హైదరాబాద్: గౌహతిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో IPL 2025లో జరిగిన 11వ మ్యాచ్‌లో ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓటమిపాలైంది. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తొలి విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని CSK జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమి చెందడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

విశాఖపట్నంలో ఆదివారం (మార్చి 30న) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో SRH తమ తొలి మ్యాచ్‌లో నెగ్గింది. ఆపై వరుస రెండు మ్యాచ్‌లలో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. 

ఆదివారం మ్యాచ్‌ల తరువాత చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. 4 పాయింట్లు 2.266 రన్‌రేటుతో ఆర్సీబీ టాప్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గినా 1.32 రన్ రేటుతో రెండో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. టాప్ 5 జట్లలో ఐపీఎల్ నెగ్గిన జట్టు గుజరాత్ మాత్రమే ఉంది.

  టీమ్ మ్యాచ్‌లు గెలుపు ఓటమి టై పాయింట్లు రన్ రేట్
1 Royal Challengers Bengaluru 2 2 0 0 4 2.266
2 Delhi Capitals 2 2 0 0 4 1.32
3 Lucknow Super Giants 2 1 1 0 2 0.963
4 Gujarat Titans 2 1 1 0 2 0.625
5 Punjab Kings 1 1 0 0 2 0.55
6 Kolkata Knight Riders 2 1 1 0 2 -0.308
7 Chennai Super Kings 3 1 2 0 2 -0.771
8 Sunrisers Hyderabad 3 1 2 0 2 -0.871
9 Rajasthan Royals 3 1 2 0 2 -1.112
10 Mumbai Indians 2 0 2 0 0 -1.163

- మూడు ఐపీఎల్ ట్రోపీలు నెగ్గిన కోల్ కతా జట్టు 2 మ్యాచ్ లలో ఒకటి నెగ్గి, ఒకటి ఓడింది. -0.308 రన్ రేటు ఉన్నా 6వ స్థానంలో నిలిచింది.- 5 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచ్ లలో ఒకటి నెగ్గి, రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. -0.771 రన్ రేటుతో 7వ స్థానంలో నిలిచింది.- ఒక ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచ్ లలో ఒకటి నెగ్గగా, రెండు మ్యాచ్ లలో ఓడింది. -0.871 రన్ రేటుతో 8వ స్థానంలో ఉంది.- తొలి ఐపీఎల్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్ లాడి ఒకదాంట్లో నెగ్గి, రెండింట్లో ఓడిపోయింది. -1.112 రన్ రేటుతో 9వ స్థానానికి పడిపోయింది.- 5 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. -1.163 రన్ రేటుతో అట్టడుగున నిలిచింది.