IPL 2024: తప్పనిసరిగా గెలవాల్సిన జీటీ మీద మ్యాచ్ లో చెన్నై 35పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్లే ఆఫ్ అవకాశాలను కష్టంగా మార్చుకుంది. ఎందుకంటే చెన్నై ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే ఇక మిగిలి ఉన్న రెండు మ్యాచ్ లకు రెండూ గెలిచీ తీరాల్సిందే. లేదంటే ఆ నాలుగో బెర్త్ కోసం ఇంకా 5 టీమ్స్ ఎదురు చూస్తున్నాయి.


చెన్నై నెక్ట్స్ మ్యాచ్ ఆడేది రాజస్థాన్ రాయల్స్ టీమ్ తో. ఈ సీజన్ లో బీభత్సమైన ఫామ్ ను చూపిస్తున్న జట్టు అది. ఆఖరి రెండు మ్యాచులను ఓడింది కానీ దెబ్బతిన్నపులిలా విజయం కోసం ఎదురు చూస్తోంది. పాయింట్స్ టేబుల్ లో టాప్ 2లో ఉంటే ప్లే ఆఫ్స్ లో రెండు ఛాన్సులు ఉంటాయి కాబట్టి...RR సీఎస్కేను అంత ఉదాసీనంగా తీసుకోకపోవచ్చు.


ఇక మరో మ్యాచ్ RCB మీద. సీజన్ ను దారుణంగా ప్రారంభించిన ఆర్సీబీ ఆఖరి నాలుగు మ్యాచులు గెలుచుకుని ప్లే ఆఫ్స్ కోసం పులిలా ఎదురు చూస్తోంది. సో ఆర్సీబీ మీద మ్యాచ్ కూడా CSK కి అంత ఈజీ కాకపోవచ్చు. RR మ్యాచ్ చెపాక్ లో అయితే RCB మీద మ్యాచ్ వాళ్ల హోం గ్రౌండ్ చిన్నస్వామిలో. సో అంత ఈజీగా ఉండదు ఆ మ్యాచ్ కూడా.


ఈ సీజన్ లో CSK స్థాయికి తగినట్లుగా ఆడింది లేదని చెప్పుకోవాలి. ఓసారి పాయింట్స్ టేబుల్ చూడండి. రెండు విజయాలు వెంటనే రెండు పరాజయాలు మళ్లీ రెండు విజయాలు మళ్లీ రెండు ఓటములు. విజయం పరాజయం గెలుపు ఓటమి ఏదో వైకుంఠపాళిలా నిచ్చెన పాము అన్నట్లు సాగింది ఈ సీజన్ అంతా చెన్నైకి.


ప్రధానంగా ఓపెనర్ల సమస్య వెంటాడుతోంది చెన్నైని. రచిన్ రవీంద్రను నమ్ముకుంటే ఆ కుర్రాడు ఈ సీజన్ లో చేతులెత్తేశాడు. రహానే కూడా లాస్ట్ ఇయర్ ఉన్న టచ్ లో లేడు. రుతురాజ్, దూబే మాత్రమే ఒంటరిపోరాటాలు చేస్తున్నారు. డారెల్ మిచెల్, అలీ నిన్న జీటీ మీద ఆడారు. మళ్లీ ఆడతారా అంటే డౌటే. ధోని గాయం కారణంగా ఫ్యాన్స్ కోసమే ఆడుతున్నాడు.


మ్యాచ్ విన్నింగ్ ఫర్ ఫార్మెన్ లేదు. జడేజా అస్సలు టచ్ లో కనపడట్లేదు. బౌలింగ్ సరే సరి. ముస్తాఫిజుర్, పతిరానా వెళ్లిపోయాక వీక్ గా మారింది. ఇది ఇలానే కొనసాగితే ఈ సంవత్సరానికి సీఎస్కే లీగ్ దశలోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.


మ్యాచ్ ఓడినా ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తున్న ధోనీ 
ఐపీఎల్ సీజన్ ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసింది. ఇప్పటికి ప్లే ఆఫ్స్ బెర్తులు అధికారికంగా తేలకపోయినా..మొదటి రెండు బెర్తులు RR, KKR కి మ్యాగ్జిమం కన్ఫర్మ్. ఇక మిగిలిన రెండు బెర్తుల కోసం దాదాపుగా ఆరు టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఇంత హెవీ కాంపిటేషన్ లో నిన్న జీటీ మీద మ్యాచ్ గెలిచేస్తే సీఎస్కే ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపడేవే. కానీ జీటీ షాకిచ్చింది. 35పరుగుల తేడాతో సీఎస్కే మ్యాచ్ ఓడిపోయింది. కానీ ధోనిని చూద్దామని అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియానికి వచ్చిన చెన్నై ఫ్యాన్స్ హ్యాపీగా ఇంటికి వెళ్లి ఉంటారు.


ధోని బ్యాటింగ్ కి దిగేప్పటికే మ్యాచ్ ఆల్మోస్ట్ జీటీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ధోని ఏదో అద్భుతాలు చేసేస్తాడన్న ఆశలు ఎవ్వరికీ లేవుకానీ ఊరికే సరదాగా బౌండరీలు కొట్టి ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. 11బాల్స్ ఆడి 1 ఫోర్లు, 3సిక్సర్లతో 26పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో రెండు సిక్సులు సరదాగా సింగిల్ హ్యాండ్ తో మజిల్ పవర్ తో స్టాండ్స్ లోకి పంపించాడు. మూడో సిక్సర్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో హెలికాఫ్టర్ షాట్ తో సిక్సు కొట్టాడు. అంతే ఫ్యాన్స్ ఖుష్.


చెన్నై ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే మిగిలి ఉన్న రెండు మ్యాచులు కచ్చితంగా గెలవాలన్న భయం లేదెవడకీ..డబ్బులు పెట్టి టికెట్ కొన్నాం..ధోని సిక్సులు కొడుతుంటే చూశాం చాలు అన్నట్లు వెళ్లిపోయారు. ఓ ఫ్యాన్ అయితే సెక్యూరిటీని బ్రీచ్ చేస్తూ మ్యాచ్ జరుగుతుండగానే వచ్చి ధోని కాళ్ల మీద పడి దణ్ణం పెట్టాడు. ఎంతైనా ధోని ధోనినే..ఆ క్రేజే వేరు.