బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లోని 58వ మ్యాచ్ శనివారం, మే 17న రాత్రి 7:30 గంటలకు జరగనుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగనుంది.

Continues below advertisement

ఆర్‌సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉండగా.. మరో విజయంతో ప్లేఆఫ్ స్థానాన్ని దక్కించుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. అదే సమయంలో ఆరవ స్థానంలో ఉన్న కేకేఆర్ (KKR) ఇంకా ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తరువత మ్యాచ్ లో తప్పనిసరిగా విజయం సాధించాలి. కానీ ప్రతికూల వాతావరణం కేకేఆర్ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. 

వర్షం వల్ల కేకేఆర్ ప్రస్థానం ముగియనుందా?

Continues below advertisement

గురువారం బెంగళూరు నగరంలో భారీ వర్షం కురిసింది. తాజా వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, శనివారం సైతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదివరకే వర్షం కారణంగా కేకేఆర్ ఆడాల్సిన ఓ మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా శనివారం జరగాల్సిన కేకేఆర్ vs ఆర్‌సీబీ మ్యాచ్ కనుక రద్దు అయితే, రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ లభిస్తుంది. ఆర్‌సీబీ ఆ ఒక్క పాయింట్‌తో ప్లేఆఫ్ అర్హత సాధించనుంది. మరోవైపు వర్షం కేకేఆర్ ప్లే ఆఫ్ అవకాశాలను తుడిచిపెట్టినట్లే. 

 కోల్‌కతా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 లీగ్ దశ మ్యాచ్‌లలో 12 మ్యాచ్‌లు ఆడి, 5 గెలిచింది, 6 ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. వారికి ఖాతాలో ప్రస్తుతం 13 పాయింట్లు ఉన్నాయి. 2 లీగ్ దశ మ్యాచ్‌లు (మే 17న ఆ, మే 25న ఎస్‌ఆర్‌హెచ్‌తో) మిగిలి ఉన్నాయి.

రేపు కేకేఆర్‌, ఆర్‌సీబీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే మ్యాచ్ నుంచి లభించే ఒక్క పాయింట్ వారిని 14కి తీసుకువెళుతుంది. అది టాప్ ఫోర్ ఫినిష్‌కు సరిపోదు. కనుక కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలవాలంటే కనీసం 16 పాయింట్లకు దాటాలి. అప్పుడు కనీసం చివరి వరకు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి కేకేఆర్ ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయి.  16 పాయింట్లు పొందడానికి లీగ్ చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది.  ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌లపై విజయం సాధిస్తేనే కోల్‌కతాకు ప్లే ఆఫ్ ఆశలు ఇంకా మిగిలి ఉంటాయి. 

సాధారణంగా, ఐపీఎల్ లీగ్ దశలో కనీసం 16 పాయింట్లు సాధించిన జట్లకు ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కుతోంది. అయితే 16 పాయింట్లు దక్కినా సరైన రన్ రేట్ లేకపోతే ఆ జట్టు ఇంటి దారి పట్టనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ శనివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించగలిగితే, వారు కీలకమైన 2 పాయింట్లను సాధిస్తారు. పాయింట్స్ టేబుల్‌లో 15 పాయింట్లకు చేరతారు. అయితే, ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి కేకేఆర్ కచ్చితంగా మిగిలిన 2 మ్యాచ్ లలో ఆర్సీబీ, సన్‌రైజర్స్ లపై విజయం సాధించక తప్పదు. అప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ లీగ్ దశను 17 పాయింట్లతో ముగించి ప్లే ఆఫ్ ఆశలను సీజవంగా నిలుపుకుంటుంది.

ఒక వారం విరామం తర్వాత ఐపీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది

భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 ఒక వారం పాటు నిలిపివేయబడింది. ఈ టోర్నమెంట్ ఇప్పుడు మే 17 నుండి ఆర్‌సీబీ vs కేకేఆర్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.