CSK Vs PBKS, IPL 2022 LIVE: చెన్నై కథ ముగించిన పంజాబ్ బౌలర్లు - 54 పరుగులతో కింగ్స్ విజయం

చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 03 Apr 2022 11:13 PM

Background

ఐపీఎల్ 2022 సీజన్‌లో నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌కు టోర్నమెంట్‌లో ఇది మూడో మ్యాచ్. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం...More

CSK Vs PBKS, IPL 2022 LIVE: 18 ఓవర్లలో 126 పరుగులకు చెన్నై ఆలౌట్ - 54 పరుగులతో పంజాబ్ విజయం

రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. మహేంద్ర సింగ్ ధోని, క్రిస్ జోర్డాన్ అవుటయ్యారు. దీంతో 18 ఓవర్లలో చెన్నై 126 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ కింగ్స్ 54 పరుగులతో విజయం సాధించింది.


ముఖేష్ చౌదరి 2(2)
రాహుల్ చాహర్ 4-0-25-3
మహేంద్ర సింగ్ ధోని (సి) జితేష్ శర్మ (బి) రాహుల్ చాహర్ (23: 28 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
క్రిస్ జోర్డాన్ (సి) లియాం లివింగ్‌స్టోన్ (బి) రాహుల్ చాహర్  (5: 5 బంతుల్లో)