KKR vs CSK Live Updates: ఆఖరి ఓవర్లో డ్రామా.. చెన్నై థ్రిల్లింగ్‌ విక్టరీ

ఐపీఎల్‌ రెండో అంచెలో దూకుడు మీదున్న రెండు జట్లు నేడు తలపడుతున్నాయి. రెండూ కుర్రాళ్లనే నమ్ముకున్నాయి. రెండూ దూకుడు మంత్రమే పఠిస్తున్నాయి. అవే చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌.

ABP Desam Last Updated: 26 Sep 2021 07:29 PM
ఆఖరి ఓవర్లో డ్రామా.. చెన్నై థ్రిల్లింగ్‌ విక్టరీ

సునిల్‌ నరైన్‌ వేసిన ఆఖరి బంతికి దీపక్‌ చాహర్‌ సింగిల్‌ తీశాడు. జట్టుకు విజయం అందించాడు. సీఎస్‌కే 2 వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కు దూసుకుపోయింది.

జడ్డూ ఔట్‌.. చెన్నై 171-8

నరైన్‌ వేసిన 19.5వ బంతికి జడ్డూ ఎల్బీ అయ్యాడు. స్కోరు 171 సమమైంది. ఆఖరి బంతికి చెన్నై పరుగు తీయకుంటే సూపర్‌ ఓవర్‌ జరుగుతుంది. (4) ఔటయ్యాడు.

సామ్‌ కరన్‌ ఔట్

నరైన్‌ వేసిన 19.1వ బంతికి సామ్‌ కరన్‌ (4) ఔటయ్యాడు.

19 ఓవర్లకు చెన్నై 168-6; లక్ష్యం 172

ప్రసిద్ధ్‌ కృష్ణ ఒత్తిడి భరించలేకపోయాడు. కీలకమైన ఈ ఓవర్లో ఏకంగా 22 పరుగులు ఇచ్చాడు. కోల్‌కతాను విజయానికి దూరం చేశాడు! రవీంద్ర జడేజా ఆఖరి నాలుగు బంతుల్లో వరుసగా 6,6,4,4తో రెచ్చిపోయాడు. కరన్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు. 


రవీంద్ర జడేజా (22; 6 బంతుల్లో 2x4, 2x6)
సామ్‌ కరన్‌  (4; 3  బంతుల్లో )

18 ఓవర్లకు చెన్నై 146-6; లక్ష్యం 172

వరుణ్ చక్రవర్తి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఐదు పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. సామ్‌ కరన్‌ (3), జడేజా (1) క్రీజులో ఉన్నారు. గెలుపు భారం వారిపైనే ఉంది. 

రైనా రనౌట్‌.. ఎంఎస్‌ ధోనీ ఔట్‌

వరుణ్‌ చక్రవర్తి వేసిన 17.1 బంతికి రైనా  (11; 7  బంతుల్లో ) రనౌట్‌ అయ్యాడు. ఇక మూడో బంతికి ఎంఎస్‌ ధోనీ (1) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. మ్యాచులో టెన్షన్‌ పెరుగుతోంది.

రైనా రనౌట్‌

వరుణ్‌ చక్రవర్తి వేసిన 17.1 బంతికి రైనా  (11; 7  బంతుల్లో ) రనౌట్‌ అయ్యాడు.

17 ఓవర్లకు చెన్నై 141-4; లక్ష్యం 172

ఫెర్గూసన్‌ 9 పరుగులిచ్చి కీలకమైన మొయిన్‌ అలీని ఔట్‌ చేశాడు. ఎంఎస్‌ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. రైనా పై ఒత్తిడి నెలకొంది. చెన్నైకి 18 బంతుల్లో 31 పరుగులు కావాలి.


ఎంఎస్‌ ధోనీ (0; 1 బంతుల్లో )
సురేశ్‌ రైనా (11; 7  బంతుల్లో )

గేమ్‌ ఛేంజర్‌: మొయిన్‌ అలీ ఔట్‌

ఫెర్గూసన్‌ వేసిన 16.4వ బంతికి మొయిన్‌ అలీ (32; 28 బంతుల్లో 2x4, 1x6) ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ సరిహద్దు వద్ద వెంకటేశ్‌ అయ్యర్‌కు చిక్కాడు.

