DC vs PBKS, IPL 2022 LIVE: దిల్లీ అంటే ఇదీ! వార్నర్, షా ఊచకోతతో 10.3 ఓవర్లకే పంజాబ్‌పై విక్టరీ
DC vs PBKS, IPL 2022 LIVE:ఐపీఎల్ 2022లో 32వ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. బ్రబౌర్న్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచులో విజయం సాధించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
దిల్లీ 10.3 ఓవర్లలో విక్టరీ అందుకుంది. డేవిడ్ వార్నర్ (60), సర్ఫరాజ్ (12) అజేయంగా నిలిచారు. దిల్లీ 9 వికెట్ల తేడాతో గెలిచింది.
ఎలిస్ 9 పరుగులు ఇచ్చాడు. వార్నర్ (55) బౌండరీ బాది 53వ హాఫ్ సెంచరీ చేశాడు. సర్ఫరాజ్ (11) అతడికి తోడుగా ఉన్నాడు. వారికి ౩ పరుగులే అవసరం.
రాహుల్ చాహర్ 12 పరుగులు ఇచ్చాడు. సర్ఫరాజ్ (9) బౌండరీ కొట్టాడు. వార్నర్ (49) ఆఖరి బంతిని ఫోర్‌గా మలిచాడు.
రబాడా 8 పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని వార్నర్ (44) సిక్స్ కొట్టాడు. సర్ఫరాజ్ (2) నిలకడగా ఆడుతున్నాడు.
రాహుల్ చాహర్ 3 పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి పృథ్వీ షా (41)ని ఔట్ చేశాడు. వార్నర్ (37), సర్ఫరాజ్ (1) నిలకడగా ఆడుతున్నారు.
నేథన్ ఎలిస్ 6 పరుగులు ఇచ్చాడు. పృథ్వీ షా (40) ఒక బౌండరీ బాదాడు. వార్నర్ (36) నిలకడగా ఆడాడు. దిల్లీ పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసింది.
అర్షదీప్ 17 పరుగులు ఇచ్చాడు. డేవిడ్ వార్నర్ (36), పృథ్వీ షా (36) కలిసి మూడు బౌండరీలు బాదారు.
రబాడాకు వార్నర్ చుక్కలు చూపించాడు. ఏకంగా మూడు బౌండరీలు కొట్టాడు. దాంతో 15 పరుగులు వచ్చాయి. పృథ్వీ షా (26) మరో ఎండ్‌లో ఉన్నాడు.
వైభవ్ 17 పరుగులు ఇచ్చాడు. డేవిడ్ వార్నర్ (16) రెండు బౌండరీలు బాదేశాడు. ఆఖరి బంతిని పృథ్వీ షా (26) సిక్స్ కొట్టాడు.
రబాడా 12 పరుగులు ఇచ్చాడు. డేవిడ్ వార్నర్ (6), పృథ్వీ షా (19) చెరో బౌండరీ కొట్టారు.
వైభవ్ అరోరా 14 పరుగులు ఇచ్చాడు. పృథ్వీ షా (14) మూడు చక్కని బౌండరీలు బాదాడు. వార్నర్ (0) మరో ఎండ్‌లో ఉన్నాడు.
ముస్తాఫిజుర్ 4 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. రెండో బంతికి బౌండరీ బాదిన అర్షదీప్ (9)ను ఆఖరి బౌంతికి రనౌట్ చేశాడు. వైభవ్ (2) నాటౌట్‌గా నిలిచాడు.
ఖలీల్ 2 పరుగులు ఇచ్చాడు. అర్షదీప్ (5), వైభవ్ అరోరా (2) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు.
లలిత్ యాదవ్ 5 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. నాలుగో బంతికి రాహుల్ చాహర్ (12)ను ఔట్ చేశాడు. అర్షదీప్ (4), వైభవ్ (1) నిలకడగా ఆడుతున్నారు.
ముస్తాఫిజుర్ 7 పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని రాహుల్ చాహర్ (8) సిక్సర్ కొట్టాడు. అర్షదీప్ (4) అతడికి తోడుగా ఉన్నాడు.
అక్షర్ ఒక పరుగు ఇచ్చాడు. అర్షదీప్ (4), రాహుల్ చాహర్ (1) ఆచితూచి ఆడుతున్నారు.
ఖలీల్ వికెట్ తీసి 6 పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి షారుక్ (12) ఔటయ్యాడు. ఆఖరి బంతికి అర్షదీప్ (4) బౌండరీ కొట్టాడు. రాహుల్ చాహర్ (0) నిలకడగా ఆడుతున్నాడు.
కుల్‌దీప్ తన పవర్ చూపించాడు. కేవలం 3 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. నాలుగో బంతికి రబాడా (2), ఆఖరి బంతికి నేథన్ ఎలిస్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. షారుక్ (10) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
అక్షర్ పటేల్ వికెట్ తీసి 2 పరుగులు ఇచ్చాడు. తొలి బంతికి టాప్ స్కోరర్ జితేశ్ (32)ను ఎల్బీ చేశాడు. రబాడా (1), షారుక్ (9) నిలకడగా ఆడుతున్నారు.
కుల్‌దీప్ 4 పరుగులు ఇచ్చాడు. జితేశ్ (32), షారుక్ (7) సింగిల్స్ తీశారు. బౌండరీలు కొట్టడానికి వీలవ్వడం లేదు.
