KKR vs MI Head to Head Records: ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR).... ముంబై ఇండియన్స్(MI) కంటే కచ్చితంగా బలంగా ఉందనే చెప్పాలి. స్ట్రాంగ్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్, ఆటగాళ్ల ఫామ్ వంటి అంశాలను బేరీజు వేసుకుంటే ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడం అంత తేలిక కాదు. ఈ సీజన్‌లో ఇప్పటికే కోల్‌కత్తా 200కుపైగా స్కోర్లను ఎనిమిదిసార్లు చేసింది. 


హెడ్‌ టు హెడ్ రికార్డ్స్‌ ఇలా
కోల్‌కతా నైట్ రైడర్స్.... ముంబై ఇండియన్స్  ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 33 మ్యాచులు ఆడాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం పది మ్యాచుల్లో గెలవగా.... ముంబై ఇండియన్స్‌ 23 మ్యాచుల్లో గెలిచింది. అన్ని మ్యాచుల్లోనూ ఫలితం వచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో  కోల్‌కత్తా-ముంబై పది మ్యాచులు ఆడగా కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు మ్యాచుల్లో గెలిచింది. ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది.


పిచ్ రిపోర్ట్
ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణంగా బౌలింగ్‌కు అనుకూలించే కోల్‌కత్తా పిచ్‌... ఈ సీజన్‌లో బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. కోల్‌కతాలో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు నాలుగుసార్లు విజయాన్ని సాధించాయి. రెండు మ్యాచులు చాలా ఉత్కంఠగా సాగాయి. రాత్రివేళ మంచు కురిసే అవకాశం ఉంది. కోల్‌కతాలో పగటిపూట ఉష్ణోగ్రత 40°C చుట్టూ ఉంటుంది. తేమ కూడా ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. 


రెండ జట్ల మధ్య హైస్కోర్లు ఇవే
కోల్‌కతా - ముంబై మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక స్కోరు 232/2. ఈ టోటల్ కేకేఆర్ 2019 సీజన్‌లో చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. కోల్‌కతా - ముంబై మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు 60 బంతుల్లో 109 పరుగులు. 2012 సీజన్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఎం.ఐ ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ను 27 పరుగుల తేడాతో ఓడించింది. కోల్‌కత్తా తరఫున 2023లో వెంకటేశ్వర్ అయ్యర్ 104 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓడిపోయినా వెంకటేశ్వర్ అయ్యర్‌కే  ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. బౌలర్ల విషయానికొస్తే కోల్‌కత్తా-ముంబై మ్యాచ్‌లో బుమ్రా తీసిన 5/10 టాప్ కాగా... రస్సెల్ 5/15, నరైన్ 4/15 ఆ తరువాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.


కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), KS భరత్ , రహ్మానుల్లా గుర్బాజ్ , రింకు సింగ్, రఘువంశీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ సింగ్, వరుణ్‌దీప్, రమణదీప్, చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, అల్లా గజన్ఫర్, ఫిల్ సాల్ట్.


ముంబై ఇండియన్స్: 
హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, హార్విక్ దేశాయ్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్.