DC Vs MI IPL 2022 LIVE: మైటీ మంబయికి దిల్లీ షాక్‌: లలిత్‌ యాదవ్‌, అక్షర్‌ గెలుపు ఢంకా

DC vs MI: ఐపీఎల్‌ 2022లో రెండో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) బ్రబౌర్న్‌ స్టేడియంలో తలపడనున్నాయి.

ABP Desam Last Updated: 27 Mar 2022 07:17 PM
మైటీ మంబయికి దిల్లీ షాక్‌: లలిత్‌ యాదవ్‌, అక్షర్‌ గెలుపు ఢంకా

DC vs MI match live updates: దిల్లీ విజయం సాధించింది. బుమ్రా వేసిన 18.2 బంతికి అక్షర్‌ బౌండరీ సాధించి గెలుపు అందించాడు. లలిత్‌ యాదవ్‌ అజేయంగా నిలిచాడు.

18 ఓవర్లకు దిల్లీ : 174-6

DC vs MI match live updates: దిల్లీ విజయానికి చేరువైంది. డేనియెల్‌ సామ్స్‌ 24 పరుగులు ఇచ్చాడు. అక్షర్‌ (34) రెండు సిక్సర్లు, లలిత్‌ (47) ఒక సిక్సర్‌, ఒక బౌండరీ బాదేశారు. వారికి ఇక 4 పరుగులే అవసరం.

17 ఓవర్లకు దిల్లీ : 150-6

DC vs MI match live updates: బాసిల్ థంపీ ప్రెజర్‌కు లోనయ్యాడు. 13 పరుగులు ఇచ్చాడు. అక్షర్ (21), లలిత్‌ (36) చెరో బౌండరీ కొట్టారు. వారికి 18 బంతుల్లో 28 పరుగులు అవసరం

16 ఓవర్లకు దిల్లీ : 137-6

DC vs MI match live updates: బుమ్రా ఫామ్‌లో లేడు. 15 పరుగులు ఇచ్చాడు. అక్షర్‌ (15) ఒక సిక్సర్‌, లలిత్‌ (35) ఒక బౌండరీ బాదేశారు.

15 ఓవర్లకు దిల్లీ : 122-6

DC vs MI match live updates: తైమల్‌ మిల్స్‌ 9 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతికి లలిత్‌ (30) బౌండరీ కొట్టాడు. అక్షర్‌ (5) అతడికి తోడుగా ఉన్నాడు. దిల్లీకి 30 బంతుల్లో 56 పరుగులు కావాలి.

14 ఓవర్లకు దిల్లీ : 113-6

DC vs MI match live updates: బాసిల్‌ థంపి వికెట్‌ తీసి 10 పరుగులు ఇచ్చాడు. లలిత్ యాదవ్‌ (25) ఆఖరి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. అక్షర్‌ పటేల్‌ (1) క్రీజులోకి వచ్చాడు.

దూకుడుగా ఆడుతున్న శార్దూల్‌ ఔట్‌

DC vs MI match live updates: బాసిల్‌ థంపి వేసిన 13.2వ బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ (22) ఔటయ్యాడు.

13 ఓవర్లకు దిల్లీ : 103-5

DC vs MI match live updates: డేనియె్ల్‌ సామ్స్‌ 9 పరుగులు ఇచ్చాడు. శార్దూల్‌ (22) ఆఖరి బంతికి బౌండరీ కొట్టాడు. లలిత్‌ యాదవ్‌ (16) నిలకడగా ఆడుతున్నాడు.

12 ఓవర్లకు దిల్లీ : 94-5

DC vs MI match live updates: మురుగన్‌ అశ్విన్‌ 3 పరుగులే ఇచ్చాడు. లలిత్‌ యాదవ్‌ (14), శార్దూల్‌ (15) నిలకడగా ఆడుతున్నారు.స

11 ఓవర్లకు దిల్లీ : 91-5

DC vs MI match live updates: బుమ్రా ఈ ఓవర్లో 14 పరుగులు ఇచ్చాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (14) మూడు బౌండరీలు కొట్టాడు. లలిత్‌ యాదవ్‌ (12) స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తున్నాడు.

10 ఓవర్లకు దిల్లీ : 77-5

DC vs MI match live updates: బాసిల్‌ థంపి ఈ ఓవర్లో 2 వికెట్లు తీశాడు. రెండో బంతికి పృథ్వీ షా, నాలుగో బంతికి రోమన్‌ పావెల్‌ (0)ను ఔట్‌ చేశాడు. ఆఖరి బంతికి లలిత్‌ యాదవ్‌ ( 11) బౌండరీ కొట్టాడు.

