DC vs LSG   Head to head Records : ఈ ఐపీఎల్‌(IPL)లో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG)... ఆరు స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో తలపడనుంది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి గెలుపు తప్పనిసరి. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య కీలకపోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్లే ఆఫ్‌ అవకాశాలు మరింత మెరుగవుతాయి. 

 

హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌-లక్నో సూపర్‌ జెయింట్స్‌ నాలుగుసార్లు తలపడ్డాయి. ఈ నాలుగు మ్యాచుల్లోనూ మూడుసార్లు లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించగా... ఒకసారి ఢిల్లీ గెలిచింది. ఈ సీజన్‌లోనే లక్నోపై ఢిల్లీ గెలిచింది.

 

పిచ్‌ రిపోర్ట్‌

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఈ నాలుగు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 266, 224, 257, 221 పరుగులు చేసి గెలుపొందాయి. ఛేజింగ్ జట్టు 199, 220, 247,201 పరుగులు చేశాయి. అంటే ఈ సీజన్‌లో ఇక్కడ జరిగినా ప్రతీ మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. ఈ పిచ్‌ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీలు కూడా కావడంతో బ్యాటర్లు తేలిగ్గా బౌండరీలు బాదేస్తారు. షార్ట్ స్ట్రెయిట్ బౌండరీలు, షార్ట్‌ స్క్వేర్ బౌండరీలు ఉండడంతో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్‌ గెలిచిన జట్లు మొదట బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గు చూపుతాయి. 

 

గత మ్యాచ్‌లో ఇలా...

 గత మ్యాచ్‌లో తొలుత బంతితో లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ... తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించి సాధికార విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మెక్‌గర్క్‌ ధాటిగా ఆడాడు. కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు చేశాడు. రిషబ్‌ పంత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేసి ఢిల్లీని గెలిపించాడు. 

 

ఢిల్లీ లెవన్‌‍( అంచనా) : డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (కెప్టెన్), షాయ్ హోప్ 6 ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, రసిఖ్ సలామ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ 

 

లక్నో లెవన్(అంచనా) KL రాహుల్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, అష్టన్ టర్నర్, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయి, ఉల్-హక్, యశ్ ఠాకూర్