Pat Cummins in IPL 2022 Mega Auction: గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) మొదలైన సమయంలో ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌కు డిమాండ్ అధికంగా ఉండేది. కానీ సీజన్ల వారీగా వస్తున్న మార్పులతో బ్యాటర్, బౌలర్ కంటే ఆల్ రౌండర్లపై ఫోకస్ చేస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. గత కొన్ని సీజన్లను పరిశీలిస్తే స్టార్ ఆల్ రౌండర్లకు మినిమం గ్యారంటీ మనీ పెట్టి వేలంలో తీసుకుంటున్నారు. అలా హాట్ కేకులా వేలంలో అమ్ముడుపోయే ఆల్ రౌండర్లలో ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ ఒకడు.


గతంలో కోల్‌కతా రైటర్స్ తరఫున ఆడిన ఆల్ రౌండర్ పాట్ కమిన్స్.. ఆ తరువాత ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్)కు 2017కు ప్రాతినిథ్యం వహించాడు. అవకాశం దక్కడంతో కేకేఆర్ ఫ్రాంచైజీ 2020లో మరోసారి కమిన్స్‌ను వేలంలో దక్కించుకుంది. పేస్ బౌలర్‌గా ఓపెనింగ్ బౌలింగ్ చేసే కమిన్స్.. 7, 8 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి సైతం మెరుపులు మెరిపించగలడు. దీంతో మూడు ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2022 వేలంలో పాట్ కమిన్స్‌ను దక్కించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు మెగా వేలంలో ఆసీస్ ఆల్ రౌండర్ కోసం ధరలో తగ్గేదే లే అనేలా ఉన్నాయి.


ఢిల్లీ క్యాపిటల్స్
కగిసో రబాడ లాంటి కీలక పేసర్‌ను వేలానికి వదిలేసిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో స్టార్ పేసర్ కోసం వేట మొదలుపెట్టింది. అన్రిచ్ నార్జే, రబాడ పేస్ ద్వయం ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ఇరుకునపెట్టి వికెట్లు సాధిస్తున్నారు. దీంతో ఢిల్లీ ఫ్రాంచైజీ తొలిసారి ఓ ఐపీఎల్ ఫైనల్ చేరింది. రబాడను వదులుకున్న ఢిల్లీకి పాట్ కమిన్స్ లాంటి పేసర్, బ్యాటర్, ఆల్ రౌండర్ సేవలు అవసరం ఎంతైనా ఉంది. కనుక ధనాధన్ ఇన్నింగ్స్ ఆడే కమిన్స్ కోసం వేలంలో భారీ మొత్తం వెచ్చించే అవకాశాలున్నాయి. 


ముంబై ఇండియన్స్
ఐపీఎల్ లో ఆల్ రౌండర్ల జట్టుగా ముంబై ఇండియన్స్ వరుస సీజన్లలో సంచలనాలు చేస్తోంది. కానీ ఈ సీజన్లో హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్, ట్రెంట్ బౌల్ట్ లాంటి మ్యాచ్ విన్నర్లను ముంబై వదులకుంది. జస్ప్రిత్ బూమ్రాను మాత్రం రీటెయిన్ చేసుకున్న ముంబై పాట్ కమిన్స్ తమ ఫ్రాంచైజీకి వస్తే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో అతడు కీలకంగా మారుతాడని భావిస్తోంది. అతడి కోసం భారీ మొత్తం వెచ్చిందుకు 5 సార్లు ఛాంపియన్ అయిన ఫ్రాంచైజీ సిద్ధంగా ఉంది.


పంజాబ్ కింగ్స్..
అనిశ్చితికి మారుపేరైన జట్టుగా పంజాబ్ కింగ్స్‌కు పేరుంది. అవకాశాలు లభించినా కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుని ఎన్నో మ్యాచ్‌లు ఓటమిపాలైంది ఈ జట్టు. ఈ సీజన్ వేలం కోసం మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్ ను అట్టిపెట్టుకున్న పంజాబ్ కింగ్స్.. అనూహ్యంగా కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, క్రిస్ గేల్‌లను రిలీజ్ చేసింది. ఆస్ట్రేలియాకు ఇటీవల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాట్ కమిన్స్‌ను తీసుకుని సారథ్య బాధ్యతలు ఇచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు. షమీ లాంటి కీలక పేసర్ ను వదులుకున్న పంజాబ్.. ఆ లోటును భర్తీ చేసుకుంటూనే బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న పాట్ కమిన్స్‌ను వేలంలో భారీ మొత్తానికి తీసుకుంటుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.


Also Read: Lata Mangeshkar: బీసీసీఐకి, 1983 వరల్డ్ కప్ విజేతలకు లతా మంగేష్కర్ చేసిన గొప్ప సాయం ఏంటో తెలుసా!


Also Read: U-19 WC 2022: ఆంధ్రా క్రికెటర్ రషీద్ అండర్-19 వరల్డ్ కప్ లో అదరగొట్టాడు-ఫైనల్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన