DC vs RR IPL 2024 Preview and Prediction : ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్(DC) సిద్ధమైంది. ఐపీఎల్‌ (IPL)ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో పటిష్టమైన రాజస్థాన్‌ రాయల్స్‌(RR)తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. రిషబ్ పంత్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ మరోసారి  విధ్వంసం సృష్టించాలని ఢిల్లీ కోరుకుంటోంది. మరోవైపు రాజస్థాన్‌  ఇప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే అధికారికంగా ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా రాజస్థాన్‌ నిలుస్తుంది.

 

 పాయింట్ల  గట్టి పోటీ

ఢిల్లీ క్యాపిటల్స్‌  ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడి అయిదు మ్యాచుల్లో గెలిచి ఆరు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో గెలవడం ఢిల్లీకి తప్పనిసరి. అప్పడే పదహారు పాయింట్లతో ఢిల్లీ ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒక్క మ్యాచ్‌ ఓడినా ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారుతాయి. కోల్‌కత్తా 11 మ్యాచుల్లో 16 పాయింట్లు, రాజస్థాన్‌ రాయల్స్‌ 10 మ్యాచుల్లో 16 పాయింట్లతో దాదాపుగా ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. ఇంకో రెండు బెర్తులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు జట్లు కూడా 11 మ్యాచుల్లో  12 పాయింట్లు సాధించి టాప్‌ 5లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ జట్లను అధిగమించాలంటే పంత్‌కు మూడు మ్యాచుల్లోనూ విజయం అవసరం. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే ‌ప్లాట్‌ పిచ్‌పై పంత్‌, మెక్‌గుర్క్‌ రాణిస్తే ఢిల్లీకి తిరుగుండదు. రాజస్థాన్‌ బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌, రియాన్ పరాగ్‌లను 

ఖలీల్ అహ్మద్‌, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్‌ కట్టడి చేయాలని ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. పంత్‌, మెక్‌గర్క్‌ మరోసారి భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశారు. కానీ పటిష్టమైన రాజస్థాన్‌ బౌలింగ్‌ను వీళ్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఢిల్లీ పిచ్‌పై యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎదుర్కోవడం అంత సులభం కాదు

 

విధ్వంసకరంగా రాజస్థాన్‌

రాజస్థాన్‌ జట్టు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. రియాన్, కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్‌మెయర్, ధృవ్ జురెల్‌లతో రాజస్తాన్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది.   ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ , అవేష్ ఖాన్,  రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లతో బౌలింగ్‌ కూడా చాలా బలంగా ఉంది.  అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రాయల్స్‌ను ఆపడం కష్టమే కావచ్చు. 

 

జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్‌: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, యశ్ ధుల్, షాయ్ హోప్, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, స్వస్తిక్ చికారా, ఇషాంత్ శర్మ, ఝే రిచర్డ్‌సన్, రసిఖ్ దార్ సలామ్, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, సుమిత్ కుమార్, అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్.

 

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్‌), జోస్ బట్లర్, షిమ్రోన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, కేశవ్ మహరాజ్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ , అవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్.