ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో మరోసారి అంపైరింగ్‌ వివాదాస్పదంగా మారింది. పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచులో థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న నిర్ణయంతో అంతా అవాక్కయ్యారు. దేవదత్‌ పడిక్కల్‌ ఔటైనా నాటౌట్‌గా ప్రకటించడంతో పంజాబ్‌ జట్టు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు, విశ్లేషకులు ఫైర్‌ అవుతున్నారు. ఆ అంపైర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.


Also Read: 'దారి తప్పిన పరుగుల వరద' : ఓడిన మ్యాచుల్లో టాప్‌ స్కోరర్లు వీరే!


షార్జా వేదికగా ఆదివారం పంజాబ్‌, బెంగళూరు తలపడ్డ సంగతి తెలిసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు దేవదత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఎడాపెడా షాట్లు బాదేశారు.ఈ క్రమంలో వికెట్‌ కోసం రాహుల్‌ సేన ఎంతో శ్రమించింది. దాంతో ఎనిమిదో ఓవర్‌ను కీలకమైన రవి బిష్ణోయ్‌తో వేయించింది.


Also Read: చితక బాదుడు 'సీక్రెట్‌' చెప్పిన మాక్సీ! బెంగళూరు అలా చెప్పడం వల్లే!


అంచనాలను అందుకుంటూ బిష్ణోయ్‌ తనదైన గూగ్లీలతో పడిక్కల్‌ను ఇబ్బంది పెట్టాడు. సహనం కోల్పోయిన పడిక్కల్‌ మూడో బంతిని రివర్స్‌స్వీప్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అతడి గ్లోవ్స్‌ను తాకీతాకనట్టుగా కనిపించిన బంతి రాహుల్‌ చేతుల్లో పడింది. వెంటనే అతడూ, బిష్ణోయ్‌ అంపైర్‌కు అప్పీలు చేశారు. మైదానంలోని అంపైర్‌ ఔటివ్వకపోవడంతో రివ్యూ తీసుకున్నారు. అందులో బంతి పడిక్కల్‌ గ్లోవ్స్‌కు తాకినట్టు కనిపించింది. స్పైక్‌లో కూడా మార్పులు కనిపించాయి. కానీ.. విచిత్రంగా అంపైన్‌ నాటౌట్‌గా ప్రకటించాడు.


Also Read: 'నిద్ర మాత్రల్లా' పనిచేస్తున్న సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. వీరూ విసుర్లు!


ఈ క్రమంలో రాహుల్‌ మైదానంలోని అంపైర్‌ అనంత పద్మనాభన్‌ వద్దకు వెళ్లి మూడో అంపైర్‌ నిర్ణయాన్ని ప్రశ్నించాడు. స్పైక్‌ కనిపించాక నాటౌట్‌ ఇవ్వడమేంటని అడిగాడు. డగౌట్లోని పంజాబ్‌ బృందమూ అసహనానికి గురైంది. స్కాట్‌ స్టైరిస్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌, ఆకాశ్‌ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని విమర్శించారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి