Baby Is On The Way Sakshi Dhonis Post During Csks Win Over Srh Goes Viral: హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 78 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. తరువాత బౌలింగ్‌లో నూ అదరగొట్టింది. గతవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమికి ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తన సొంత మైదానంలో అద్భుత విజయం సాధించి రివేంజ్ తీర్చుకున్నట్లయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమైంది. 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో చెన్నై జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి..ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా 98 పరుగులు చేశాడు. చెన్నై ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లు పడగొట్టి విజయానికి మార్గనిర్దేశం చేశాడు. పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. అయితే ఈ క్రమంలో చెన్నై మాజీ సారధి ఎంఎస్ ధోనీ భార్య సాక్షి పెట్టిన పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
‘ప్లీజ్ ఇవాళ మ్యాచ్‌ను త్వరగా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే (Baby Is On The Way), కాబోయే అత్తగా నా అభ్యర్థన ఇది’. అని సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. ఇది చూసిన ధోనీ అభిమానులు సాక్షి పోస్ట్‌ను వైరల్ చేయడమే కాకుండా.. మామ కాబోతున్న మిస్టర్ కూల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే ధోనీ బ్యాటింగ్‌కు దిగి ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి తరలించాడు. ఇక, ఈ సీజన్‌లో ముందు బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్లు నమోదుచేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛేదనలో మాత్రం మొదటిసారే కాదు వరుసగా రెండోసారి కూడా చేతులెత్తేసింది. బెంగళూరుతో ఉప్పల్‌లో జరిగిన గత మ్యాచ్ మాదిరిగానే ఇప్పుడు చెన్నై చెపాక్ లోనూ తడబడింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే సమిష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్ సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లు రాణించలేకపోయారు. ట్రేవిస్ హెడ్ , అభిషేక్ శర్మ తక్కువ పరుగులతో అవుట్ అయి తీవ్ర నిరాశ పరిచారు. మార్క్రమ్ తప్ప ఎవరు స్కోర్ ను కాస్త కూడా ముందుకు తీసుకు వెళ్లలేకపోయారు. చెన్నై బౌలర్ తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. పతిరన, ముస్తాఫిజుర్ చెరో రెండు వికెట్లు తీయగా, జడేజా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.