ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ సారి మెగా వేలానికి మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13న వేలం జరగనుంది.
వేలంలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలను నిర్వాహకులు విడుదల చేశారు. 15వ సీజన్లో మొత్తం పది ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లకు తోడుగా లక్నో సూపర్‌జెయింట్స్, అహ్మదాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే.
'వేలానికి 590 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 228 మంది జాతీయ జట్లకు ఆడినవారు ఉన్నారు. 355 మంది జాతీయ జట్లకు ఆడలేదు. అసోసియేట్ దేశాల నుంచి ఏడుగురు ఉన్నారు' అని బీసీసీఐ కార్యదర్శి జేషా తెలిపారు. 'మొత్తం 370 భారతీయులు పేర్లు నమోదు చేసుకోగా 220 మంది విదేశీయులు ఉన్నారు' అని ఆయన పేర్కొన్నారు.
ఈ వేలంలో అత్యధిక నిధులు పంజాబ్ కింగ్స్ వద్ద ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీ రూ.72 కోట్లతో బరిలోకి దిగనుంది. దిల్లీ క్యాపిటల్స్ వద్ద అతి తక్కువ రూ.47 కోట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి 47, వెస్టిండీస్ నుంచి 34 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. కొన్ని రోజుల క్రితమే ఐపీఎల్ రీటెన్షన్ జాబితా విడుదలైంది. ఆయా ఫ్రాంచైజీలు తమకు కీలకమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: IPL Highest Paid Players: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్ తాజా కోటీశ్వరులు వీరే
Also Read: IPL Retention 2022: ఐపీఎల్ 2022 రిటెన్షన్ లిస్ట్ ఇదే.. ఏయే జట్లలో ఎవరున్నారు.. రైజర్స్ ఎంచుకున్న ముగ్గురు ఎవరు?