RR vs RCB Live Updates:మాక్సీ విధ్వంసం.. 17.1 ఓవర్లకే బెంగళూరు విజయం

ముంబైని ఓడించి బెంగళూరు మంచి ఊపు మీదుంది. 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఢిల్లీ, సన్‌రైజర్స్‌ చేతిలో ఓటములతో ఒత్తిడిలో ఉంది. ఇది వారు తప్పక గెలవాల్సిన మ్యాచ్.

ABP Desam Last Updated: 29 Sep 2021 11:01 PM
మాక్సీ విధ్వంసం.. 17.1 ఓవర్లకే బెంగళూరు విజయం

రియాన్‌ పరాగ్‌ వేసిన 17.1 బంతిని డివిలియర్స్‌ (4) బౌండరీ బాది విజయం అందించాడు. మాక్స్‌వెల్‌ (50) అజేయంగా నిలిచాడు. కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో మ్యాచ్‌ గెలిచింది.

17 ఓవర్లకు బెంగళూరు 149-3

మోరిస్‌ 22 పరుగులు ఇచ్చాడు. మాక్స్‌వెల్‌ (50) వరుసగా , 2, 4, 2, 4, 4తో రెచ్చిపోయాడు. డివిలియర్స్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు. బెంగళూరుకు మరొక్క పరుగే అవసరం.

కేఎస్‌ భరత్‌ (44) ఔట్‌; 16 ఓవర్లకు బెంగళూరు 127-3

ముస్తాఫిజుర్‌ నాలుగు పరుగులే ఇచ్చి కీలకమైన భరత్‌ (44; 35 బంతుల్లో 83x4, 1x6)ను ఔట్‌ చేశాడు. సిక్సర్‌ ఆడే క్రమంలో అతడు క్యాచ్‌ ఇచ్చాడు. మాక్సీ (28), డివిలియర్స్‌ (0) క్రీజులో ఉన్నారు.

15 ఓవర్లకు బెంగళూరు 123-2

చేతన్ సకారియా 8 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని మాక్సీ (26) బౌండరీకి పంపించాడు. మొత్తంగా టీ20ల్లో 7వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. భరత్‌ (42) అర్ధశతకానికి చేరువైతున్నాడు.

14 ఓవర్లకు బెంగళూరు 115-2

రాహుల్ తెవాతియా 9 పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని భరత్‌ (39)  బౌండరీగా మలిచాడు. మాక్సీ (21) నిలకడగా ఆడుతున్నాడు. వీరిద్దరి భాగస్వా్మ్యం 50 పరుగులు దాటింది.

13 ఓవర్లకు బెంగళూరు 106-2

ఈ ఓవర్లో క్రిస్‌ మోరిస్‌ 11 పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని భరత్‌ (33) స్వీప్‌ షాట్‌తో భారీ సిక్సర్‌ బాదేశాడు. మాక్సీ (18)  అతడికి తోడుగా ఉన్నాడు.

12 ఓవర్లకు బెంగళూరు 95-2

మహిపాల్‌ తొమ్మిది పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని భరత్‌ (24) ముందుకు దూకి బౌలర్‌ మీదుగా బౌండరీ కొట్టాడు. మాక్సీ (16) అతడికి తోడుగా ఉన్నాడు.  

11 ఓవర్లకు బెంగళూరు 86-2

తెవాతియా ఏడు పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతిని మాక్సీ (14) ఫీల్డర్ల మధ్యలోంచి బౌండరీకి పంపించాడు. భరత్‌ (18) అతడికి తోడుగా ఉన్నాడు.

10 ఓవర్లకు బెంగళూరు 79-2

మహిపాల్‌ లోమ్రర్‌ కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. మాక్సీ (9), భరత్‌ (16) నిలకడగా ఆడుతున్నారు.

9 ఓవర్లకు బెంగళూరు 75-2

కార్తీక్‌ త్యాగీ ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని మాక్సీ (7) బౌండరీకి తరలించాడు. భరత్‌ (14) నిలకడగా ఆడుతున్నాడు.

8 ఓవర్లకు బెంగళూరు 66-2

రాహుల్‌ తెవాతియా ఏడు పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని భరత్‌ (12) గ్యాప్‌ రాబట్టి బౌండరీకి తరలించాడు. మాక్సీ (1) అతడికి తోడుగా ఉన్నాడు

కోహ్లీ (25) రనౌట్‌; 7 ఓవర్లకు బెంగళూరు 59-2

క్రిస్‌ మోరిస్‌ కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. అయితే త్వరిత సింగిల్స్‌ కోసం ప్రయత్నించి విరాట్‌ కోహ్లీ (25; 20b 4x4) రనౌట్‌ అయ్యాడు. రియాన్‌ పరాగ్‌ వేసిన బంతి నేరుగా వికెట్లకు తాకింది. భరత్‌ (6) ఆచితూచి ఆడుతున్నాడు. మాక్సీ (0) క్రీజులోకి వచ్చాడు.

6 ఓవర్లకు బెంగళూరు 54-1

పవర్‌ప్లే ముగిసింది. ముస్తాఫిజుర్‌ వికెట్‌ తీసి ఆరు పరుగులు ఇచ్చాడు. కోహ్లీ (23) దూకుడు కొనసాగిస్తున్నాడు. శ్రీకర్ భరత్‌ (3) క్రీజులోకి వచ్చాడు.

