Just In





CSK Captain Ruturaj Comments: వరుస ఓటములపై చెన్నై కెప్టెన్ ఫైర్.. ఆ తప్పులతోనే పరాజయాలని వెల్లడి.. దీన స్థితిలో సీఎస్కే
వరుసగా 3 మ్యాచ్ లు ఓడిపోవడంతో చెన్నైపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఐదుసార్లు చాంపియన్ ప్రస్తుతం టోర్నీలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అలాగే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ విఫలం అవుతోంది.

IPL 2025 CSK VS DC Updates: వరుస పరాజయాలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెన్ అయ్యాడు. కొన్నికారణాల వల్ల తమ జట్టు వరుసగా ఓటమి పాలు అవుతోందని, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఘాటుగా వ్యాఖ్యానించాడు. శనివారం సొంతగడ్డ చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 50 పరుగులతో చెన్నై ఓడిపోయింది. ఈ టోర్నీలో వరుసగా మూడో ఓటమి కావడం విశేషం. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గెలిచిన తర్వాత వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో కేవలం రెండు పాయింట్లతో టోర్నీలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక బ్యాటింగ్ వైఫల్యం, నిలకడలేని బౌలింగ్ కారణంగానే తమ జట్టుకు వరుసగా ఓటములు ఎదురవుతున్నాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అధికంగా పరుగులు సమర్పించుకోవడం, స్లాగ్ ఓవర్లలో అదనంగా పరుగులు ఇవ్వడం, ఇక బ్యాటింగ్ లో త్వరగా వికెట్లను కోల్పోవడం ఓటములకు కారణమని విశ్లేషించాడు.
ఇంటెన్సీటీ లేదు..
చెన్నై ఓటములకు ఇంటెన్సీటీ లేకపోవడమే కారణమని, గెలవాలనే కసి ఆ ఆటగాళ్లలో లోపించిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చివరగా బ్యాటింగ్ చేస్తుండటం, కావాల్సిన సమయంలో వేగంగా ఆడకుండా, మ్యాచ్ చేజారి పోయిన తర్వాత బౌండరీలు బాదడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తమ జట్టులో లోపాలు గుర్తించామని, వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నా, ఫలితం ఉండటం లేదని పేర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్ లో త్వరగా వికెట్లను కోల్పోవడం కొంపముంచిందని, బ్యాటింగ్ వైఫల్యమై ఓటమికి కారణమని పేర్కొన్నాడు.
అదే పెద్ద సమస్య..
ఈ సీజన్ లో సరైన కూర్పు లేకపోవడమే తమ సమస్యని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. జట్టులో స్థిరత్వం కోసం చాలా మార్పులు చేశామని, ఏవీ కలిసి రావడం లేదని వాపోయాడు. ఇక చెన్నైకి ఉన్న 25 మంది ఆటగాళ్లలో తొలి నాలుగు గేమ్ ల్లో 17 మందిని పరీక్షించారు. అయినప్పటికీ, ఇప్పటివరకు ఫర్ఫెక్ట్ ప్లెయింగ్ లెవన్ సూటవలేదు. దూకుడైనా ఆటతీరు కాకుండా సంప్రదాయ క్రికెట్ ఆడటంతోనే చెన్నైకి ఓటములు ఎదురవుతున్నాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యంత తక్కువ రన్ రేట్ ఉన్న జట్టుగా చెన్నై విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో గెలుపు కన్నా నెట్ రన్ రేట్ ను ఫోకస్ లో పెట్టుకుని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడుతోందని విమర్శకులు పేర్కొంటున్నారు.