CSK vs RCB LIVE Score: ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నైదే విజయం - కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ గెలిచిన రుతురాజ్!

CSK vs RCB LIVE Score, IPL 2024: ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

Saketh Reddy Eleti Last Updated: 22 Mar 2024 11:55 PM
ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నైదే విజయం - కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ గెలిచిన రుతురాజ్!

ఐపీఎల్ 2024 సీజన్ మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్లతో విజయం సాధించింది. 18.4 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని చెన్నై నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

18 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 164-4

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 164-4గా ఉంది.


శివం దూబే (28: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు)
రవీంద్ర జడేజా (24: 16 బంతుల్లో, ఒక సిక్సర్)


మహ్మద్ సిరాజ్: 4-0-38-0

17 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 156-4

అల్జారీ జోసెఫ్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 156-4గా ఉంది.


శివం దూబే (20: 19 బంతుల్లో, రెండు ఫోర్లు)
రవీంద్ర జడేజా (24: 16 బంతుల్లో, ఒక సిక్సర్)


అల్జారీ జోసెఫ్: 3-0-30-0

16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 140-4

కామెరాన్ గ్రీన్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 140-4గా ఉంది.


శివం దూబే (15: 16 బంతుల్లో, ఒక ఫోర్)
రవీంద్ర జడేజా (19: 13 బంతుల్లో, ఒక సిక్సర్)


కామెరాన్ గ్రీన్: 3-0-27-2

15 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 128-4

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 128-4గా ఉంది.


శివం దూబే (7: 13 బంతుల్లో)
రవీంద్ర జడేజా (16: 10 బంతుల్లో, ఒక సిక్సర్)


మహ్మద్ సిరాజ్: 3-0-30-0

14 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 121-4

గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 121-4గా ఉంది.


శివం దూబే (6: 11 బంతుల్లో)
రవీంద్ర జడేజా (10: 6 బంతుల్లో, ఒక సిక్సర్)


గ్లెన్ మ్యాక్స్‌వెల్: 1-0-7-0

13 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 114-4

కామెరాన్ గ్రీన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. డేరిల్ మిషెల్ అవుటయ్యాడు. 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 114-4గా ఉంది.


శివం దూబే (6: 8 బంతుల్లో)
రవీంద్ర జడేజా (3: 3 బంతుల్లో)


కామెరాన్ గ్రీన్: 2-0-15-2

12 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 109-3

అల్జారీ జోసెఫ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 109-3గా ఉంది.


డేరిల్ మిషెల్ (22: 17 బంతుల్లో, రెండు సిక్సర్లు)
శివం దూబే (5: 6 బంతుల్లో)


అల్జారీ జోసెఫ్: 2-0-18-0

అజింక్య రహానే అవుట్ - 11 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 102-3

కామెరాన్ గ్రీన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 102-3గా ఉంది.


డేరిల్ మిషెల్ (18: 14 బంతుల్లో, రెండు సిక్సర్లు)
శివం దూబే (2: 3 బంతుల్లో)


కామెరాన్ గ్రీన్: 1-0-10-1


అజింక్య రహానే (సి) గ్లెన్ మ్యాక్స్‌వెల్ (బి) కామెరాన్ గ్రీన్ (27: 19 బంతుల్లో, రెండు సిక్సర్లు)

10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 92-2

మయాంక్ డాగర్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 92-2గా ఉంది.


అజింక్య రహానే (21: 17 బంతుల్లో, ఒక సిక్సర్)
డేరిల్ మిషెల్ (17: 13 బంతుల్లో, రెండు సిక్సర్లు)


మయాంక్ డాగర్: 2-0-6-0

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 88-2

కరణ్ శర్మ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. డేరిల్ మిషెల్ రెండు సిక్సర్లు కొట్టాడు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 88-2గా ఉంది.


అజింక్య రహానే (19: 15 బంతుల్లో, ఒక సిక్సర్)
డేరిల్ మిషెల్ (15: 9 బంతుల్లో, రెండు సిక్సర్లు)


కరణ్ శర్మ: 2-0-24-1

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 73-2

మయాంక్ డాగర్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 73-2గా ఉంది.


అజింక్య రహానే (18: 14 బంతుల్లో, ఒక సిక్సర్)
డేరిల్ మిషెల్ (1: 4 బంతుల్లో)


మయాంక్ డాగర్: 1-0-2-0

రచిన్ రవీంద్ర అవుట్ - ఏడు ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 71-2

కరణ్ శర్మ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. రచిన్ రవీంద్ర అవుటయ్యాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 71-2గా ఉంది.


అజింక్య రహానే (17: 12 బంతుల్లో, ఒక సిక్సర్)


కరణ్ శర్మ: 1-0-9-1


రచిన్ రవీంద్ర (సి) రజత్ పాటీదార్ (బి) కరణ్ శర్మ (37: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు)

పవర్‌ప్లేలో దుమ్ము రేపిన చెన్నై - ఆరు ఓవర్లలో సీఎస్కే స్కోరు 62-1

యష్ దయాళ్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 62-1గా ఉంది.


రచిన్ రవీంద్ర (31: 13 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
అజింక్య రహానే (14: 8 బంతుల్లో, ఒక సిక్సర్)


యష్ దయాళ్: 3-0-28-1

ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 49-1

అల్జారీ జోసెఫ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 49-1గా ఉంది.


రచిన్ రవీంద్ర (31: 13 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
అజింక్య రహానే (1: 2 బంతుల్లో)


అల్జారీ జోసెఫ్: 1-0-11-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 38-1

యష్ దయాళ్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పెవిలియన్ బాట పట్టాడు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 38-1గా ఉంది.


రచిన్ రవీంద్ర (17: 6 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్)
అజింక్య రహానే (0: 0 బంతుల్లో)


యష్ దయాళ్: 2-0-15-1


రుతురాజ్ గైక్వాడ్ (సి) కామెరాన్ గ్రీన్ (బి) యష్ దయాళ్ (15: 15 బంతుల్లో, మూడు ఫోర్లు)

మూడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 28-0

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 28-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ (10: 12 బంతుల్లో, రెండు ఫోర్లు)
రచిన్ రవీంద్ర (17: 6 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్)


మహ్మద్ సిరాజ్: 2-0-23-0

రెండు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 13-0

యష్ దయాళ్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 13-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ (8: 10 బంతుల్లో, రెండు ఫోర్లు)
రచిన్ రవీంద్ర (5: 2 బంతుల్లో, ఒక ఫోర్)


యష్ దయాళ్: 1-0-5-0

మొదటి ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 8-0

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 8-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ (8: 6 బంతుల్లో, రెండు ఫోర్లు)
రచిన్ రవీంద్ర (0: 0 బంతుల్లో)


మహ్మద్ సిరాజ్: 1-0-8-0

20 ఓవర్లలో బెంగళూరు స్కోరు 173/6 - చెన్నై ముందు భారీ టార్గెట్!

తుషార్ దేశ్‌పాండే వేసిన చివరి ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 173-6 స్కోరు సాధించింది. చెన్నై విజయానికి 120 బంతుల్లో 174 పరుగులు కావాలి.


దినేష్ కార్తీక్ (38: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)


తుషార్ దేశ్‌పాండే: 4-0-47-0


అనుజ్ రావత్ (రనౌట్ - మహేంద్ర సింగ్ ధోని) (48: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు)

19 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 164-5

ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 164-5గా ఉంది.


అనుజ్ రావత్ (48: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు)
దినేష్ కార్తీక్ (34: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)


ముస్తాఫిజుర్ రెహ్మాన్: 4-0-30-4

18 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 148-5

తుషార్ దేశ్‌పాండే వేసిన ఈ ఓవర్లో 25 పరుగులు వచ్చాయి. దినేష్ కార్తీక్ ఒక సిక్సర్ కొట్టగా, అనుజ్ రావత్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. 18 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 148-5గా ఉంది.


అనుజ్ రావత్ (41: 22 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు)
దినేష్ కార్తీక్ (26: 17 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు)


తుషార్ దేశ్‌పాండే: 3-0-38-0

17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 123-5

ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 123-5గా ఉంది.