16 ఓవర్లకు చెన్నై 132-3; లక్ష్యం 172

వెంకటేశ్‌ అయ్యర్‌ బౌలింగ్‌ చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. కానీ ఈ ఓవర్లో రైనా మూడు సార్లు రనౌట్‌ ప్రమాదం తప్పించుకున్నాడు. మొయిన్‌ అలీ ఆచితూచి ఆడాడు.


మొయిన్‌ అలీ (29; 25 బంతుల్లో )
సురేశ్‌ రైనా (8; 4  బంతుల్లో )

15 ఓవర్లకు చెన్నై 127-3; లక్ష్యం 172

సునిల్‌ నరైన్‌ వికెట్‌ తీసి 12 పరుగులు ఇచ్చాడు. రైనా రాగానే బౌండరీ బాదేశాడు. మొయిన్‌ అలీ క్రీజులో ఉన్నాడు. 


మొయిన్‌ అలీ (25; 20 బంతుల్లో )
సురేశ్‌ రైనా (7; 3  బంతుల్లో )

రాయుడు ఔట్‌..


సునిల్‌ నరైన్‌ వేసిన 14.2వ బంతికి అంబటి రాయుడు (10; 9  బంతుల్లో ) ఔటయ్యాడు. క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 

14 ఓవర్లకు చెన్నై 115-2; లక్ష్యం 172

చక్రవర్తి కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. మొయిన్‌ అలీ ఆచితూచి ఆడాడు. రాయుడు అతడికి తోడుగా నిలిచాడు.


మొయిన్‌ అలీ (24; 19 బంతుల్లో )
అంబటి రాయుడు (6; 7  బంతుల్లో ) 

13 ఓవర్లకు చెన్నై 112-2; లక్ష్యం 172

రసెల్‌ ఆరు పరుగులు ఇచ్చాడు.  రాయుడు, మొయిన్‌ అలీ నిలకడగా ఆడుతున్నారు.
మొయిన్‌ అలీ (23; 15 బంతుల్లో )
అంబటి రాయుడు (4; 5  బంతుల్లో ) 

12 ఓవర్లకు చెన్నై 106-2; లక్ష్యం 172

ప్రసిద్ధ్‌ ఐదు పరుగులు ఇచ్చి కీలక వికెట్‌ తీశాడు. మొయిన్‌ అలీ నిలకడగా ఆడాడు. అంబటి రాయుడు క్రీజులోకి వచ్చాడు.


మొయిన్‌ అలీ (21; 13 బంతుల్లో )
అంబటి రాయుడు (1; 1  బంతుల్లో ) 


 

డుప్లెసిస్‌ ఔట్‌

ప్రసిద్ధ్ వేసిన 11.3వ బంతికి డుప్లెసిస్‌ డుప్లెసిస్‌ (43; 30 బంతుల్లో 7x4)  ఔటయ్యాడు. ఈ క్యాచ్‌ను ఫెర్గూసన్‌ అద్భుతంగా పట్టాడు.

11 ఓవర్లకు చెన్నై 101-1; లక్ష్యం 172

రసెల్‌ 12 పరుగులు ఇచ్చాడు. మొయిన్‌ అలీ, డుప్లెసిస్‌ చెరో బౌండరీ కొట్టారు. కోల్‌కతా పరుగులను నియంత్రించలేకపోతోంది.


మొయిన్‌ అలీ (17; 10 బంతుల్లో )
డుప్లెసిస్‌ (43; 28 బంతుల్లో ) 


 

10 ఓవర్లకు చెన్నై 89-1; లక్ష్యం 172

ఫెర్గుసన్‌ నాలుగు బంతులను బాగా వేశాడు. కానీ ఆఖరి రెండు బంతుల్లో పది పరుగులు ఇచ్చేశాడు. మొయిన్‌ అలీ ఐదో బంతిని బౌండరీ, ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. డుప్లెసిస్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు.


మొయిన్‌ అలీ (11; 7 బంతుల్లో )
డుప్లెసిస్‌ (37; 25 బంతుల్లో ) 


 

9 ఓవర్లకు చెన్నై 78-1; లక్ష్యం 172

ఆండ్రీ రసెల్‌ పది పరుగులు ఇచ్చాడు. కీలకమైన రుతురాజ్‌ను ఔట్‌ చేశాడు. మొయిన్‌ అలీ క్రీజులోకి వచ్చాడు. డుప్లెసిస్‌ ఆచితూచి ఆడాడు. 


మొయిన్‌ అలీ (1; 2 బంతుల్లో )
డుప్లెసిస్‌ (36; 24 బంతుల్లో ) 


 

రుతురాజ్‌ దొరికాడు!

రసెల్‌ వేసిన 8.2వ బంతికి రుతురాజ్‌ గైక్వాడ్‌ (40; 28 బంతుల్లో  2x4, 3x6) ఔటయ్యాడు. లీడింగ్‌ ఎడ్జ్‌ అయిన బంతి కవర్స్‌లో మోర్గాన్‌కు దొరికింది.

8 ఓవర్లకు చెన్నై 68-0; లక్ష్యం 172

చక్రవర్తి ఈ ఓవర్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. రుతురాజ్‌, డుప్లెసిస్‌ ఆచితూచి ఆడారు.
రుతురాజ్‌ గైక్వాడ్‌ (34; 26 బంతుల్లో )
డుప్లెసిస్‌ (33; 22 బంతుల్లో ) 


 

7 ఓవర్లకు చెన్నై 63-0; లక్ష్యం 172


సునిల్‌ నరైన మిస్టరీ పనిచేయడం లేదు. ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. రెండో బంతిని రుతురాజ్‌ చూడచక్కని సిక్సర్‌గా మలిచాడు. డుప్లెసిస్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు. 


రుతురాజ్‌ గైక్వాడ్‌ (31; 22 బంతుల్లో )
డుప్లెసిస్‌ (31; 20 బంతుల్లో ) 


 

ఓపెనర్ల దూకుడు.. 6 ఓవర్లకు చెన్నై 52-0; లక్ష్యం 172

ఫెర్గూసన్‌ పది పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్‌ చూడచక్కని బౌండరీలు బాదాడు. రుతురాజ్‌ సైతం క్లాసిక్‌ బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు.


రుతురాజ్‌ గైక్వాడ్‌ (23; 18 బంతుల్లో )
డుప్లెసిస్‌ (28; 18 బంతుల్లో ) 


 

ఓపెనర్ల దూకుడు.. 5 ఓవర్లకు చెన్నై 42-0; లక్ష్యం 172

సునిల్‌ నరైన్‌ మిస్టరీ బౌలింగ్‌ పనిచేయలేదు. ఏకంగా 14 పరుగులు ఇచ్చాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుతమైన షాట్లు ఆడాడు. ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ కొట్టాడు. డుప్లెసిస్‌ నిలకడగా ఆడుతున్నాడు.


రుతురాజ్‌ గైక్వాడ్‌ (22; 17 బంతుల్లో )
డుప్లెసిస్‌ (19; 13 బంతుల్లో ) 


 

4 ఓవర్లకు చెన్నై 28-0; లక్ష్యం 172

వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ దాడికి దిగాడు. పది పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్‌ తన సూపర్‌ ఫామ్‌ చూపిస్తున్నాడు. వరుసగా రెండు బౌండరీలు బాదాడు. రుతరాజ్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు.


రుతురాజ్‌ గైక్వాడ్‌ (9; 12 బంతుల్లో )
డుప్లెసిస్‌ (18; 12 బంతుల్లో ) 


 

3 ఓవర్లకు చెన్నై 18-0; లక్ష్యం 172

ప్రసిద్ధ్ కృష్ణ ఈ ఓవర్లో 9 పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్‌ రెండు అద్భుతమైన బౌండరీలు బాదేశాడు. రుతురాజ్ అతడికి తోడుగా ఉన్నాడు. 