అక్షర్ 4 పరుగులు ఇచ్చాడు. జితేశ్ (30) దూకుడుగా ఆడుతున్నాడు. షారుక్ (5) ఆచితూచి ఆడుతున్నాడు.
ముస్తాఫిజుర్ 6 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని జితేశ్ (22) బౌండరీకి పంపించాడు. షారుక్ (1) నిలకడగా ఆడుతున్నాడు.
కుల్‌దీప్ 9 పరుగులు ఇచ్చాడు. జితేశ్ (17) రెండు బౌండరీలు కొట్టాడు. షారుక్ (0) ఇకా ఖాతా తెరవలేదు.
ఖలీల్ 7 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. నాలుగోబంతికి ప్రమాదకరమైన జానీ బెయిర్‌స్టో (9)ని ఔట్ చేశాడు. జితేశ్ (8), షారుఖ్ (0) నిలకడగా ఆడుతున్నారు.
అక్షర్ పటేల్ 3 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. మూడో బంతిని ముందుకొచ్చి ఆడబోయిన లియామ్ లివింగ్‌స్టన్ (2)ను పంత్ స్టంపౌట్ చేశాడు. జానీ బెయిర్ స్టో (9), జితేశ్ శర్మ (1) ఆచితూచి ఆడుతున్నారు.
ముస్తాఫిజుర్ 11 పరుగులిచ్చి వికెట్ తీశాడు. మయాంక్ అగర్వాల్ (24) ఔటయ్యాడు. జానీ బెయిర్‌స్టో (8) ఆఖరి రెండు బంతుల్ని బౌండరీకి పంపించాడు. లియామ్ లివింగ్‌స్టన్ (1) ఆచితూచి ఆడుతున్నాడు.
లలిత్ యాదవ్ బ్రేక్ ఇచ్చాడు. 6 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. నాలుగో బంతికి ధావన్ (9) ఔటయ్యాడు. మయాంక్ (22) ఒక బౌండరీ బాదాడు.
శార్దూల్ 14 పరుగులు ఇచ్చాడు. మయాంక్ (22) మూడు చక్కని బౌండరీలు బాదేశాడు. ధావన్ (3) అతడికి తోడుగా ఉన్నాడు.
మరో ఎండ్ నుంచి ఖలీల్ అహ్మద్ బౌలింగ్ ఆరంభించాడు. 6 పరుగులు ఇచ్చాడు. మయాంక్ (9), ధావన్ (3) నిలకడగా ఆడుతున్నారు.
శార్దూల్ ఠాకూర్ తొలి ఓవర్ వేశాడు. 7 పరుగులు ఇచ్చాడు. మయాంక్ అగర్వాల్ (7) ఒక బౌండరీ కొట్టాడు. శిఖర్ ధావన్ (0) ఇకా పరుగుల ఖాతా తెరవలేదు.
మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, కాగిసో రబాడా, నేథన్ ఎలిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్, రోమన్ పావెల్, లలిత్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
DC vs PBKS, IPL 2022 LIVE:ఐపీఎల్ 2022లో 32వ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. బ్రబౌర్న్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచులో విజయం సాధించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
DC vs PBKS, IPL 2022 LIVE: టాస్ గెలిచిన దిల్లీ: ఫీల్డింగ్ ఎంచుకున్న రిషభ్
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
DC vs PBKS, IPL 2022 LIVE: దిల్లీ జట్టు
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్, రోమన్ పావెల్, లలిత్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
DC vs PBKS, IPL 2022 LIVE: పంజాబ్ జట్టు
మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, కాగిసో రబాడా, నేథన్ ఎలిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్
DCలో కొవిడ్ కలకలం
దిల్లీ క్యాపిటల్స్‌లో మొదట ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్‌కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో ఏప్రిల్ 16 నుంచి దిల్లీ శిబిరం మొత్తాన్ని ప్రత్యేక బయో బుడగలో ఉంచారు. ఇతరులతో కలవనీయడం లేదు. మరో రెండు రోజులకు మిచెల్ మార్ష్‌కు పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని డీసీ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాంతో బుధవారం పుణెలో జరగాల్సిన మ్యాచును ముంబయికి మార్చారు. ప్రయాణాలు చేయనీయడం లేదు.
ఏప్రిల్ 16 నుంచి దిల్లీ శిబిరంలో ప్రతిరోజు కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన టెస్టుల్లో ఆటగాళ్లకు నెగెటివ్ వచ్చినట్టు సమాచారం వచ్చింది. అయితే బుధవారం ఉదయం టెస్టులు చేసి అందులో నెగెటివ్ రావడంతో మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్ నిర్వాహక కమిటీ నిర్ణయించింది. అయితే టిమ్ సీఫెర్ట్ కు కొవిడ్ వచ్చినట్టు తెలిసింది.
పంజాబ్‌తో మ్యాచ్ నిర్వహించాలంటే దిల్లీ బృందంలో 12 మంది ఆటగాళ్లకు నెగెటివ్ రావాల్సి ఉంటుంది. అందులో ఏడుగురు భారతీయులు కచ్చితంగా ఉండాలి. ఇవన్నీ సాధ్యమవ్వడంతో ఈ మ్యాచ్ జరుగుతోంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -