CSK vs PBKS  IPL 2024  Punjab Kings target 163: పంజాబ్‌(PBKS)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై(CSK) పోరాడే స్కోరు చేసింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్‌ బౌలర్లు రాణించారు. చెన్నై బ్యాటర్లందరూ పరుగులు చేసేందుకు ఇబ్బందిపడిన వేళ కెప్టెన్‌ రుతురాజ్‌ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఫామ్‌ను కొనసాగిస్తూ రుతారాజ్‌ సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసిన రుతురాజ్‌.. ఆరెంజ్‌ క్యాప్‌ను దక్కించుకున్నాడు. చివర్లో ధోనీ సిక్స్‌తో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 

 

పంజాబ్‌ బౌలర్ల కట్టడి

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్‌.... చెన్నై సూపర్‌కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చెన్నై తరపున 36 ఏళ్ల వయసులో రిచర్డ్ గ్లీసన్ అరంగేట్రం  చేశాడు. గాయం కారణంగా డేవాన్ కాన్వే దూరం కావడంతో అతడి స్థానంలో గ్లీసన్‌ ఈ మ్యాచ్‌తో ఎంట్రీ చేశాడు. కగిసో రబాడ తొలి ఓవర్‌ వేయగా కేవలం నాలుగు సింగిల్స్‌ వచ్చాయి.

 

అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. కాసేపు చెన్నై ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 3 ఓవర్లకు స్కోరు 20/0. శామ్‌ కరన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ వేసి మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అర్ష్‌దీప్‌ సింగ్ వేసిన ఐదో ఓవర్‌లో మూడు ఫోర్లు, రెండు సింగిల్స్‌ వచ్చాయి. కొన్ని మ్యాచులుగా విఫలమవుతున్న రహానే దూకుడు పెంచాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు వికెట్‌ కోల్పోకుండా 55 పరుగులకు చేరింది. 64 పరుగుల వద్ద చెన్నై మొదటి వికెట్ కోల్పోయింది. అజింక్య రహానె 29 పరుగులు చేసి ఔటయ్యాడు. హర్‌ప్రీత్‌ బ్రార్‌ వేసిన 8.2 ఓవర్‌కు రిలీ రోసోవ్‌కు క్యాచ్‌ ఇచ్చి రహానే అవుటయ్యాడు. శివమ్ దూబె గోల్డెన్ డక్‌ కావడంతో చెన్నైకి భారీ షాక్‌ తగిలింది. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన ఓవర్‌లో దూబే వికెట్ల ముందు దొరికిపోయాడు. చెన్నై రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. తర్వాత  చెన్నైకి వరుస షాక్‌లు తగిలాయి. ఆరు పరుగుల వ్యవధిలో చెన్నై 3 వికెట్లు కోల్పోయింది. రాహుల్ చాహర్ వేసిన ఓవర్‌లో రవీంద్ర జడేడా అవుటయ్యాడు. 10 ఓవర్లకు చెన్నై 71/3. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాటర్లు ఆచితూచి ఆడారు. 8 ఓవర్లపాటు చైన్నై బ్యాటర్లు కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో చెన్నై బ్యాటర్లు జాగ్రత్తగా ఆడారు. 8 ఓవర్ల తర్వాత చెన్నై ఇన్నింగ్స్‌లో ఓ బౌండరీ నమోదైంది. చెన్నై 107 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. సమీర్ రిజ్వీ 21 పరుగులు చేసి అవుటయ్యాడు. రబాడ వేసిన ఓవర్‌లో హర్షల్‌ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి రిజ్వీ అవుటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసిన రుతురాజ్‌.. ఆరెంజ్‌ క్యాప్‌ను దక్కించుకున్నాడు. చివర్లో ధోనీ సిక్స్‌తో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.