పృథ్వీషా ఔట్‌: ఇక దిల్లీకి ఛేజింగ్‌ కష్టమే! 

DC vs MI match live updates: బాసిల్‌ థంపీ వేసిన 9.2వ బంతికి పృథ్వీ షా (38)  ఔటయ్యాడు. ఇషాన్‌ కిషన్‌ పరుగెత్తి మరీ క్యాచ్‌ అందుకున్నాడు.


 

9 ఓవర్లకు దిల్లీ : 70-3

DC vs MI match live updates: తైమల్‌ మిల్స్‌ 8 పరుగులు ఇచ్చాడు. పృథ్వీ షా (38) ఆఖరి బంతికి బౌండరీ కొట్టాడు. అతడిపై భారం ఎక్కువగా ఉంది. లలిత్‌ యాదవ్‌ (6) స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తున్నాడు.

8 ఓవర్లకు దిల్లీ : 62-3

DC vs MI match live updates: మురుగన్‌ అశ్విన్‌ 4 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో బౌండరీ రాలేదు. పృథ్వీ షా (32), లలిత్‌ యాదవ్‌ (4) నిలకడగా ఆడుతున్నారు.

7 ఓవర్లకు దిల్లీ : 58-3

DC vs MI match live updates: డేనియెల్‌ సామ్స్‌ 12 పరుగులు ఇచ్చాఉడ. పృథ్వీ షా (30) ఈ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు  కొట్టాడు. లలిత్‌ యాదవ్‌ (3) వికెట్‌ పడకుండా అడ్డుకుంటున్నాడు.

6 ఓవర్లకు దిల్లీ : 46-3

DC vs MI match live updates: మురుగన్‌ అశ్విన్‌ 6 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతిని పృథ్వీ షా (19) బౌండరీగా మలిచాడు. లలిత్‌ యాదవ్‌ (2) మరో ఎండ్‌లో ఉన్నాడు.

5  ఓవర్లకు దిల్లీ : 40-3

DC vs MI match live updates: తైమల్‌ మిల్స్‌ మ్యాచ్‌ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేశాడు. రిషభ్ పంత్‌ను ఔట్‌ చేసి 9 పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని పృథ్వీ షా (14) ఫైన్‌లెగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టాడు. లలిత్‌ యాదవ్‌ (1) క్రీజులో ఉన్నాడు.

మరో షాక్‌: పంత్‌ ఔట్‌

DC vs MI match live updates: తైమల్‌ మిల్స్‌ వేసిన 4.1వ బంతికి రిషభ్ పంత్‌ (1) ఔటయ్యాడు. టిమ్‌ డేవిడ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

మురుగన్‌ బౌలింగ్‌లో 2 వికెట్లు

DC vs MI match live updates: మురుగన్‌ అశ్విన్‌ వేసిన మూడో ఓవర్లో వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డాయి. గూగ్లీగా వేసిన 3.3వ బంతికి టిమ్ సీఫెర్ట్‌ (21) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఐదో బంతికి కొత్త బ్యాటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ (0) తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చాడు. క్రీజులో రిషభ్‌ పంత్‌ (1), పృథ్వీ షా (7) క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లకు దిల్లీ 31-2తో ఉంది.

3 ఓవర్లకు దిల్లీ : 30-0

DC vs MI match live updates: బాసిల్‌ థంపి బౌలింగ్‌కు వచ్చాడు. 9 పరుగులు ఇచ్చాడు. పృథ్వీ షా (7) నాలుగో బంతిని కళ్లు చెదిరే సిక్సర్‌గా మలిచాడు. సీఫెర్ట్‌ (21) మరో ఎండ్‌లో ఉన్నాడు.

2 ఓవర్లకు దిల్లీ : 21-0

DC vs MI match live updates: బుమ్రా అటాకింగ్‌లోకి వచ్చాడు. 9 పరుగులు ఇచ్చాడు. టిమ్‌ సీఫెర్ట్‌ (18) వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. పృథ్వీ షా (1) అతడికి తోడుగా ఉన్నాడు.