అనుజ్ రావత్ (25: 18 బంతుల్లో, మూడు ఫోర్లు)
దినేష్ కార్తీక్ (19: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)


ముస్తాఫిజుర్ రెహ్మాన్: 3-0-14-4

16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 116-5

మహీష్ తీక్షణ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 116-5గా ఉంది.


అనుజ్ రావత్ (20: 13 బంతుల్లో, రెండు ఫోర్లు)
దినేష్ కార్తీక్ (18: 14 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)


మహీష్ తీక్షణ: 4-0-36-0

15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 102-5

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 102-5గా ఉంది.


అనుజ్ రావత్ (18: 11 బంతుల్లో, రెండు ఫోర్లు)
దినేష్ కార్తీక్ (6: 10 బంతుల్లో)


దీపక్ చాహర్: 4-0-37-1

14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 90-5

రవీంద్ర జడేజా వేసిన 14వ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 90-5గా ఉంది.


అనుజ్ రావత్ (8: 7 బంతుల్లో)
దినేష్ కార్తీక్ (4: 8 బంతుల్లో)


రవీంద్ర జడేజా: 4-0-21-0

ఫస్ట్ 10 ఓవర్లలో దుమ్ము రేపిన చెన్నై - ఆర్సీబీ స్కోరు 75-3

మహీష్ తీక్షణ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 75-3గా ఉంది.


విరాట్ కోహ్లీ (21: 16 బంతుల్లో, ఒక సిక్సర్)
కామెరాన్ గ్రీన్ (16: 17 బంతుల్లో, ఒక ఫోర్)


మహీష్ తీక్షణ: 3-0-22-0

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 63-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 63-3గా ఉంది.


విరాట్ కోహ్లీ (11: 12 బంతుల్లో)
కామెరాన్ గ్రీన్ (14: 15 బంతుల్లో, ఒక ఫోర్)


రవీంద్ర జడేజా: 2-0-14-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 55-3

మహీష్ తీక్షణ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 55-3గా ఉంది.


విరాట్ కోహ్లీ (9: 10 బంతుల్లో)
కామెరాన్ గ్రీన్ (8: 11 బంతుల్లో)


మహీష్ తీక్షణ: 2-0-10-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 48-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 48-3గా ఉంది.


విరాట్ కోహ్లీ (6: 8 బంతుల్లో)
కామెరాన్ గ్రీన్ (4: 7 బంతుల్లో)


రవీంద్ర జడేజా: 1-0-6-0

పవర్‌ప్లే చెన్నైదే - ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 42-3

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. మూడో బంతికి ఫాంలో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ అవుటయ్యాడు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 42-3గా ఉంది.


విరాట్ కోహ్లీ (4: 6 బంతుల్లో)
కామెరాన్ గ్రీన్ (0: 3 బంతుల్లో)


దీపక్ చాహర్: 3-0-25-1


గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సి) మహేంద్ర సింగ్ ధోని (బి) దీపక్ చాహర్ (0: 1 బంతి)

ఒకే ఓవర్లో రెండు వికెట్లు - ఐదు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 41-2

ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. మూడో బంతికి ఫాఫ్ డుఫ్లెసిస్, చివరి బంతికి రజత్ పాటీదార్ అవుటయ్యారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 41-2గా ఉంది.


విరాట్ కోహ్లీ (3: 4 బంతుల్లో)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0: 0 బంతుల్లో)


ముస్తాఫిజుర్ రెహ్మాన్: 1-0-4-2


ఫాఫ్ డుఫ్లెసిస్ (సి) మహేంద్ర సింగ్ ధోని (బి) ముస్తాఫిజుర్ రెహ్మాన్ (35: 23 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు)
రజత్ పాటీదార్ (సి) రచిన్ రవీంద్ర (బి) ముస్తాఫిజుర్ రెహ్మాన్ (0: 3 బంతుల్లో)

నాలుగు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 37-0

మహీష్ తీక్షణ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 37-0గా ఉంది.


విరాట్ కోహ్లీ (3: 4 బంతుల్లో)
ఫాఫ్ డుఫ్లెసిస్ (31: 20 బంతుల్లో, ఏడు ఫోర్లు)


మహీష్ తీక్షణ: 1-0-3-0

మూడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 33-0

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో ఫాఫ్ డుఫ్లెసిస్ నాలుగు ఫోర్లు కొట్టాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 33-0గా ఉంది.


విరాట్ కోహ్లీ (1: 1 బంతి)
ఫాఫ్ డుఫ్లెసిస్ (30: 17 బంతుల్లో, ఏడు ఫోర్లు)


దీపక్ చాహర్: 2-0-24-0

రెండు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 16-0

తుషార్ దేశ్ పాండే వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 16-0గా ఉంది.


విరాట్ కోహ్లీ (1: 1 బంతి)
ఫాఫ్ డుఫ్లెసిస్ (14: 11 బంతుల్లో, మూడు ఫోర్లు)


తుషార్ దేశ్ పాండే: 1-0-9-0

మొదటి ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 7-0

దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 7-0గా ఉంది.


విరాట్ కోహ్లీ (1: 1 బంతి)
ఫాఫ్ డుఫ్లెసిస్ (5: 5 బంతుల్లో, ఒక ఫోర్)


దీపక్ చాహర్: 1-0-7-0

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సబ్స్
యష్ దయాళ్

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు ఇదే

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే


చెన్నై సూపర్ కింగ్స్ సబ్స్
శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, షేక్ రషీద్, నిశాంత్ సింధు, మొయిన్ అలీ

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ఫ్లెసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై మొదట బౌలింగ్ చేయనుంది.

స్టేజ్‌ను ఊపేస్తున్న రెహ్మాన్

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ తన సూపర్ హిట్ సాంగ్స్‌తో స్టేజ్‌ను ఊపేస్తున్నాడు.





సెరెమోనీని ప్రారంభించిన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ల టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్‌తో ఐపీఎల్ ఓపెనింగ్ సెరెమోనీ ప్రారంభం అయింది.





ధోని కోసం రెహ్మాన్ పాట

మహేంద్ర సింగ్ ధోని కోసం ప్రత్యేకంగా ‘నీ సింగం దానే’ పాటను ఆలపించనున్నట్లు ఏఆర్ రెహ్మాన్ తెలిపారు.





రెడీ అవుతున్న ఆర్సీబీ

స్టేడియం గేట్లు తెరుచుకున్నాయి

చెన్నై స్టేడియం గేట్లు తెరుచుకున్నాయి. 6:30 గంటలకు ప్రారంభోత్సవం జరగనుంది. 7:30 గంటలకు టాస్ వేయనున్నారు. 8 గంటలకు ప్రారంభం కానుంది.





Background

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 సీజన్‌కి తెర ‌లేచింది. నేటి నుంచి రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్... సిటీల వారీగా, ఫేవరెట్ క్రికెటర్ల వారీగా విడిపోనున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు మొద‌టి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ ప్రారంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. చెన్నై సూప‌ర్ ‌కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా సూపర్ కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగనుంది. ఈ సాలా క‌ప్ నం‌దే అంటూ బెంగ‌ళూరు జోరు మీదుంది. ఈ సీజ‌న్‌కి చెన్నై జట్టులో పెద్ద మార్పు చేసింది మ‌హేంద్ర ‌సింగ్ ధోనీ బదులుగా రుతురాజ్‌గైక్వాడ్ చెన్నై జట్టుకు సారథ్యం వహించనున్నాడు. రెండు జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ గెలిచేది ఎవ‌రంటూ విశ్లేష‌ణ‌లు జోరుగా సాగుతున్నాయి.


చరిత్ర చెన్నై వైపే...
ఐపీఎల్ టోర్నమెంట్‌లోనే తిరుగులేని జట్లుచెన్నై సూప‌ర్‌కింగ్స్‌. టైటిల్ గెల‌వ‌లేదు అనే ఒక్క అపవాదు త‌ప్ప అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న జ‌ట్టు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. ఈ రెండు జ‌ట్ల మధ్య ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు జ‌రిగితే చెన్నై 20 మ్యాచ్‌లు గెలిచింది. బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రం ఫ‌లితం తేల‌లేదు. చరిత్ర ఇలా ఉన్నప్పటికీ ఆట మ‌రోలా ఉంటుంద‌ని బెంగ‌ళూరు అంటోంది. 


చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌, మొయిన్ ఆలీ, రవీంద్ర జ‌డేజా, ర‌చిన్ ర‌వీంద్ర‌, మిచెల్ శాంట్న‌ర్‌, శార్దూల్ ఠాకూర్‌, మతీష పతిరాణా కీల‌క ఆట‌గాళ్లు. కిందటి సీజన్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన డెవాన్ కాన్వే లేక‌పోవ‌డం లోట‌ని చెప్పొచ్చు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ , దినేశ్ కార్తీక్‌, కామెరూన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్‌ల‌ను కీలక ప్లేయ‌ర్స్‌గా చెప్పవచ్చు. ఎప్ప‌టిలానే చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లోనూ ప‌టిష్టంగా క‌నిపిస్తోంది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు మ‌ళ్లీ బ్యాటింగ్ లైన‌ప్‌ పైనే న‌మ్మకం పెట్టుకొంది. 


నాయకుడు కాదు కానీ నడిపిస్తూ ఉంటాడు...
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌ సింగ్‌ ధోనీ కెప్టెన్సీ వ‌దిలేశాడు కానీ అవసరమైనప్పుడు గైక్వాడ్‌కు గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. డీఆర్ఎ‌స్‌ని ధోని ఎంత స‌మ‌ర్ధ‌వంతంగా ఉప‌యోగించుకొంటాడో అంద‌రికీ తెలిసిందే. ఆ అనుభవం గైక్వాడ్‌కు కచ్చితంగా ఉపయోగపడుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లతో ఇప్ప‌టికే ఎన్నో మ్యాచ్‌లు ఆడి ఉండ‌టం దాదాపు సొంత మైదాన‌మైన చెపాక్ లో ప‌రిస్థితులు కొట్టిన‌ పిండి కావ‌డంతో మహేంద్ర సింగ్ ధోనీయే చెన్నైకి ప్ర‌ధాన బ‌లం. 


బీభత్సమైన బ్యాటింగ్
బెంగ‌ళూరు కూడా తేలిగ్గా మ్యాచ్ ఓడిపోయే ర‌కం కాదు. బ్యాటింగ్‌లో  డెప్త్ ఉన్న దృష్ట్యా దూకుడుగా ఆడేందుకే ఆర్సీబీ మొగ్గు చూపొచ్చు. బెంగళూరు జ‌ట్టుకు ప్ర‌ధాన బ‌లం విరాట్ కోహ్లీనే. తనతో పాటు ఫాఫ్ డుప్లెసిస్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, దినేష్ కార్తీక్‌, కామెరాన్ గ్రీన్ లు ఎంత ప్రమాదకరమైన ఆటగాళ్లో అందరికీ తెలిసిందే. కానీ ఈ మైదానంలో కోహ్లీకి మంచి రికార్డ్ లేదు. బెంగ‌ళూరుకి కూడా ఇది అంత‌గా అచ్చొచ్చిన మైదానం కాదు. దీంతో ఆర్సీబీ అభిమానులు క‌ల‌వ‌రానికి గుర‌వుతున్నారు.


స్పిన్ వైపే తిరగనున్న పిచ్...
చెపాక్ పిచ్ ఎప్పటినుంచో స్పిన్‌కు అనుకూలమని రికార్డులు చెబుతున్నాయి. మొద‌ట బ్యాటింగ్‌కి చేసిన జట్టుకు పరిస్థితులు అనుకూలించే అవ‌కాశాలున్నాయి. కాబ‌ట్టి టాస్ గెలిచిన జ‌ట్టు బ్యాటింగ్ వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. చెపాక్ మైదానం ఇప్ప‌టికే ప‌సుపు మ‌య‌ం అయిపోయింది. చెన్నై అభిమానులు స్టేడియం వ‌ద్ద‌కు చేరుకొంటున్నారు. రాత్రి 8 గంట‌ల‌కు ప్రారంభం కానున్న 2024 సీజ‌న్ తొలిమ్యాచ్‌లో ఎవ‌రు గెలిచినా టైటిల్ వేట‌లో వాళ్లు పంపే సిగ్న‌ల్స్ చాలా బ‌లంగా ఉంటాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.