రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో ప్లస్ మనదేశంలో జూన్ 8వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లూ కంపెనీ చైనాలో ఈ నెలలోనే లాంచ్ చేసింది. వీటిలో 6.7 అంగుళాల కర్వ్‌డ్ డిస్‌ప్లేలు, 1 టీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండనున్నాయి. రియల్‌మీ 11 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, 100 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఇక రియల్‌మీ 11 ప్రో ప్లస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.


రియల్‌మీ 11 ప్రో స్మార్ట్ ఫోన్లు మనదేశంలో జూన్ 8వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. రియల్‌మీ 11 ప్రో సిరీస్‌కు సంబంధించిన ప్రత్యేకమైన ల్యాండింగ్ పేజీ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో చూడవచ్చు. దీనికి సంబంధించిన లాంచ్ డేట్, టైమ్ కూడా అప్‌డేట్ చేశారు. కానీ రియల్‌మీ 11 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఈ ల్యాండింగ్ పేజీలో చూడవచ్చు.


రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు (అంచనా)
మే 10వ తేదీన ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. రియల్‌మీ 11 ప్రో, 11 ప్రో ప్లస్ రెండిట్లోనూ డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించనున్నారు. 6ఎన్ఎం ఆక్టాకోర్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కూడా ఇందులో ఉండనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో చూడవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... రియల్‌మీ 11 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 100 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించనున్నారు. రియల్‌మీ 11 ప్రో ప్లస్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ల ద్వారా వేర్వేరు మోడ్‌లో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.


ఈ రెండు ఫోన్లలోనూ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించనున్నారు. రియల్‌మీ 11 ప్రో చైనాలో 512 జీబీ వరకు స్టోరేజ్, రియల్‌మీ 11 ప్రో ప్లస్‌ల 1 టీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీలనే ఈ రెండిట్లోనూ చూడవచ్చు. అయితే రియల్‌మీ 11 ప్రో 67W ఫాస్ట్ ఛార్జింగ్, రియల్‌మీ 11 ప్రో ప్లస్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌లను సపోర్ట్ చేయనుంది.


ఇటీవలే రియల్‌మీ (Realme) తన కోకా కోలా ఎడిషన్ ఫోన్, రియల్‌మీ 10 ప్రో 5జీ (Realme 10 Pro 5G) ని మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మీరు వెనుక వైపున డ్యూయల్ టోన్ డిజైన్‌ను చూడవచ్చు. వెనుక వైపు నలుపు, ఎరుపు కోకా కోలా రంగులను చూడవచ్చు. దీనితో పాటు రెండు కంపెనీల బ్రాండింగ్ వెనుక ప్యానెల్‌లో కనుగొనబడుతుంది.


రియల్‌మీ 10 ప్రో 5జీ కోకా కోలా ఎడిషన్ గత సంవత్సరం లాంచ్ అయిన రియల్‌మీ 10 ప్రో 5జీ లాగా ఉంటుంది. వాస్తవానికి కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత సంవత్సరం మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ కోకా-కోలాతో కలిసి పని చేసినందున, దీని కారణంగా రియల్‌మీ ఈ ఫోన్‌ను మరోసారి కొత్త డిజైన్‌లో లాంచ్ చేసింది. రియల్‌మీ ఈ కొత్త ఫోన్ ధరను రూ.20,999గా నిర్ణయించింది. మీరు ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, రియల్ మీ స్టోర్ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.


Read Also: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!