Cricketer swimming In cricket ground : క్రికెట్ గ్రౌండ్ లో ఏం చేస్తారు ?. అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు?. ఇదేం పిచ్చి ప్రశ్న. క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడతారు అని ఠక్కున సమాధానం చెబుతారు. కాదు.. స్విమ్మింగ్ చేస్తారు అని కౌంటర్ ఇస్తే మండిపోతుంది. స్విమ్మింగ్ చేయాలంటే కనీసం నీళ్లు ఉండాలి. క్రికెట్ గ్రౌండ్ లో నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి ?. అనే డౌట్ వస్తుంది. నిజానికి ఇది విచిత్రమే. కానీ జరగకూడదని లేదుగా. జరిగింది కూడా.
ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కాబోతోంది. మిగిలిన లీగ్ మ్యాచ్‌లతో పాటు క్వాలిఫయర్స్, ఎలిమినేటర్స్ ను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రీ స్టార్ట్ కోసం ఆయా జట్లు తమ హోం గ్రౌండ్స్ కు చేరుకున్నాయి. మ్యాచులు ఉన్న గ్రౌండ్లకు చేరుకున్నాయి. అలాగే బెంగళూరు జట్టు కూడా తమ హోం స్టేడియానికి చేరుకుంది. అయితే వారికి వరుణుడు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. రోజంతా కురిసిన వర్షంతో గ్రౌండ్ నీటితో నిండిపోయింది.
కొన్ని చోట్ల నిలబడిపోయిన నీటిని చూసి ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ కు అల్లరి చేయాలనిపించింది. అంతే అండర్వేర్ మీద వెళ్లిపోయారు. గంతులేశారు. ఈ క్రమంలో కాస్త మడుగు ఉన్న చోటకు వెళ్లి స్విమ్మింగ్ చేసేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
టిమ్ డే సింగపూర్-ఆస్ట్రేలియా క్రికెటర్, టీ20 క్రికెట్‌లో దూకుడైన బ్యాటింగ్, బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టిమ్ తండ్రి రాడ్ డేవిడ్ సింగపూర్ తరపున క్రికెట్ ఆడాడు. 1990లలో ఇతని కుటుంబం ఆస్ట్రేలియా నుండి సింగపూర్‌కు వలస వెళ్లింది. 1997 ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత, టిమ్ రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు కుటుంబం పెర్త్ కు తిరిగి వెళ్లింది. టిమ్ డేవిడ్ 2019లో సింగపూర్ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. , సింగపూర్ తరపున ఆడినప్పటికీ, ఆస్ట్రేలియా తరపున ఆడేందుకు అర్హత సాధించాడు. 2022 T20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు.
ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ఐపీఎల్ ను రాయల్ చాలెంజర్స్ గెల్చుకోలేదు. అందుకే ఈ సారి ఆ జట్టు ఆ లోటు తీర్చుకుంటుందని భావిస్తూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా యుద్ధ పరిస్థితుల కారణంగా టోర్నీ రద్దు అయినంత పని అయింది. అయితే మళ్లీ వెంటనే ప్రారంభమవుతోంది. సత్తా చూపించాలని అనుకుంటోంది.