1 ఓవర్‌కు దిల్లీ : 12-0

DC vs MI match live updates: దిల్లీ క్యాపిటల్స్‌ ఛేజింగ్‌ మొదలు పెట్టింది. జస్ప్రీత్‌ బుమ్రా బదులు డేనియెల్‌ సామ్స్‌ బౌలింగ్‌ ఆరంభించాడు. 12 పరుగులు ఇచ్చాడు. టిమ్‌ సీఫెర్ట్‌ (9) వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. పృథ్వీ షా(1) నిలకడగా ఆడుతున్నాడు.

పాకెట్‌ డైనమైట్‌ భారీగా పేలింది!

DC vs MI match live updates: పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ ఇరగదీశాడు. భారీ ధర వల్ల తనపై ప్రభావం ఏమీ ఉండదని నిరూపించాడు. కేవలం 48 బంతుల్లో 11 బౌండరీలు 2 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. రోహిత్‌ (41), హైదరాబాదీ తిలక్‌ వర్మ (22: 15 బంతుల్లో 3 బౌండరీలు ఆకట్టుకున్నారు. కుల్‌దీప్‌ 3 వికెట్లు తీసి ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. ఖలీల్‌ అహ్మద్‌కు 2 వికెట్లు దక్కాయి. శార్దూల్‌ (0-47) తేలిపోయాడు.

20 ఓవర్లకు ముంబయి : 177-5

DC vs MI match live updates: శార్దూల్‌ ఠాకూర్‌ 18 పరుగులు ఇచ్చాడు. ఇషాన్‌ కిషన్‌ (81) రెండు బౌండరీలు బాదేశాడు. డేనియెల్‌ సామ్స్‌ (7) సిక్స్‌ కొట్టాడు.

19 ఓవర్లకు ముంబయి : 159-5

DC vs MI match live updates: ఖలీల్‌ అహ్మద్‌ 11 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. ఆఖరి బంతికి టిమ్‌ డేవిడ్‌ (12)ను ఔట్‌ చేశాడు. అయితే అంతకు ముందు ఇషాన్‌ కిషన్‌ (71) రెండు బౌండరీలు దంచేశాడు.

18 ఓవర్లకు ముంబయి : 148-4

DC vs MI match live updates: శార్దూల్‌ ఠాకూర్‌ 11 పరుగులు ఇచ్చాడు. ఇషాన్‌ (60) నిలకడగా ఆడుతున్నాడు. ఆఖరి బంతిని టిమ్‌ డేవిడ్‌ (12) సిక్సర్‌ కొట్టాడు.

2020 నుంచి ఐపీఎల్లో ఓపెనర్గా ఇషాన్ కిషన్

68*(37)
37(36)
25(19)
72*(47)
50*(25)
84(32)
59*(37) --- today

17 ఓవర్లకు ముంబయి : 137-4

DC vs MI match live updates: అక్షర్‌ పటేల్‌ 14 పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని సిక్సర్‌గా మలిచి ఇషాన్‌ (59) అర్ధశతకం సాధించాడు. టిమ్‌ డేవిడ్‌ (3) అతడికి తోడుగా ఉన్నాడు.

16 ఓవర్లకు ముంబయి : 123-4

DC vs MI match live updates: కుల్‌దీప్‌ ఈ ఓవర్లో 5 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. అతడి నాలుగు ఓవర్ల స్పెల్‌లో 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. టిమ్ డేవిడ్‌ (1), ఇషాన్‌ కిషన్‌ (47) క్రీజులో ఉన్నారు.

పంత్‌ వ్యూహం ఫలించింది: పొలార్డ్‌ ఔట్‌

DC vs MI match live updates: కుల్‌దీప్‌ వేసిన 15.5వ బంతికి పొలార్డ్‌ (3) ఔటయ్యాడు. సీఫెర్ట్‌ క్యాచ్‌ అందుకున్నాడు. కుల్దీప్ కు ఇది మూడో వికెట్.

15 ఓవర్లకు ముంబయి : 118-3

DC vs MI match live updates: ఖలీల్‌ అహ్మద్‌ వికెట్‌ తీసి 5 పరుగులు ఇచ్చాడు. ఇషాన్‌ (45), పొలార్డ్‌ (1) క్రీజులో ఉన్నారు.

తిలక్‌ వర్మ ఔట్‌

 


DC vs MI match live updates: ఖలీల్‌ అహ్మద్‌ వేసిన 14.2వ బంతిని ఆడబోయిన హైదరాబాదీ తిలక్‌ (22; 15 బంతుల్లో 3x4) ఔటయ్యాడు. పృథ్వీ షా క్యాచ్‌ అందుకున్నాడు.

14 ఓవర్లకు ముంబయి : 113-2

DC vs MI match live updates: లలిత్‌ యాదవ్‌ 9 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతిని ఇషాన్‌ (45) బౌండరీకి పంపించాడు. తిలక్‌ (18) ఫియర్‌లెస్‌ షాట్లు ఆడుతున్నాడు.

13 ఓవర్లకు ముంబయి : 104-2

DC vs MI match live updates: నాగర్‌ కోటీ బౌలింగ్‌ అంతా బాగా లేదు. 13 పరుగులు ఇచ్చాడు. తిలక్‌ వర్మ (14) వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. ఆఖరి బంతిని ఇషాన్‌ (40) బౌండరీగా మలిచాడు.

12 ఓవర్లకు ముంబయి : 91-2

DC vs MI match live updates: లలిత్‌ యాదవ్‌ బౌలింగ్‌కు వచ్చాడు. 6 పరుగులు ఇచ్చాడు. ఇషాన్‌ (36), తిలక్‌ (5) నిలకడగా ఆడుతున్నారు.

11 ఓవర్లకు ముంబయి : 85-2

DC vs MI match live updates: కుల్‌దీప్‌ వికెట్‌ తీసి 6 పరుగులే ఇచ్చాడు. హైదరాబాదీ బ్యాటర్ తిలక్‌ వర్మ (1) క్రీజులోకి వచ్చాడు. ఇషాన్‌ కిషన్‌ (34) నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

కుల్‌దీప్‌కు రెండో వికెట్‌: అన్‌మోల్‌ ఔట్‌

DC vs MI match live updates: కుల్‌దీప్‌ వేసిన 10.4వ బంతిని ఆడబోయి అన్‌మోల్‌ (8) ఔటయ్యాడు. లలిత్‌ యాదవ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

10 ఓవర్లకు ముంబయి : 79-1

DC vs MI match live updates: అక్షర్‌ పటేల్‌ 10 పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి ఇషాన్‌ (32) గ్యాపులో బౌండరీ రాబట్టాడు. అన్‌మోల్‌ (5) అతడికి తోడుగా ఉన్నాడు.

9 ఓవర్లకు ముంబయి : 69-1

DC vs MI match live updates: కుల్‌దీప్‌ 4 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. ఇషాన్‌ (26) నిలకడగా ఆడుతున్నాడు. అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (1) క్రీజులోకి వచ్చాడు.

కుల్‌దీప్‌కు దొరికిన రోహిత్‌ శర్మ

DC vs MI match live updates: రోహిత్‌ శర్మ (41; 32 బంతుల్లో 4 బౌండరీలు 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ ముగిసింది. కుల్‌దీప్‌ వేసిన 8.2వ బంతిని బౌండరీకి బాదబోయి రోమన్‌ పావెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

8 ఓవర్లకు ముంబయి : 65-0

DC vs MI match live updates: అక్షర్‌ పటేల్‌ ఈ ఓవర్లో 9 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని రోహిత్‌ (39) చక్కని కట్‌షాట్‌తో బౌండరీకి పంపించాడు. ఇషాన్‌ (25) మరో ఎండ్‌లో ఉన్నాడు.

7 ఓవర్లకు ముంబయి : 56-0

DC vs MI match live updates: కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌కు వచ్చాడు. కేవలం 3 పరుగులే ఇచ్చాడు. ఇషాన్‌ (23), రోహిత్‌ శర్మ (32) నిలకడగా ఆడుతున్నారు. స్కోరు వేగానికి కాస్త బ్రేక్‌ పడింది.

6 ఓవర్లకు ముంబయి : 53-0

DC vs MI match live updates: ఖలీల్‌ అహ్మద్‌ సూపర్‌ బౌలింగ్‌ వేశాడు. వరుసగా నాలు డాట్‌ బాల్స్‌ వేయడంతో ఐదో బంతికి రోహిత్‌ ఫైన్‌ లెగ్‌లో చీకీ షాట్‌ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి శార్దూల్‌ చేతుల్లోంచి జారింది. దాంతో రోహిత్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఐదో బంతికి ఒక బౌండరీ కొట్టాడు. ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి.

5 ఓవర్లకు ముంబయి : 48-0

DC vs MI match live updates: కమలేశ్‌ నాగర్‌ కోటికి ముంబయి ఓపెనర్లు ఘన స్వాగతం పలికారు! మొత్తం 16 పరుగులు వచ్చాయి. రోహిత్‌ ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ బాదేస్తే ఇషాన్‌ ఒక బౌండరీ కొట్టాడు.

4 ఓవర్లకు ముంబయి : 32-0

DC vs MI match live updates: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌కు వచ్చాడు. కాస్త ఫర్వాలేదనిపించాడు. ఐదో బంతిని ఇషాన్‌ బౌలర్‌ మీదుగా బౌండరీకి తరలించాడు. రోహిత్‌ అవతలి ఎండ్‌లో ఉన్నాడు.

3 ఓవర్లకు ముంబయి : 25-0

DC vs MI match live updates: శార్దూల్‌ ఐదు బంతులు అద్భుతంగా వేశాడు. ఆఖరి బంతికి విడ్త్‌ ఇవ్వడంతో ఇషాన్‌ కిషన్‌ థర్డ్‌ మ్యాన్‌ దిశగా సూపర్‌ సిక్సర్‌ బాదేశాడు. రోహిత్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు.

2 ఓవర్లకు ముంబయి : 16-0

DC vs MI match live updates: ఖలీల అహ్మద్‌ మరో ఎండ్ నుంచి బౌలింగ్‌ మొదలుపెట్టాడు. ఇషాన్‌ కిషన్‌ ఐదో బంతిని అందమైన కవర్‌డ్రైవ్‌గా మలిచాడు. బౌండరీకొట్టాడు. రోహిత్‌ నిలకడగా ఆడుతున్నాడు.

1 ఓవర్‌కు ముంబయి : 10-0

DC vs MI match live updates:  శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌ ఆరంభించాడు. ఐపీఎల్‌లో తొలిసారి ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ వేశాడు. రోహిత్‌ శర్మ ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ దంచాడు. ఇషాన్‌ కిషన్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు.

దిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌

పృథ్వీ షా, టిమ్‌ సీఫెర్ట్‌, మన్‌దీప్‌ సింగ్‌, రిషభ్ పంత్‌, రోమన్‌ పావెల్‌, లలిత్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, కమలేశ్‌ నాగర్‌కోటి

ముంబయి టీమ్‌

రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, అన్‌మోల్‌ ప్రీత్‌, కీరన్‌ పొలార్డ్‌, టిమ్‌ డేవిడ్‌, డేనియెల్‌ సామ్స్‌, మురుగన్‌ అశ్విన్‌, తైమల్‌ మిల్స్‌, బాసిల్‌ థంపి

టాస్‌ గెలిచిన రిషభ్ పంత్‌

dc VS mi: ఐపీఎల్‌ రెండో మ్యాచులో దిల్లీ టాస్‌ గెలిచింది. రిషభ్ పంత్‌ వెంటనే బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

ఐపీఎల్‌ 2022లో తొలి డబుల్‌ హెడర్‌

DC vs MI live updates: మధ్యాహ్నం 3:30 గంటలకు బ్రబౌర్న్‌ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ మొదలవ్వనుంది.

Background

IPL 2022 DC vs MI match Preview: ఐపీఎల్‌ 2022లో రెండో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) బ్రబౌర్న్‌ స్టేడియంలో తలపడనున్నాయి. ఇవి రెండూ మంచి జట్లే కావడం, ఆకర్షణీయమైన ఆటగాళ్లు ఉండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant), ముంబయి సారథి రోహిత్‌ శర్మది (Rohit sharma) అన్నాదమ్ముల అనుబంధం! మరి ఈ సీజన్లో విన్నింగ్‌ స్టార్ట్‌ ఎవరు చేయబోతున్నారో ఈ మ్యాచ్తో తెలిసిపోతుంది!


Delhi Capitas vs Mumbai Indians హోరాహోరీ


ఐపీఎల్‌లో ముంబయి, దిల్లీ మధ్య ప్రతిసారీ నువ్వా నేనా అన్నట్టే ఫైట్‌ జరుగుతుంది. ఇవి రెండు ఇప్పటి వరకు 30 మ్యాచుల్లో తలపడగా 16 సార్లు ముంబయి, 14 సార్లు దిల్లీ గెలిచింది. చివరి ఐదు మ్యాచుల్లో ముంబయి 3-2తో ఆధిక్యంలో ఉంది. కానీ 2021లో ఆడిన రెండు మ్యాచుల్లో రిషభ్‌ సేన 5 బంతులు మిగిలుండగానే విజయం సాధించడం గమనార్హం.


