MI vs RCB Live Updates: 18.1 ఓవర్లలో 111 పరుగులకు ముంబై ఆలౌట్, 54 పరుగులతో బెంగళూరు విజయం

IPL 2021, Match 31, KKR Vs RCB: ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

ABP Desam Last Updated: 26 Sep 2021 11:20 PM
18.1 ఓవర్లలో 111 పరుగులకు ముంబై ఆలౌట్, 54 పరుగులతో బెంగళూరు విజయం

ముంబై ఆఖరివికెట్‌ను హర్షల్ పటేల్ తీశాడు. దీంతో 18.1 ఓవర్లలో 111 పరుగులకే ముంబై ఆలౌటైంది. బెంగళూరు 54 పరుగులతో విజయం సాధించింది.


హర్షల్ పటేల్ 3.1-0-17-4

18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 111-9, లక్ష్యం 166 పరుగులు

చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ ఒక్క పరుగూ రాలేదు. బుమ్రా అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 111-9గా ఉంది. విజయానికి 12 బంతుల్లో 55 పరుగులు కావాలి.


ట్రెంట్ బౌల్డ్ 0(3)
ఆడం మిల్నే 0(0)
చాహల్ 4-1-11-3

బుమ్రా అవుట్

చాహల్ బుమ్రాను బౌల్డ్ చేసి చాలెంజర్స్‌కు తొమ్మిదో వికెట్ అందించాడు.
బుమ్రా (బి) చాహల్ (5: 6 బంతుల్లో)

17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 111-8, లక్ష్యం 166 పరుగులు

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ ఆరు పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి హర్షల్ హ్యాట్రిక్ సాధించాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 111-8గా ఉంది. విజయానికి 18 బంతుల్లో 55 పరుగులు కావాలి.


జస్‌ప్రీత్ బుమ్రా 5(3)
ఆడం మిల్నే 0(0)
హర్షల్ పటేల్ 3-0-17-3

రాహుల్ చాహర్ అవుట్.. హర్షల్ పటేల్ హ్యాట్రిక్

రాహుల్ చాహర్‌ను కూడా తర్వాతి బంతికే బౌల్డ్ చేసి హర్షల్ పటేల్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ ఘనత సాధించిన మొదటి ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేలే.
రాహుల్ చాహర్ (బి) బౌల్డ్ (0: 1 బంతి)

పొలార్డ్ అవుట్

హార్దిక్ పటేల్ అవుటైన తర్వాతి బంతికే హర్షల్ పటేల్ పొలార్డ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
పొలార్డ్ (బి) హర్షల్ పటేల్ (7: 10 బంతుల్లో)

హార్దిక్ పాండ్యా అవుట్

హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి విరాట్ చేతికి హార్దిక్ చిక్కాడు.
హార్డిక్ పాండ్యా (సి) విరాట్ కోహ్లి (బి) హర్షల్ పటేల్ (3: 6 బంతుల్లో)

16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 105-5, లక్ష్యం 166 పరుగులు

డాన్ క్రిస్టియన్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ ఆరు పరుగులు మాత్రమే చేశారు. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 105-5గా ఉంది. విజయానికి 24 బంతుల్లో 61 పరుగులు కావాలి.


కీరన్ పొలార్డ్ 7(9)
హార్దిక్ పాండ్యా 3(5)
డాన్ క్రిస్టియన్ 2-0-21-0

15 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 99-5, లక్ష్యం 166 పరుగులు

సిరాజ్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు మాత్రమే చేశారు. సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 99-5గా ఉంది. విజయానికి 30 బంతుల్లో 67 పరుగులు కావాలి.


కీరన్ పొలార్డ్ 3(5)
హార్దిక్ పాండ్యా 1(3)
సిరాజ్ 3-0-15-1

సూర్యకుమార్ యాదవ్ అవుట్

మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్ (సి) చాహల్ (బి) సిరాజ్ (8: 9 బంతుల్లో)

14 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 97-4, లక్ష్యం 166 పరుగులు

మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ నాలుగు పరుగులు మాత్రమే చేశారు. కృనాల్ పాండ్యా అవుటయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 97-4గా ఉంది. విజయానికి 36 బంతుల్లో 69 పరుగులు కావాలి.


కీరన్ పొలార్డ్ 2(3)
సూర్యకుమార్ యాదవ్ 8(8)
మ్యాక్స్‌వెల్ 4-0-23-2

కృనాల్ పాండ్యా అవుట్

మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.


కృనాల్ పాండ్యా (బి) మ్యాక్స్‌వెల్ (5: 11 బంతుల్లో)

13 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 93-3, లక్ష్యం 166 పరుగులు

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ ఏడు పరుగులు చేశారు. 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 93-3గా ఉంది. విజయానికి 42 బంతుల్లో 74 పరుగులు కావాలి.


కృనాల్ పాండ్యా 5(10)
సూర్యకుమార్ యాదవ్ 6(6)
హర్షల్ పటేల్ 2-0-11-0

12 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 86-3, లక్ష్యం 166 పరుగులు

మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ నాలుగు పరుగులు చేశారు. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 86-3గా ఉంది. విజయానికి 48 బంతుల్లో 81 పరుగులు కావాలి.


కృనాల్ పాండ్యా 3(7)
సూర్యకుమార్ యాదవ్ 3(3)
మ్యాక్స్‌వెల్ 3-0-19-1

11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 82-3, లక్ష్యం 166 పరుగులు

చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ మూడు పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 82-3గా ఉంది. విజయానికి 54 బంతుల్లో 85 పరుగులు కావాలి.


కృనాల్ పాండ్యా 1(3)
సూర్యకుమార్ యాదవ్ 1(1)
చాహల్ 3-0-11-2

ఇషాన్ కిషన్ అవుట్

చాహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి ఇషాన్ కిషన్ అవుటయ్యాడు.


ఇషాన్ కిషన్ (సి) హర్షల్ పటేల్ (బి) చాహల్ (9: 12 బంతుల్లో, ఒక ఫోర్)

10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 79-2, లక్ష్యం 166 పరుగులు

మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ నాలుగు పరుగులు చేశారు. రోహిత్ శర్మ అవుటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 79-2గా ఉంది. విజయానికి 60 బంతుల్లో 88 పరుగులు కావాలి.


ఇషాన్ కిషన్ 8(10)
సూర్యకుమార్ యాదవ్ 0(0)
మ్యాక్స్‌వెల్ 2-0-15-1

రోహిత్ అవుట్

తర్వాతి బంతికే మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి రోహిత్ అవుటయ్యాడు. చేతికి దెబ్బ తగలడంతో బాల్ సరిగా కనెక్ట్ కాలేదు.
రోహిత్ (సి) దేవ్‌దత్ పడిక్కల్ (బి) మ్యాక్స్‌వెల్ (43: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్)

రోహిత్ చేతికి బలమైన గాయం

మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ కొట్టిన బంతి వేగంగా రోహిత్ చేతిని తాకింది. గాయం తీవ్రత తెలియరాలేదు.

9 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 75-1, లక్ష్యం 166 పరుగులు

చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ 11 పరుగులు చేశారు. 9 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 75-1గా ఉంది. విజయానికి 66 బంతుల్లో 92 పరుగులు కావాలి.


ఇషాన్ కిషన్ 6(7)
రోహిత్ శర్మ 41(25)
చాహల్ 2-0-8-1

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 69-1, లక్ష్యం 166 పరుగులు

గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ 11 పరుగులు చేశారు. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 69-1గా ఉంది. విజయానికి 72 బంతుల్లో 97 పరుగులు కావాలి.


ఇషాన్ కిషన్ 1(3)
రోహిత్ శర్మ 40(23)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 1-0-11-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 58-1, లక్ష్యం 166 పరుగులు

యజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు మాత్రమే చేశారు. డికాక్ అవుటయ్యాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 58-1గా ఉంది. విజయానికి 78 బంతుల్లో 108 పరుగులు కావాలి.


ఇషాన్ కిషన్ 0(0)
రోహిత్ శర్మ 31(20)
యజ్వేంద్ర చాహల్ 1-0-2-1

డికాక్ అవుట్

చాహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డికాక్ అవుటయ్యాడు. టీ20ల్లో డికాక్‌ను చాహల్ అవుట్ చేయడం ఇది మొదటిసారి.


డికాక్ (సి) గ్లెన్ మ్యాక్స్‌వెల్ (బి) చాహల్ (24: 23 బంతుల్లో, నాలుగు ఫోర్లు)

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 56-0, లక్ష్యం 166 పరుగులు

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ 5 పరుగులు మాత్రమే చేశారు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 56-0గా ఉంది. విజయానికి 84 బంతుల్లో 110 పరుగులు కావాలి.


క్వింటన్ డికాక్ 24(20)
రోహిత్ శర్మ 29(17)
హర్షల్ పటేల్ 1-0-5-0

ఐదో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 51-0, లక్ష్యం 166 పరుగులు

డాన్ క్రిస్టియన్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ 15 పరుగులు చేశారు. ఐదో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 51-0గా ఉంది. విజయానికి 90 బంతుల్లో 115 పరుగులు కావాలి.


క్వింటన్ డికాక్ 23(17)
రోహిత్ శర్మ 26(14)
డాన్ క్రిస్టియన్ 1-0-15-0

నాలుగో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 36-0, లక్ష్యం 166 పరుగులు

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ 9 పరుగులు చేశారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 36-0గా ఉంది. విజయానికి 96 బంతుల్లో 130 పరుగులు కావాలి.


క్వింటన్ డికాక్ 12(12)
రోహిత్ శర్మ 22(13)
మహ్మద్ సిరాజ్ 2-0-13-0

మూడో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 27-0, లక్ష్యం 166 పరుగులు

కైల్ జేమీసన్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ 17 పరుగులు చేశారు. మూడో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 27-0గా ఉంది. విజయానికి 102 బంతుల్లో 139 పరుగులు కావాలి.


క్వింటన్ డికాక్ 8(9)
రోహిత్ శర్మ 18(10)
కైల్ జేమీసన్ 2-0-22-0

రెండో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 10-0, లక్ష్యం 166 పరుగులు

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ ఐదు పరుగులు మాత్రమే చేశారు. రెండో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 10-0గా ఉంది. విజయానికి 108 బంతుల్లో 156 పరుగులు కావాలి.


క్వింటన్ డికాక్ 7(8)
రోహిత్ శర్మ 3(4)
మహ్మద్ సిరాజ్ 1-0-5-0

మొదటి ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 5-0, లక్ష్యం 166 పరుగులు

కైల్ జేమీసన్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ ఐదు పరుగులు మాత్రమే చేశారు. మొదటి ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 5-0గా ఉంది. విజయానికి 114 బంతుల్లో 161 పరుగులు కావాలి.


క్వింటన్ డికాక్ 3(4)
రోహిత్ శర్మ 2(2)
కైల్ జేమీసన్ 1-0-5-0

20 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 165-6, ముంబై లక్ష్యం 166 పరుగులు

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ మూడు పరుగులు మాత్రమే చేశారు. 20 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 165-6గా ఉంది. ముంబై విజయానికి 120 బంతుల్లో 166 పరుగులు కావాలి.


కైల్ జేమీసన్ 2(2)
క్రిస్టియన్ 1(3)
ట్రెంట్ బౌల్ట్ 4-0-17-1

షాబాజ్ అవుట్

బౌల్ట్ బౌలింగ్‌లో షాబాజ్ క్లీన్ బౌల్డయ్యాడు.
షాబాజ్ (బి) బౌల్ట్ (1: 3 బంతుల్లో)

19 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 162-5

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఆరు పరుగులు మాత్రమే చేశారు. 19 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 162-5గా ఉంది.


షాబాజ్ 1(1)
క్రిస్టియన్ 0(1)
జస్‌ప్రీత్ బుమ్రా 4-0-36-3

డివిలియర్స్ అవుట్

మ్యాక్స్‌వెల్ అవుటయిన తర్వాతి బంతికే ఏబీ డివిలియర్స్ కూడా అవుటయ్యాడు.
డివిలియర్స్ (సి) డికాక్ (బి) బుమ్రా (11: 6 బంతుల్లో, ఒక సిక్సర్)

మ్యాక్స్‌వెల్ అవుట్

బుమ్రా బౌలింగ్‌లో భారీ స్కోరుకు వెళ్లి మ్యాక్స్‌వెల్ అవుటయ్యాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సి) బౌల్ట్ (బి) బుమ్రా (56: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు)

18 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 156-3

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 17 పరుగులు రాబట్టారు. 18 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 156-3గా ఉంది. మ్యాక్స్‌వెల్ అర్థసెంచరీ పూర్తయింది.


ఏబీ డివిలియర్స్ 11(5)
మ్యాక్స్‌వెల్ 58(34)
ఆడం మిల్నే 4-0-48-1

17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 139-3

బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 13 పరుగులు రాబట్టారు. 17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 139-3గా ఉంది.


ఏబీ డివిలియర్స్ 11(5)
మ్యాక్స్‌వెల్ 35(28)
బుమ్రా 3-0-30-1

16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 126-3

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు మాత్రమే రాబట్టారు. 16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 126-3గా ఉంది.


ఏబీ డివిలియర్స్ 0(0)
మ్యాక్స్‌వెల్ 34(27)
ఆడం మిల్నే 3-0-31-1

విరాట్ కోహ్లీ అవుట్

ఆడం మిల్నే బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి విరాట్ కోహ్లి అవుటయ్యాడు.
విరాట్ కోహ్లీ (సి)(సబ్) అనుకుల్ రాయ్ (బి) ఆడం మిల్నే (50: 42 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు)

15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 119-2

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు మాత్రమే రాబట్టారు. 15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 119-2గా ఉంది.


విరాట్ కోహ్లీ 50(40)
మ్యాక్స్‌వెల్ 28(23)
ట్రెంట్ బౌల్ట్ 3-0-14-0

14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 117-2

రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 8 పరుగులు చేశారు. 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 117-2గా ఉంది.


విరాట్ కోహ్లీ 49(39)
మ్యాక్స్‌వెల్ 27(18)
రాహుల్ చాహర్ 4-0-33-1

13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 109-2

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 12 పరుగులు చేశారు. 13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 109-2గా ఉంది.


విరాట్ కోహ్లీ 48(37)
మ్యాక్స్‌వెల్ 20(14)
ఆడం మిల్నే 2-0-24-0

12 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 97-2

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 12 పరుగులు చేశారు. 12 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 97-2గా ఉంది.


విరాట్ కోహ్లీ 46(35)
మ్యాక్స్‌వెల్ 12(9)
కృనాల్ పాండ్యా 4-0-27-1

11 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 85-2

రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ మూడు పరుగులు మాత్రమే చేశారు. 11 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 85-2గా ఉంది.


విరాట్ కోహ్లీ 43(32)
మ్యాక్స్‌వెల్ 4(6)
రాహుల్ చాహర్ 3-0-25-1

10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 82-2

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఏడు పరుగులు చేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 82-2గా ఉంది.


విరాట్ కోహ్లీ 42(29)
మ్యాక్స్‌వెల్ 2(3)
కృనాల్ పాండ్యా 3-0-15-0

9 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 75-2

రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 12 పరుగులు చేశారు. శ్రీకర్ భరత్ అవుటయ్యాడు. 9 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 75-2గా ఉంది.


విరాట్ కోహ్లీ 38(25)
మ్యాక్స్‌వెల్ 0(1)
రాహుల్ చాహర్ 2-0-22-1

శ్రీకర్ భరత్ అవుట్

రాహుల్ చాహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి శ్రీకర్ భరత్ అవుటయ్యాడు.


శ్రీకర్ భరత్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) రాహుల్ చాహర్ (32: 24 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)

8 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 63-1

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఐదు పరుగులు చేశారు. 8 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 63-1గా ఉంది.


విరాట్ కోహ్లీ 33(23)
శ్రీకర్ భరత్ 25(21)
కృనాల్ పాండ్యా 2-0-8-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 58-1

రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 10 పరుగులు చేశారు. ఏడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 58-1గా ఉంది. వీరి భాగస్వామ్యం 50 పరుగులను దాటింది.


విరాట్ కోహ్లీ 32(21)
శ్రీకర్ భరత్ 22(17)
రాహుల్ చాహర్ 1-0-10-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 48-1

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ నాలుగు పరుగులు చేశారు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 48-1గా ఉంది.


విరాట్ కోహ్లీ 31(20)
శ్రీకర్ భరత్ 13(12)
కృనాల్ పాండ్యా 1-0-4-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 44-1

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 13 పరుగులు చేశారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 44-1గా ఉంది. ఈ ఓవర్లో విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో పది వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.


విరాట్ కోహ్లీ 29(16)
శ్రీకర్ భరత్ 12(10)
ఆడం మిల్నే 1-0-13-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 31-1

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 16 పరుగులు చేశారు. ఈ ఓవర్లో కోహ్లి ఒక ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టగా, భరత్ ఒక ఫోర్ కొట్టాడు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 31-1గా ఉంది.


విరాట్ కోహ్లీ 17(11)
శ్రీకర్ భరత్ 11(9)
జస్‌ప్రీత్ బుమ్రా 2-0-17-1

మూడో ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 15-1

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఐదు పరుగులు చేశారు. మూడో ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 15-1గా ఉంది.


విరాట్ కోహ్లీ 6(8)
శ్రీకర్ భరత్ 6(6)
ట్రెంట్ బౌల్ట్ 2-0-12-0

రెండో ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 10-1

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఒక్క పరుగు మాత్రమే చేశారు. రెండు పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. పడిక్కల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రెండో ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 10-1గా ఉంది.


విరాట్ కోహ్లీ 6(7)
శ్రీకర్ భరత్ 1(1)
జస్‌ప్రీత్ బుమ్రా 1-0-1-1

దేవ్‌దత్ పడిక్కల్ అవుట్

స్థిరంగా ఆడే దేవ్‌దత్ పడిక్కల్‌ను డకౌట్ చేసి బుమ్రా ముంబైకి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.


దేవ్‌దత్ పడిక్కల్ (సి) క్వింటన్ డికాక్ (బి) జస్‌ప్రీత్ బుమ్రా (0: 4 బంతుల్లో)

మొదటి ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 7-0

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఏడు పరుగులు రాబట్టారు. రెండో బంతికే విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 7-0గా ఉంది.


విరాట్ కోహ్లీ 6(6)
దేవ్‌దత్ పడిక్కల్ 0(0)
ట్రెంట్ బౌల్ట్ 1-0-7-0

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు

విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డాన్ క్రిస్టియన్, కైల్ జేమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్

ముంబై ఇండియన్స్ తుదిజట్టు

రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడం మిల్నే, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Background

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, తొలిసారి కప్పు ముద్దాడాలని భావిస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కాలం కలసిరావడం లేదు. ఐపీఎల్‌ రెండో అంచెలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయారు. విచిత్రంగా ఈ రెండు జట్లకు వరుస ఓటములు రుచిచూపించినవి ఒకే జట్లు కావడం విశేషం. అవే చెన్నై, కోల్‌కతా. అందుకే ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగు పర్చుకోవాలని ముంబయి, బెంగళూరు పట్టుదలగా ఉన్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.