Virat Kohli vs CSK Stats: విరాట్ కోహ్లీ కొన్ని నెలల క్రితం వరకు ఫామ్‌లో లేక ఇబ్బంది పడ్డాడు. తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ IPL 2025లో మొదటి మ్యాచ్ నుంచే ఫామ్‌లోకి వచ్చేశాడు. గ్రౌండ్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పుడు CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా తొలి బంతి నుంచే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ దెబ్బకు తన IPL కెరీర్‌లో 62వ ఫిఫ్టీని సాధించాడు. చెన్నైతో జరిగిన పోరులో 33 బంతుల్లో 62 పరుగుల చేసి పలు రికార్డులను బ్రేక్ చేశాడు. విరాట్ ఇప్పుడు IPL 2025లో సాయి సుధర్శన్ తర్వాత 500 పరుగుల మార్కును అందుకున్న రెండో బ్యాట్స్‌మన్ అయ్యాడు. ఈ అర్ధశతకంతో కింగ్ కోహ్లీ బద్దలు కొట్టిన 5 రికార్డులు ఏంటో తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ బద్దలు కొట్టిన 5 పెద్ద రికార్డులు
IPLలో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లీ ఇప్పుడు IPLలో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ CSKకు వ్యతిరేకంగా ఇప్పుడు 1,146 పరుగులు చేశాడు, ఇది ఒకే జట్టుపై చేసిన అత్యధిక పరుగులు. గతంలో ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది, అతను పంజాబ్ కింగ్స్‌కు వ్యతిరేకంగా 1,134 పరుగులు చేశాడు.
RCB తరఫున వరుస అర్ధశతకాల రికార్డు- విరాట్ కోహ్లీ RCB తరఫున వరుసగా 4 ఇన్నింగ్స్‌లలో అర్ధశతకాలు సాధించి తన రికార్డుకు సమానం చేసుకున్నాడు. విరాట్ 2016లో RCB తరపున ఆడుతూ 4 ఫిఫ్టీలు వరుసగా చేశాడు, ఇప్పుడు IPL 2025లో కూడా ఈ ఘనతను సాధించాడు.
CSKపై అత్యధిక అర్ధశతకాలు- విరాట్ కోహ్లీ ఇప్పుడు IPLలో చెన్నై సూపర్ కింగ్స్‌కు వ్యతిరేకంగా అత్యధిక హాఫ్‌సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతను CSKకు వ్యతిరేకంగా 10 ఫిఫ్టీలు చేశాడు, ఈ విషయంలో శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ , రోహిత్ శర్మను వెనుక్కి నెట్టాడు. ఈ ముగ్గురు CSKకు వ్యతిరేకంగా 9 ఫిఫ్టీలు చేశారు.
T20లో ఒకే వేదికపై అత్యధిక సిక్స్‌లు- T20 క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఒకే వేదికపై అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో అతను 152 సిక్స్‌లు చేశాడు, దీంతో క్రిస్ గేల్ 151 సిక్స్‌ల రికార్డును బద్దలు కొట్టాడు.
T20లో ఒకే జట్టు తరఫున అత్యధిక సిక్స్‌లు- T20 క్రికెట్‌లో ఒకే జట్టు తరఫున అత్యధిక సిక్స్‌ల రికార్డు ఇప్పుడు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. RCB కోసం అతను 301 సిక్స్‌లు చేశాడు, ఈ రికార్డు ముందు కూడా అతని పేరిటే ఉంది. అతని తర్వాత క్రిస్ గేల్ ఉన్నాడు.
కోహ్లీ వద్ద ఆరెంజ్ క్యాప్
కింగ్ కోహ్లీ 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఈ దబ్బకు ఆరెంజ్ క్యాప్‌ను కూడా విరాట్ గెలుచుకున్నాడు. సుదర్శన్ నుంచి ఆరెంజ్ క్యాప్ లాక్కున్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ కంటే విరాట్ కేవలం ఒక పరుగు ముందు ఉన్నాడు. సాయి సుదర్శన్ ఐపీఎల్ 2025లో 504 పరుగులు చేశాడు. కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో 63.12 సగటుతో 505 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ 10 మ్యాచ్‌ల్లో 50.40 సగటుతో 504 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌కు చెందిన సూర్యకుమార్ యాదవ్ 67.86 సగటుతో 475 పరుగులు చేసి మూడవ స్థానంలో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఈ జాబితాలో 51.67 సగటుతో 465 పరుగులు చేసి ఐదో స్థానంలో ఉన్నాడు.