IPL 2024, KKR vs MI: ఈ ఐపీఎల్‌(IPL)లో ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలవాలని పట్టుదలగా ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్(KJR).... ముంబై(MI)తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు దూరమైన ముంబైతో... సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఘన విజయం సాధించాలని కోల్‌కత్తా పట్టుదలతో ఉంది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కత్తా...ఈసారి  కప్పును గెలిచి హ్యాట్రిక్‌ టైటిల్స్‌ సాధించిన జట్టుగా నిలవాలని చూస్తోంది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో 11 మ్యాచుల్లో ఎనిమిది విజయాలతో 16 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉన్న కోల్‌కత్తాను.... పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై అడ్డుకోవడం సవాలే. ఈ మ్యాచ్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత్తా మ్యాచులు ముగియనున్నాయి. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి అభిమానులకు మధుర జ్ఞాపకాలు మిగల్చాలని కోల్‌కత్తా భావిస్తోంది.


భీకర ఫామ్‌లో నరైన్‌
కోల్‌కత్తాలో టీ 20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న ఫిల్ సాల్ట్‌, కోల్‌కత్తా ఓపెనర్‌ సునీల్ నరైన్‌(Sunil Narine) భీకర ఫామ్‌లో ఉన్నారు. నరైన్‌- సాల్ట్‌( Philip Salt) ప్రత్యర్థి బౌలర్లన ఊచకోత కోస్తున్నారు. ముఖ్యంగా నరైన్‌... స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ను తలపిస్తున్నాడు. ఈ సీజన్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎనిమిది మ్యాచుల్లో కోల్‌కత్తా 200కుపైగా పరుగులు చేసిందంటే కోల్‌కత్తా బ్యాటింగ్‌ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో 35 సిక్సర్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ అగ్రస్థానంలో ఉండగా...32 సిక్సర్లతో నరైన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. గత కొన్ని మ్యాచుల్లో నరైన్ నిలకగడా రాణిస్తుండడం కోల్‌కత్తాకు కలిసి వస్తోంది. ఈ సీజన్‌లో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో నరైన్ 461 పరుగులు చేశాడు. సాల్ట్‌ 429 పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్ వంటి నాణ్యమైన ఫినిషర్‌లతో కోల్‌కత్తా బ్యాటింగ్‌ చాలా బలంగా ఉంది. బ్యాటర్ల ఆటతీరుతో కోల్‌కత్తా బౌలింగ్ బలహీనత పెద్దగా కనిపించడం లేదు. రఘువంశీ కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. 


అన్ని కష్టాలే
కోల్‌కత్తా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంటే.... ముంబై మాత్రం అన్ని విభాగాల్లో తేలిపోతోంది. అయిదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya ) నేతృత్వంలో ఈ సీజన్‌లో తేలిపోయింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత రెండు మ్యాచుల్లో 56,102 పరుగులతో సూర్యా అజేయంగా నిలిచి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా కూడా ఫామ్‌లోకి వస్తారని టీమ్ ఇండియా అభిమానులు ఆశిస్తున్నారు. రోహిత్‌ శర్మ గత ఐదు మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ అయిదు మ్యాచుల్లోనూ రోహిత్‌ స్కోరు 15 పరుగులు దాటలేదు. ఈ సీజన్‌లో పాండ్యా అత్యుత్తమ స్కోరు 46. చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో పాండ్యా పది పరుగులు కూడా దాటలేకపోయాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు వీరిద్దరూ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అత్యవసరం.


జట్లు:


కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), KS భరత్ , రహ్మానుల్లా గుర్బాజ్ , రింకు సింగ్, రఘువంశీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ సింగ్, వరుణ్‌దీప్, రమణదీప్, చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, అల్లా గజన్ఫర్, ఫిల్ సాల్ట్.


ముంబై ఇండియన్స్: 
హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, హార్విక్ దేశాయ్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్.