరిమితమయ్యాడు.
బౌలింగ్ లో భువనేశ్వర్ రీఎంట్రీ..
ఈ సీజన్ లో కేవలం 4 వికెట్లే తీసిన వరల్డ్ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సెలెక్షన్ రూల్ వల్ల చోటు దక్కలేదు. అతడి స్థానంలో ఐపీఎల్ లో 28 వికెట్లతో చెలరేగిన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ మెయిన్ బౌలర్ గా మారాడు. కొత్త బాల్ తో 19 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, మిడిల్ ఓవర్ల కోసం వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవెన్ లోకి వచ్చారు. 21 వికెట్లు తీసిన అన్షుల్ కాంబోజ్ ఎకానమీ కొంచెం ఎక్కువగా ఉన్నా వికెట్ టేకింగ్ ఎబిలిటీ వల్ల 15 మంది టీమ్ లో చోటు సంపాదించాడు. సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అర్ష్ దీప్ సింగ్ ఈ సీజన్ లో ఆకట్టుకోలేక రేస్ లో వెనకబడ్డారు.
