Just In





IPL 2025 Glenn Maxwell Reprimanded: మ్యాక్స్ వెల్ కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో కోత.. అతను చేసిన తప్పేమిటంటే..?
మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్లేయర్లు అప్పుడప్పుడు హద్దులు దాటుతుంటారు. ఐపీఎల్ ఆటగాళ్ల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించినందుకుగాను తాజాగా పంజాబ్ ప్లేయర్ మ్యాక్స్ వెల్ పై జరిమానా పడింది.

IPL 2025 PBKS Latest Updates: పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ పై బీసీసీఐ కొరడా ఝళిపించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ సందర్బంగా క్రీడా పరికరాలను అవమానించి నుందుకు గాను అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఐపీఎల్ ఆటగాళ్ల ప్రవర్తన నియామావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించడం ద్వారా లెవల్ 1 నేరానికి పాల్పడినట్లుగా బీసీసీఐ తేల్చింది. దీంతో అతనికి శిక్ష విధించినట్లుగా తెలుస్తోంది. . ఇక మ్యాచ్ రిఫరీ విధించిన శిక్షను మ్యాక్స్ వెల్ ఒప్పుకోవడంతో దీనిప ఫర్దర్ గా ఎలాంటి హియరింగ్ ఉండబోదని తేల్చింది.
ఇక ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ (42 బంతుల్లో 103, 7 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసిన ఇండియన్ గా నిలిచాడు. బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (2/45) ఉన్నంతలో కాస్త ఫర్వాలేదనిపించాడు. అనంతరం ఛేదనలో మొత్తం ఓవర్లన్నీ ఆడిన సీఎస్కే 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఓపెనర్ డేవన్ కాన్వే స్లో ఫిఫ్టీ (49 బంతుల్లో 69 రిటైర్డ్ ఔట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కాస్త విసుగెత్తించాడు. లోకీ ఫెర్గూసన్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఈ విజయంతో పంజాబ్ నాలుగో ప్లేస్ కు ఎగబాకింది.
ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించడంతో..
ఐపీఎల్ ప్రవర్తన నియమావళి ప్రకారం ఆర్టికల్ 2.2లో క్రికెటర్ పరికరాలు, బట్టలు, గ్రౌండ్ ఎక్విప్మెంట్ ఇతర వస్తువులను అగౌరవ పరచడం నేరం. అందుకు తగినశిక్ష ఉంటుంది. అలాగే ఇదే అర్టికల్ కింద వికెట్లను తన్నడం, లేదా నిర్లక్ష్య పూరితంగా ప్రవర్తించడం, అలాగే అడ్వర్టైజింగ్ బోర్డులు, బౌండరీ ఫెన్సులు, డ్రెస్సింగ్ రూం డోర్లు, అద్దాలు, కిటికీలు, ఇతర వస్తువులపై ప్రతాపం చూపించడం నిషిద్దం. మ్యాక్స్ వెల్ తాజాగా ఇలాంటి పనికి పాల్పడినందుకుగాను ఐపీఎల్ యాజమాన్యం శిక్ష విధించినట్లు తెలుస్తోంది.
అంతంతమాత్రంగానే..
ఇక ఈ సీజన్ లో పంజాబ్ తరపున ఆడతున్న మ్యాక్స్ వెల్ అంతంతమాత్రంగానే రాణిస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన మ్యాక్సీ.. కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఫస్ట్ గుజరాత్ టైటాన్స్ పై డకౌట్ అయిన మ్యాక్సీ.. లక్నో సూపర్ జెయింట్స్ పై బ్యాటింగ్ చేయలేదు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ పై 30 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కేవలం ఒక్క పరుగుకే ఆలౌటై, నిరాశపర్చాడు. అయితే స్పిన్నర్ గా మాత్రం ఫర్వలేదనిపిస్తున్నాడు. గుజరాత్ , లక్నో, చెన్నై ఒక్కో వికెట్ చొప్పున మూడు వికెట్లు తీశాడు. రాజస్థాన్ పై మాత్రం వికెట్లేమీ రాలేదు. ఓవరాల్ విధ్వంసక ప్లేయర్ గా పేరున్న తన నుంచి భారీ ఇన్నింగ్స్ ను పంజాబ్ యాజమాన్యం ఆశిస్తోంది.