రుతురాజ్‌ గైక్వాడ్‌ (8; 11 బంతుల్లో )
డుప్లెసిస్‌ (10; 7 బంతుల్లో ) 

2 ఓవర్లకు చెన్నై 9-0; లక్ష్యం 172

ఫెర్గూసన్‌ బౌలింగ్‌కు వచ్చాడు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. రుతురాజ్‌ తన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్‌ అతడికి తోడుగా ఉన్నాడు.


రుతురాజ్‌ గైక్వాడ్‌ (8; 10 బంతుల్లో )
డుప్లెసిస్‌ (1; 2 బంతుల్లో ) 


 

1 ఓవర్‌కు చెన్నై 5-0; లక్ష్యం 172

చెన్నై సూపర్‌కింగ్స్ ఛేదన ఆరంభించింది. ప్రసిద్ధ్‌ కృష్ణ మొదటి ఓవర్‌ వేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. రుతురాజ్ మూడో బంతిని బౌండరీగా మలిచాడు. డుప్లెసిస్‌ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.


రుతురాజ్‌ గైక్వాడ్‌ (5; 5 బంతుల్లో )
డుప్లెసిస్‌ (0; 1 బంతుల్లో ) 


 

20 ఓవర్లకు కోల్‌కతా 171-6

హేజిల్‌వుడ్‌ ఈ ఓవర్లో 13 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్‌ తీశాడు. ఆఖరి బంతికి నితీశ్‌ రాణా బౌండరీ బాదడంతో కోల్‌కతా స్కోరు 171కి చేరుకుంది. సునీల్‌ నరైన్‌ పరుగులేమీ చేయకున్నా అజేయంగా నిలిచాడు.


నితీశ్‌ రాణా (37; 27 బంతుల్లో 3x4, 1x6)

దినేశ్‌ కార్తీక్‌ ఔట్‌

హేజిల్‌వుడ్‌ వేసిన 19.4వ బంతికి దినేశ్‌ కార్తీక్‌ (26; 11 బంతుల్లో 3x6,1x6) ఔట్‌

19 ఓవర్లకు కోల్‌కతా 158-4

సామ్‌ కరణ్‌ 19 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో డీకే సూపర్‌ బ్యాటింగ్‌తో అలరించాడు. ఒక సిక్సర్‌, రెండు బౌండరీలు బాదాడు. దాంతో కోల్‌కతాకు మంచి స్కోరు లభించింది. రాణా మరో ఎండ్‌లో ఉన్నాడు.


నితీశ్‌ రాణా (32; 25 బంతుల్లో )
దినేశ్‌ కార్తీక్‌ (20; 8 బంతుల్లో )


 

18 ఓవర్లకు కోల్‌కతా 139-4

దీపక్‌ చాహర్‌ 12 పరుగులు ఇచ్చాడు. నితీశ్‌ రాణా వరుసగా రెండు చక్కని బౌండరీలు బాదేశాడు. కార్తీక్‌ అతడికి తోడుగా ఉన్నాడు.


నితీశ్‌ రాణా (31; 24 బంతుల్లో )
దినేశ్‌ కార్తీక్‌ (3; 3 బంతుల్లో )


 

17 ఓవర్లకు కోల్‌కతా 127-4

శార్దూల్‌ ఠాకూర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం ఆరు పరుగులే ఇచ్చి కీలకమైన రసెల్‌ను ఔట్‌ చేశాడు. నితీశ్ రాణా నిలకడగా ఆడుతున్నాడు. దినేశ్‌ కార్తీక్‌ క్రీజులోకి వచ్చాడు.



నితీశ్‌ రాణా (21; 20 బంతుల్లో )
దినేశ్‌ కార్తీక్‌ (1; 1 బంతుల్లో )


 

ఠాకూర్‌ మాయ.. రసెల్‌ ఔట్‌


ఆండ్రీ రసెల్‌ (20; 15 బంతుల్లో 2x4, 1x6 ) ఔటయ్యాడు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 16.4వ బంతికి బౌల్డ్‌ అయ్యాడు.  

16 ఓవర్లకు కోల్‌కతా 121-4

భళా చాహర్‌! ఈ ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. రసెల్‌ను పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. రాణాకు వేగం తగ్గించి షాట్లు ఆడకుండా అడ్డుకున్నాడు. 


నితీశ్‌ రాణా (17; 17 బంతుల్లో )
ఆండ్రీ రసెల్‌ (19; 13 బంతుల్లో )


 

15 ఓవర్లకు కోల్‌కతా 118-4

సామ్‌ కరన్‌ బౌలింగ్‌ చేశాడు. 14 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో రసెల్‌ తన మసిల్‌ పవర్‌ చూపించాడు. రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదేశాడు. రాణా అతడికి తోడుగా ఉన్నాడు.


నితీశ్‌ రాణా (16; 13 బంతుల్లో )
ఆండ్రీ రసెల్‌ (18; 11 బంతుల్లో )


 

14 ఓవర్లకు కోల్‌కతా 104-4

హేజిల్‌వుడ్‌ పదకొండు పరుగులు ఇచ్చాడు. బ్యాటర్లను అతడు ఔట్‌ప్లే చేసేందుకు ప్రయత్నించాడు. నాలుగో బంతిని నితీశ్ రాణా మిడ్‌వికెట్‌ మీదుగా సూపర్‌ సిక్స్‌గా మలిచాడు. రసెల్‌ అతడికి అండగా ఉన్నాడు.


నితీశ్‌ రాణా (16; 13 బంతుల్లో )
ఆండ్రీ రసెల్‌ (4; 5 బంతుల్లో )


 

13 ఓవర్లకు కోల్‌కతా 93-4

జడ్డూ4 పరుగులే ఇచ్చి కీలకమైన రాహుల్‌ త్రిపాఠిని ఔట్‌ చేశాడు. ఆండ్రీ రసెల్‌ క్రీజులోకి వచ్చాడు. నితీశ్‌ రాణా ఆచితూచి ఆడుతున్నాడు.


నితీశ్‌ రాణా (9; 10 బంతుల్లో )
ఆండ్రీ రసెల్‌ (2; 2 బంతుల్లో )


 

బెడిసికొట్టిన రివర్స్‌ స్వీప్‌.. త్రిపాఠి ఔట్‌

కోల్‌కతా నాలుగో వికెట్‌ చేజార్చుకుంది. రాహుల్‌ త్రిపాఠి  (45; 33 బంతుల్లో 4x4, 1x6) ఔటయ్యాడు. జడ్డూ వేసిన 12.2వ బంతిని రివర్స్‌ స్వీప్‌ ఆడబోయి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

12 ఓవర్లకు కోల్‌కతా 89-3

కేకేఆర్‌ బ్యాటింగ్‌లో వేగం తగ్గింది. పిచ్‌ మందకొడిగా మారుతోంది. శార్దూల్‌ కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. రాణా, త్రిపాఠి ఆచితూచి ఆడుతున్నారు.
 
నితీశ్‌ రాణా (7; 8 బంతుల్లో )
రాహుల్‌ త్రిపాఠి (45; 32 బంతుల్లో )


 

11 ఓవర్లకు కోల్‌కతా 84-3

జడ్డూ తనకు అలవాటైన రీతిలో త్వరగా ఓవర్‌ను ముగించాడు. కేవలం ఆరు పరుగులు ఇచ్చాడు. త్రిపాఠి, నితీశ్‌ ఆచితూచి ఆడారు.
 
నితీశ్‌ రాణా (4; 4 బంతుల్లో )
రాహుల్‌ త్రిపాఠి (43; 29 బంతుల్లో )


 

10 ఓవర్లకు కోల్‌కతా 78-3

హేజిల్‌వుడ్‌ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. మోర్గాన్‌ ఔటయ్యాడు. మూడో బంతిని త్రిపాఠి బౌండరీగా మలిచాడు. నితీశ్‌ రాణా క్రీజులోకి వచ్చాడు.


నితీశ్‌ రాణా (1; 1 బంతుల్లో )
రాహుల్‌ త్రిపాఠి (40; 26 బంతుల్లో )

నిరాశపరిచిన మోర్గాన్‌ ఔట్‌

హేజిల్‌ వుడ్‌ వేసిన 9.1వ బంతిని భారీ షాట్‌ ఆడే క్రమంలో ఇయాన్‌ మోర్గాన్‌ (8: 14 బంతుల్లో) ఔటయ్యాడు. డుప్లెసిస్‌ బౌండరీ సరిహద్దు వద్ద అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.

9 ఓవర్లకు కోల్‌కతా 70-2

జడ్డూ ఆరు పరుగులు ఇచ్చాడు. మోర్గాన్‌ భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. త్రిపాఠి ఫర్వాలేదనిపించాడు. అంపైర్లు టైమ్‌ఔట్‌ ప్రకటించారు.


ఇయాన్‌ మోర్గాన్‌ (8; 13 బంతుల్లో )
రాహుల్‌ త్రిపాఠి (33; 22 బంతుల్లో )


 

8 ఓవర్లకు కోల్‌కతా 64-2

శార్దూల్‌ ఠాకూర్‌ కచ్చితత్వంతో బంతులు వేస్తున్నాడు. తొమ్మిది పరుగులు ఇచ్చాడు.  నాలుగో బంతిని త్రిపాఠి చక్కని కట్‌షాట్‌తో బౌండరీకి పంపించాడు. మోర్గాన్‌ బౌన్సర్లకు ఇబ్బంది పడుతున్నాడు.


ఇయాన్‌ మోర్గాన్‌ (4; 10 బంతుల్లో )
రాహుల్‌ త్రిపాఠి (31; 19 బంతుల్లో )

7 ఓవర్లకు కోల్‌కతా 55-2

జడ్డూ రంగంలోకి దిగాడు. త్వరగా ఓవర్‌ పూర్తి చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. మోర్గాన్‌, త్రిపాఠి ఆచితూచి ఆడాడు.


ఇయాన్‌ మోర్గాన్‌ (3; 8 బంతుల్లో )
రాహుల్‌ త్రిపాఠి (23; 15 బంతుల్లో )

6 ఓవర్లకు కోల్‌కతా 50-2

శార్దూల్‌ ఠాకూర్‌ మరోసారి చెన్నైకి బ్రేక్‌ ఇచ్చాడు. వికెట్‌ మెయిడిన్‌ ఓవర్‌ వేశాడు. ఇయాన్‌ మోర్గాన్‌ ఐదు బంతిలాడి పరుగుల ఖాతా తెరవలేదు. త్రిపాఠి మరో ఎండ్‌లో ఉన్నాడు.


ఇయాన్‌ మోర్గాన్‌ (0; 5 బంతుల్లో )
రాహుల్‌ త్రిపాఠి (21; 12 బంతుల్లో )

వెంకటేశ్‌ అయ్యర్‌ ఔట్‌


శార్దూల్‌ ఠాకూర్‌ రాగానే వికెట్‌ తీశాడు. వేసిన మొదటి బంతికే వెంకటేశ్‌ అయ్యర్‌ను  ఔట్‌ చేశాడు. అతడు ఆఫ్‌సైడ్‌ వేసిన 5.1వ బంతిని ఆడబోయి వెంకటేశ్‌.. ధోనీకి క్యాచ్‌ ఇచ్చాడు.

5 ఓవర్లకు కోల్‌కతా 50-1

హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌కు వచ్చాడు. పది పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో వెంకటేశ్‌ అయ్యర్‌ తన క్లాస్‌ చూపించాడు. లేట్‌ కట్స్‌, ఆలస్యంగా ఆడుతూ రెండు బౌండరీలు సాధించాడు. ఫుట్‌వర్క్ ఉపయోగిస్తున్నాడు. త్రిపాఠి మరో ఎండ్‌లో ఉన్నాడు.


వెంకటేశ్‌ అయ్యర్‌ (18; 14 బంతుల్లో )
రాహుల్‌ త్రిపాఠి (21; 12 బంతుల్లో )

బతికిపోయిన త్రిపాఠి: 4 ఓవర్లకు కోల్‌కతా 40-1

సామ్‌ కరణ్‌ బౌలింగ్‌కు వచ్చాడు. 14 పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని త్రిపాఠి ఔండరీకి పంపించాడు. అయితే ఐదో బంతికి అతడు ఔటయ్యాడు. తల మీదుగా వెళ్తున్న బంతి ర్యాంప్‌ షాట్‌ ఆడే క్రమంలో బ్యాటు అంచుకు తగిలి ధోనీ చేతుల్లో పడింది. వెళ్లిపోతుండగా అంపైర్లు ఆపి థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించారు. పై నుంచి వెళ్తుండటం, రెండు బౌన్సర్‌ కావడంతో నోబాల్‌గా ప్రకటించారు. ఫ్రీహిట్‌ను త్రిపాఠి భారీ సిక్సర్‌గా మలిచాడు. వెంకటేశ్‌ అతడికి తోడుగా ఉన్నాడు.


వెంకటేశ్‌ అయ్యర్‌ (9; 9 బంతుల్లో )
రాహుల్‌ త్రిపాఠి (20; 11 బంతుల్లో )

3 ఓవర్లకు కోల్‌కతా 26-1

దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌కు వచ్చాడు. కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ ఆఖరి బంతిని చీకీ షాక్‌తో థర్డ్‌మ్యాన్‌ దిశగా బౌండరీకి తరలించాడు. త్రిపాఠి అతడికి తోడుగా ఉన్నాడు.



వెంకటేశ్‌ అయ్యర్‌ (8; 8 బంతుల్లో )
రాహుల్‌ త్రిపాఠి (8; 5 బంతుల్లో )

2 ఓవర్లకు కోల్‌కతా 19-1

సామ్‌ కరణ్‌ బౌలింగ్‌కు వచ్చాడు. కేవలం తొమ్మిది పరుగులు ఇచ్చాడు. ఈ  ఓవర్లో రాహుల్‌ త్రిపాఠి చక్కని బౌండరీ బాదాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ కాస్త ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తోంది.


వెంకటేశ్‌ అయ్యర్‌ (3; 4 బంతుల్లో )
రాహుల్‌ త్రిపాఠి (6; 3 బంతుల్లో )

శుభ్‌మన్‌.. కామెడీ ఎర్రర్స్‌! 1 ఓవర్‌కు కోల్‌కతా 10-1

తొలి ఓవర్‌ అద్భుతంగా సాగింది. దీపక్‌ చాహర్‌ పది పరుగులు ఇచ్చాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ (9: 5 బంతుల్లో 2x4) మూడు, నాలుగో బంతుల్ని వరుసగా బౌండరీకి పంపించాడు. ఐదో బంతికి ఎల్బీ ఇవ్వగా సమీక్షలో బతికిపోయాడు. అయితే ఆఖరి బంతికి అనవసర సింగిల్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. రాయుడు డైరెక్ట్‌గా వికెట్లకు బంతిని విసిరాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (1) మరో ఎండ్‌లో ఉన్నాడు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

సీఎస్‌కేతో మ్యాచులో టాస్‌ గెలిచిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. శనివారం జరిగిన రెండు మ్యాచుల్లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. బహుశా ఇదే ఉద్దేశంతో మోర్గాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడని అనిపిస్తోంది. ఆ జట్టులో ఎలాంటి మార్పుల్లేవు. చెన్నైలో డ్వేన్‌ బ్రావో స్థానంలో సామ్‌ కరన్‌ వచ్చేశాడు.

Background

ఐపీఎల్‌ రెండో అంచెలో దూకుడు మీదున్న రెండు జట్లు నేడు తలపడుతున్నాయి. రెండూ కుర్రాళ్లనే నమ్ముకున్నాయి. రెండూ దూకుడు మంత్రమే పఠిస్తున్నాయి. అవే చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌. ఈ పోరులో గెలిస్తే ధోనీసేన ఫ్లేఆఫ్స్‌కు దూసుకెళ్తుంది. కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకు పోతుంది. మరి ఏ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం!


ఆధిపత్యం ధోనీసేనదే
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో కోల్‌కతాపై చెన్నైదే పైచేయి. మొత్తంగా 23 సార్లు తలపడితే 15 సార్లు విజయ దుందుభి మోగించింది. కేవలం 8 సార్లే పరాజయం పాలైంది. ఈ రెండు జట్లు తలపడ్డ ఆఖరి ఐదు మ్యాచుల్లోనూ నాలుగు సార్లు ధోనీ సేననే విజయం వరించింది. ఈ సీజన్‌ తొలి అంచెలో తలపడ్డ మ్యాచులోనూ చెన్నైదే గెలుపు. ఈ హై స్కోరింగ్‌ మ్యాచులో రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి. డుప్లెసిస్‌ (95 నాటౌట్‌), రుతురాజ్‌ (64), మొయిన్‌ అలీ (25) రెచ్చిపోవడంతో చెన్నై 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఛేదనలో కేకేఆర్‌ టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా.. దినేశ్‌ కార్తీక్‌ (40), ఆండ్రీ రసెల్‌ (54), కమిన్స్‌ (66) నాటౌట్‌గా నిలవడంతో 19.1 ఓవర్లకు 202కు ఆలౌటైంది.


చెన్నై జోరే వేరబ్బా!
ఈ ఐపీఎల్‌ను ఎలాగైనా గెలవాలని చెన్నై పట్టుదలతో ఉంది. బహుశా ధోనీకి టైటిల్‌తో ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తుండొచ్చు. మొదటి అంచెలోని ఫామ్‌లోనూ యూఈలోనూ కొనసాగిస్తోంది. ముంబయి, బెంగళూరును చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆ జట్టుకు మెరుపు ఆరంభాలు ఇస్తున్నాడు. డుప్లెసిస్‌ ఫామ్‌లోకి వచ్చాడు. అంబటి రాయుడు దుమ్మురేపుతున్నాడు. లోయర్‌ ఆర్డర్‌ నుంచి టాప్‌ ఆర్డర్‌కు మారిన మొయిన్‌ అలీ సైతం రెచ్చిపోతున్నాడు. వీరందరికీ సురేశ్‌ రైనా అండగా ఉంటున్నాడు. వీరిలో ఎవరు ఆడకున్నా ధోనీ, జడ్డూ ఆదుకుంటారు. బౌలింగ్‌లోనూ దీపక్‌ చాహర్‌, డ్వేన్‌ బ్రావో కీలకంగా ఉంటున్నారు. అవసరమైన ప్రతిసారీ వికెట్లు తీస్తున్నారు. శార్దూల్‌, జడ్డూ ఆపదలో ఆదుకుంటున్నారు. సామ్‌  కరన్‌ సైతం వీరికి తోడైతే చెన్నైకి తిరుగుండదు.


రెచ్చిపోతున్న కోల్‌కతా
ఒకప్పుడు సంచలన ప్రదర్శనలకు మారుపేరైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రానురానూ పేలవంగా మారింది. తొలి అంచెలో నిరాశపరిచిన కేకేఆర్‌ యూఏఈకి రాగానే రెచ్చిపోతోంది. బెంగళూరును 92కే ఆలౌట్‌ చేసిన ఆ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయినీ చిత్తు చేసింది. టాప్‌ ఆర్డర్లో దూకుడు పెరగడం, ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం, బౌలింగ్‌లో వైవిధ్యం తోడవ్వడమే ఇందుకు కారణం. 


యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ రావడంతో ఓపెనింగ్‌లో జోరు పెరిగింది. అతనాడే సిక్సర్లు కనువిందు చేస్తున్నాయి. శుభ్‌మన్‌ గిల్‌  సైతం చూడచక్కని షాట్లతో అలరిస్తున్నాడు. ముంబయి మ్యాచులో రాహుల్‌ త్రిపాఠి బ్యాటింగ్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. డీకే, మోర్గాన్‌, రసెల్‌కు పూర్తి స్థాయిలో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తి ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. మిస్టరీ బౌలింగ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాడు. రసెల్‌, ఫెర్గూసన్‌, ప్రసిద్ధ్‌ పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. డెత్‌లో వికెట్లు తీస్తూ పరుగులను నియంత్రిస్తున్నారు. అందుకే చెన్నై, కోల్‌కతా మ్యాచ్‌ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.