Delhi capitas కాస్త స్ట్రాంగే!





మైటీ ముంబయితో పోలిస్తే ఈసారి దిల్లీనే కాస్త స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది! కుర్రాళ్లు, సీనియర్ల మేళవింపుతో బాగుంది. కెప్టెన్‌ రిషభ్ పంత్‌ డిస్ట్రక్టివ్‌ ఫామ్‌లో ఉన్నాడు. పృథ్వీ షా (Prithvi Shaw) మెరుగైన ఓపెనింగ్స్‌ ఇవ్వగలడు. ఆన్రిచ్‌ నార్జ్‌ (Anrich Nortje) ఇంకా అందుబాటులోకి రాకపోవడం బలహీనతే! డేవిడ్‌ వార్నర్‌ (David Warner), మిచెల్‌ మార్ష్‌ (Mitchel Marsh) వచ్చేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. ఆ లోపు అక్షర్‌ పటేల్‌ (Axar patel), శ్రీకర్ భరత్‌, టిమ్‌ సీఫెర్ట్‌, శార్దూల్‌ ఠాకూర్‌ (Shardhul Thakur), రోమన్‌ పావెల్‌ అవసరాలు తీరుస్తారు. చేతన్‌ సకారియా, శార్దూల్‌, ముస్తాఫిజుర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌ వంటి బౌలర్లు బాగున్నారు. విదేశీ ఆటగాళ్లు వస్తే జట్టుకు సమతూకం వస్తుంది.




Mumbai Indians లోకల్‌ బాయ్స్‌!


ముంబయి ఇండియన్స్‌ పటిష్ఠంగానే కనిపిస్తున్న కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ వీరికి అతిపెద్ద ప్లస్‌ పాయింట్‌. కీరన్‌ పొలార్డ్‌ (Pollard), జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah), ఇషాన్‌ కిషన్‌ (Ishan kishan), సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya kumar yadav) వీరికి అత్యంత కీలకం. గాయం కారణంగా సూర్య అందుబాటులో ఉండటం కష్టమే! అతడి ప్లేస్‌లో తిలక్‌ వర్మ ఆడతాడు. ఒకప్పటిలా వీరి మిడిలార్డర్‌ లేదు. పాండ్య బ్రదర్స్‌ లోటును తీర్చలేరు. ఈసారి బేబీ ఏబీడీ, టిమ్‌ డేవిడ్‌, డేనియల్‌ సామ్స్‌ మిడిలార్డర్‌లో ఉంటారు. బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్లో బుమ్రా, తైమల్‌ మిల్స్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ కీలకం. మురుగన్‌ అశ్విన్‌, మయాంక్‌ మార్కండె రూపంలో స్పిన్నర్లు ఉన్న వీరికి ఎక్కువ ఎక్స్‌పోజర్‌ లేదు. ప్రైస్‌ ట్యాగ్‌ ఇషాన్‌పై ప్రభావం చూపొచ్చు!


Brabourne stadiumలో పేసర్లదే రాజ్యం


బ్రబౌర్న్‌ లేదా సీసీఐలో 2015 నుంచి టీ20 మ్యాచులు జరగలేదు. ఇక్కడా ఎర్రమట్టితోనూ పిచ్‌ను రూపొందించారు. అయితే ఆఖరి తొమ్మిది మ్యాచుల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే ఆరు సార్లు గెలిచాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 173. ఈ పిచ్‌ కూడా పేసర్లకు అనుకూలిస్తుంది. 2019 ఐపీఎల్‌ నుంచి చూసుకుంటే పవర్‌ప్లేలో పేసర్లు వికెట్ల పండగ చేసుకుంటారు. ఇక్కడ పేసర్లు 33 సగటుతో 44 వికెట్లు తీస్తే స్పిన్నర్లు 1 వికెట్‌ తీశారు. ఇన్నాళ్లూ ఇక్కడ మ్యాచులు జరగలేదు కాబట్టి మున్ముందు పిచ్‌ ఎలా ప్లే చేస్తుందో తెలియదు. ఎర్రమట్టి పిచ్‌ కాబట్టి పేస్‌, బౌన్స్‌ బాగుంటుంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.