IPL 2025 KKR Vs LSG Match: కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఆదివారం రోజు జరగాల్సిన మ్యాచ్ ను మంగళవారానికి వాయిదా వేస్తూ బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6న ఆదివారం నాడు కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడాల్సి ఉంది. కానీ కోల్‌కతా పోలీసుల అభ్యర్థన మేరకు ఈ మ్యాచ్‌ను ఏప్రిల్ 6న కాకుండా ఏప్రిల్ 8న నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) నిర్ణయం తీసుకుంది.
కొన్ని ఉత్సవాలు, కార్యక్రమాలు ఉన్నాయని ఆదివారం నాడు ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన మ్యాచ్‌కు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడం కుదరదని, మ్యాచ్ రీషెడ్యూల్ చేయాలని కోల్‌కతా పోలీసులు రిక్వెస్ట్ చేశారు. దాంతో కేకేఆర్, లక్నో మ్యాచ్‌ను బీసీసీఐ అధికారికంగా రీ షెడ్యూల్ చేసింది. రెగ్యూలర్ టైమ్ రాత్రి 07:30 కి కాకుండా ఏప్రిల్ 8వ తేదీన మధ్యాహ్నం 03:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దాంతో వచ్చే వారం నాడు సింగిల్ మ్యాచ్ ఉండనుంది. ఏప్రిల్ 8న (మంగళవారం) డబుల్-హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయని బీసీసీఐ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
ప్రస్తుత ఛాంపియన్లు కోల్‌కతా టీమ్ మంగళవారం మధ్యాహ్నం LSG తో మ్యాచ్ ఆడనుంది. దాంతో చెన్నైలో CSK తో జరిగే మ్యాచ్‌కు వారికి 3 రోజుల విరామం దొరుకుతోంది. హైదరాబాద్ వేదికగా ఆదివారం షెడ్యూల్ చేసిన రెండో మ్యాచ్ యథాతథంగా జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ జెయింగ్స్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ లో తలపడనున్నాయి.
ఏప్రిల్ 8న రెండు మ్యాచ్‌లు ఏప్రిల్ 6న ఒకటే మ్యాచ్ కావడంతో మంగళవారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా, లక్నో మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభం కానుంది. అదే రోజు రాత్రి .7.30 గంటలకు పంజాబ్‌తో చెన్నై తలపడతాయి.
BCCI అధికారిక ప్రకటనఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరగాల్సిన 19వ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేస్తున్నాం. ఇది ఏప్రిల్ 6, 2025 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం జరగాల్సి ఉంది. కానీ ఉత్సవాల కారణంగా నగరం మొత్తం పోలీస్ సిబ్బందిని మోహరిస్తాం. దాంతో మ్యాచ్ కు సెక్యూరిటీ ఇవ్వడం వీలుకాదని.. రీషెడ్యూల్ చేయాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB)కి కోల్‌కతా పోలీసులు రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు బీసీసీఐ మ్యాచ్ రీషెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆదివారం, ఏప్రిల్ 6న సింగిల్ మ్యాచ్ డే అవుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌తో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 8న డబుల్-హెడర్ మ్యాచ్ డే.. మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా, లక్నో మ్యాచ్ కోల్‌కతాలో ఉంటుంది. రాత్రి పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ (మ్యాచ్ నంబర్ 22)లో తలపడనున్నాయి.