కేంద్ర బడ్జెట్ పవర్ ఫుల్ అని పలువురు ప్రముఖులు అభినందించారు. బడ్జెట్ అద్భుతంగా ఉందని దేశం మరింత ముందుకెళ్లడానికి ఉపయోగపడుతుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభినందించారు. క్రిప్టో వంటి అంశాల్లో మెరుగైన విధానం తీసుకు రావడం బాగుందన్నారు. 



బడ్జెట్ పరిశ్రమ వర్గాలకు విపరీతంగా నచ్చింది. ఉద్యోగాల కల్పన దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎండీ ఆశీష్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. 



మహింద్రా గ్రూపై చైర్మన్ ఆనంద్ మహింద్రా కూడా బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు. అత్యంత ప్రభావవంతమైనదని అభినదించారు. 



భారత్‌కు సంబంధించి అన్ని రంగాల వృద్ధికి ఈ బడ్జెట్ ఊతమిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.



భారత్‌ను అమృతకాలానికి తీసుకెళ్లే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినందుకు ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు.