DC vs LSG Preview and Prediction: ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారిన వేళ లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో..ఢిల్లీ క్యాపిటల్స్(DC) కీలక సమరానికి సిద్ధమైంది. ప్లే ఆఫ్ రేసులో మిణుకుమిణుకుమంటున్న ఆశలైనా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తప్పక గెలవాల్సిందే. ఈ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా ప్లే ఆఫ్ రేసులో నిలవాలని ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిచి ప్లే ఆఫ్‌కు చేరాలని రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ భావిస్తోంది. ప్లే ఆఫ్ రేసు ఉత్కంఠభరితంగా మారిన వేళ ఇక మిగిలిన ప్రతీ మ్యాచ్ చాలా కీలకం కానుంది.
ఈ సీజన్‌లో ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్‌లో టాప్ 4 కంటే కింద ఉండి..ప్లే ఆఫ్స్‌లో ఉండటానికి మెరుగైన ఛాన్సెస్ ఉన్న జట్టు ఏదంటే ఉన్న ఒకే ఒక్క టీమ్ లక్నో సూపర్ జెయింట్స్. ఆ టీమ్ ఇప్పటి వరకూ 12 మ్యాచ్ లు మాత్రమే ఆడి 6విజయాలతో 12పాయింట్లతో ప్రస్తుతానికి 7వస్థానంలో ఉన్నట్లు కనపడుతున్నా తనకు మిగిలిన రెండు మ్యాచులు గెలిచేస్తే క్వాలిఫైయర్ రేస్‌లో ముందుండటం పక్కా.
ఇలాంటి టైమ్‌లో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ ఆడుతోంది LSG. ఈ మ్యాచ్ గెలిస్తే లక్నోకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి ఢిల్లీ ఓడిపోతే మాత్రం ఐపీఎల్ నుంచి ఎలిమినేషనే. రెండు టీమ్స్ బలంగానే కనిపిస్తున్నా లక్నోకు కొన్ని సమస్యలు ఉన్నాయి.
ప్రధానమైంది లాస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ పై పదివికెట్ల తేడాతో ఓడిపోవటం. హెడ్, అభిషేక్ శర్మ ఊహించని రీతిలో విరుచుకుపడటంతో ఏం చేయలేని స్థితిలో ఉండిపోయిన లక్నోకు వాళ్ల ఓనర్ గోయెంకా ఇంకా షాక్ ఇచ్చారు. మ్యాచ్ తర్వాత అందరి ముందు కెప్టెన్ రాహుల్ ను తిడుతూ మాట్లాడటం, అరవటం టీమ్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ సీజన్ ద్వారా రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తున్నట్లు, లక్నో నుంచి తప్పుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్న టైమ్‌లో ఇవాళ టీమ్‌ను కేఎల్ ఎలా లీడ్ చేస్తాడనేది చూడాలి.
లక్నో ఏం చేస్తుందో..?
లక్నో సూపర్ జెయింట్స్ గత రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాలను చవిచూసి రన్‌రేట్‌ను భారీగా తగ్గించుకుంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి రన్‌రేట్ పెంచుకోవాలని లక్నో చూస్తోంది. ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఈ సీజన్‌లో 330 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నాడు. ఈ 330 పరుగుల్లో 296 పరుగులు బౌండరీల ద్వారా వచ్చాయి. మెక్‌గర్క్ బౌండరీ శాతం 89.7. మెక్‌గర్క్ చివరి ఎనిమిది ఇన్నింగ్స్‌లలో మొదటి పది బంతుల్లో 33 బౌండరీలు కొట్టాడు. మెక్‌గర్క్ మరోసారి విధ్వంసం సృష్టిస్తే లక్నో ఘన విజయం ఖాయం. KL రాహుల్ కూడా నిలబడితే లక్నోకు ఇక తిరుగుండదు. ఈ సీజన్‌లో 460 పరుగులతో రాహుల్ లక్నో జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. బౌలర్లు కూడా తమ వంతు పాత్ర పోషించాలని లక్నో యాజమాన్యం కోరుకుంటోంది.
ఓడితే ఢిల్లీ అవుట్
మరో వైపు ఢిల్లీకి డూ ఆర్ డై మ్యాచ్ కావటం..స్లో ఓవర్ రేట్ కారణంగా లాస్ట్ మ్యాచ్ ఆడలేకపోయి కెప్టెన్ రిషభ్ పంత్ తిరిగి రావటం ఆసక్తికర అంశం. DC ఓపెనర్ జాక్ ఫ్రేసర్ మెక్ గ్రక్ మళ్లీ మెరుపు ఆరంభాన్ని ఇస్తే అది ఢిల్లీకి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ గెలిచినా కూడా ముంబైతో లక్నోకి ఇంకో మ్యాచ్ ఉంది కాబట్టి టెక్నికల్ గా ఢిల్లీ అండ్ లక్నో రెండూ ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంటాయి. ఢిల్లీ ఓడితే మాత్రం ఐపీఎల్ నుంచి ఎలిమినేషనే
ప్లేఆఫ్ చేరడానికి ఢిల్లీ కంటే లక్నోకు ఎక్కువ అవకాశం ఉంది. కానీ గత రెండు మ్యాచుల్లో భారీ ఓటములు లక్నో ప్లే ఆఫ్ అవకాశాలను చాలా సంక్లిష్టంగా మార్చాయి. లక్నో 16 పాయింట్లు రావాలంటే... మిగిలి ఉన్న ఢిల్లీ, ముంబై మ్యాచుల్లో రెండు విజయాలు సాధించాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్క మ్యాచులో ఓడిపోయినా లక్నో కథ ముగిసినట్లే.
పంత్ రాకతో బలంగానే
ఈ సీజన్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసే రెండో జట్టుగా లక్నో అపఖ్యాతి మూటగట్టుకుంది. లక్నో ఈ సీజన్‌లో ఓవర్‌కు 8.35 పరుగులతో స్కోర్ చేసింది. ఈ విధానాన్ని పక్కనపెట్టి ధాటిగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. లక్నో బౌలర్లు IPL 2024లో అతి తక్కువ వికెట్లు తీశారు. 12 ఇన్నింగ్స్‌లలో కేవలం 57 వికెట్లు మాత్రమే పడగొట్టారు. స్లో ఓవర్ రేట్ కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇది ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను బలంగా మార్చనుంది. డేవిడ్ వార్నర్, మెక్‌గర్క్, పోరెల్, పంత్ మెరిస్తే ఢిల్లీ భారీ స్కోరు చేయడం ఖాయం.
ఢిల్లీ లెవన్( అంచనా) : డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (కెప్టెన్), షాయ్ హోప్ 6 ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, రసిఖ్ సలామ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
లక్నో లెవన్(అంచనా) : KL రాహుల్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, అష్టన్ టర్నర్, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయి, ఉల్-హక్, యశ్ ఠాకూర్