IPL News: ఐపీఎల్లో 2023లో ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ఫ్లేయర్ రూల్ ఎంతగానో ప్రభావితం చేసింది. 12 మందితో ఆడే అవకాశం ఈ రూల్ తో జట్లకు కలుగుతుంది. జట్టులో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఒక ప్లేయర్ ను తప్పించి, అతని స్థానంలో పరిస్థితులకు తగినట్లుగా మరో ప్లేయర్ ను తీసుకోవచ్చు. ఇందుకోసం మ్యాచ్ ప్రారంభానికి ముందే కొంతమంది అడిషినల్ ప్లేయర్లతో కూడిన వివరాలను సదరు జట్టు తెలపాల్సి ఉంటుంది. అయితే ఈ రూల్ కారణంగా ఐపీఎల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆటలో వేగం, ఇంటెన్సిటీ పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ రూల్ ను దక్షిణాఫ్రికా గ్రేట్ ఏబీ డివిలియర్స్ తిరస్కరించాడు. ఇలాంటి రూల్ వల్ల క్రికెట్ కొంచెం నష్టం కలుగుతుందని అభిప్రాయప పడ్డాడు. ముఖ్యంగా ఆల్ రౌండర్లకు గట్టి సెగ తగులుతుందని వ్యాఖ్యానించాడు.
నో చాన్స్..
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను ఈనెల రెండో వారంలో ప్రారంభం కాబోయే సౌతాఫ్రికా లీగ్ ఎస్ ఏ 20లో ప్రవేశ పెట్ట కూడదని డివిలియర్స్ కోరుకున్నాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేసే ఆటగాళ్ల పట్ల ఈ రూల్ శాపంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆల్ రౌండర్లను తుదిజట్టులోకి తీసుకోవడం మానేసి, స్పెషలిస్టు ప్లేయర్ల కోసం జట్లు ప్రాధన్యమిస్తాయని పేర్కొన్నాడు. అందుచేత ఆల్ రౌండర్లకు ఈ రూల్ మింగుడు పడబోదని తెలిపాడు. అయితే ఈ రూల్ వల్ల కొన్ని విప్లవాత్మక మార్పులకు అవకాశముందని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా టాస్ ప్రభావం అంతగా ఉండబోదని తెలిపాడు. టాస్ కు ముందే రెండు జట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కుతుందని, ఈ విషయంలో ఈ రూల్ తనను అబ్బుర పరిచిందని వ్యాఖ్యానించాడు. అయితే ఏదేమైనా ఈ రూల్ పట్ల మొత్తం మీద తను కాస్త అన్ హేపీగా ఉన్నానని పేర్కొన్నాడు.
ఐపీఎల్ అండ ఉంటే మంచిదే..
ఇక ఎస్ ఏ 20లో మెజారిటీ జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలే నిర్వహిస్తున్నాయి. వాటి పేర్లను కూడా ఐపీఎల్ జట్ల మాదిరిగానే పెట్టాయి. ఉదాహరణకు పార్ల్ రాయల్స్ (రాజస్థాన్ రాయల్స్), ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్), ఎంఐ కేప్ టౌన్ (ముంబై ఇండియన్స్), సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (సన్ రైజర్స్ హైదరాబాద్), జోబర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) లన ఆయా ఐపీఎల్ ప్రాంచైజీలు నిర్వహిస్తున్నాయి. ఈ టోర్నీ వెనకాల ఐపీఎల్ ప్రాంచైజీలు ఉండటం శుభపరిణామమని, లీగ్ ఇంకా ఎత్తుకు ఎదిగేందుకు తోడ్పడుతుందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ నిర్వహణలోని అనుభవం ఈ లీగ్ ను సజావుగా నడిపించేందుకు ఉపకరిస్తుందని పేర్కొన్నాడు. ఇక ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ, ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో డివిలియర్స్ ఆర్సీబీ, ఢిల్లీ తదితర జట్లకు ఆడాడు.
Also Read: Overrated Gill: గిల్ ఓవర్రేటెడ్ ప్లేయర్.. తనకంటే నాణ్యమైన ఆటగాళ్లున్నారు.. వారికి అవకాశమివ్వాలి: దిగ్గజ ప్లేయర్ ఫైర్