ముస్తాఫిజుర్‌కు పడిక్కల్‌ వికెట్‌

ఫిజ్‌ వేసిన 5.2వ బంతికి దేవదత్‌ పడిక్కల్‌ (22; 17b 4x4) ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

5 ఓవర్లకు బెంగళూరు 48-0

సకారియా మళ్లీ పరుగుల్ని నియంత్రించాడు. నాలుగో బంతిని పడిక్కల్‌ (22) బౌండరీకి పంపించాడు. కోహ్లీ (20) ఆచితూచి ఆడాడు.

4 ఓవర్లకు బెంగళూరు 41-0

ముస్తాఫిజుర్‌ సైతం ఎక్కువే పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. పడిక్కల్‌ (17) రెండు చక్కని బౌండరీలు కొట్టాడు. కోహ్లీ (19) అతడికి తోడుగా ఉన్నాడు.

3 ఓవర్లకు బెంగళూరు 29-0

చేతన్‌ సకారియా చక్కగా బౌలింగ్‌ చేశాడు. కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. ఐదో బంతికి పడిక్కల్‌ (7) ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. ఇన్‌స్వింగ్‌ అయిన బంతి బ్యాటు అంచుకు తగిలి కీపర్ సంజు వద్దకు వెళ్లింది. ఆలస్యంగా స్పందించిన అతడు క్యాచ్‌ నేలపాలు చేశాడు. కోహ్లీ (19) మరో ఎండ్‌లో ఉన్నాడు.

2 ఓవర్లకు బెంగళూరు 25-0

కార్తీక్‌ త్యాగీ బౌలింగ్‌కు వచ్చాడు. పద్నాలుగు పరుగులు ఇచ్చాడు.  తొలి బంతిని పడిక్కల్‌ (5), ఐదో బంతిని కోహ్లీ (18) బౌండరీకి పంపించారు.

1 ఓవర్‌కు బెంగళూరు 12/0; లక్ష్యం 150

తొలి ఓవర్‌ను క్రిస్‌ మోరిస్‌ వేశాడు. 12 పరుగులు ఇచ్చాడు. బంతి తర్వాత బంతిని విరాట్‌ కోహ్లీ (12) బౌండరీకి పంపించాడు. మొత్తం మూడు బౌండరీలు కొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (0) అతడికి తోడుగా ఉన్నాడు.

హర్షల్‌ హ్యాట్రిక్‌ మిస్‌: 20 ఓవర్లకు రాజస్థాన్‌ 149-9

ఆఖరి ఓవర్లో హర్షల్‌ పటేల్‌ అద్భుతం చేశాడు. కేవలం మూడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. వరుస బంతుల్లో రియాన్‌ పరాగ్‌ (9), క్రిస్‌ మోరిస్‌ (14)ను ఔట్‌ చేశాడు. హ్యాట్రిక్‌ తీస్తాడని భావించినా కార్తీక్‌ త్యాగీ (1) అందుకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఆఖరి బంతికి చేతన్‌ సకారియా (2)ను పెవిలియన్‌ పంపించాడు. దాంతో ఈ సీజన్లో అతడి వికెట్ల సంఖ్య 26కు చేరుకుంది. 

19 ఓవర్లకు రాజస్థాన్‌ 146-6

సిరాజ్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు. కేవలం తొమ్మిది పరుగులు ఇచ్చాడు. మోరిస్‌ (14) ఒక బౌండరీ కొట్టాడు. రియాన్‌ (9) మరో ఎండ్‌లో ఉన్నాడు. 

18 ఓవర్లకు రాజస్థాన్‌ 137-6 

హర్షల్‌ పటేల్‌ ఎనిమిది పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి మోరిస్‌ (8) ఒక బౌండరీ కొట్టాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతికి కీపర్‌ మీదుగా వెళ్లింది. రియాన్‌ (7) నిలకడగా ఆడుతున్నాడు.

17 ఓవర్లకు రాజస్థాన్‌ 129-6 

యుజ్వేంద్ర చాహల్‌ తన మాయ కొనసాగిస్తున్నాడు. కేవలం మూడు పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. రియాన్‌ పరాగ్‌ (6) ఇబ్బంది పడుతున్నాడు. క్రిస్‌ మోరిస్‌ (1) క్రీజులోకి వచ్చాడు.

చాహల్‌ మాయ: లివింగ్‌స్టన్‌ (6) ఔట్‌

యుజ్వేంద్ర చాహల్‌ వేసిన 16.2వ బంతికి లియామ్‌ లివింగ్‌ స్టన్‌ (6: 9 balls) ఔటయ్యాడు. ఏబీ డివిలియర్స్‌కు సులభ క్యాచ్‌ అందించాడు.

16 ఓవర్లకు రాజస్థాన్‌ 126-5

షాబాజ్‌ ఆరు సింగిల్స్‌ ఇచ్చాడు. రియాన్‌ (4), లివింగ్‌ స్టన్‌ (6) భారీ షాట్లు ఆడలేదు.

15 ఓవర్లకు రాజస్థాన్‌ 120-5

చాహల్‌ కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. రియాన్‌ పరాగ్‌ (1) బంతులు ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. లివింగ్‌స్టన్‌ (3) ఇంకా తన మార్క్‌ చూపించలేదు.

వాహ్‌.. షాబాజ్‌! తొలి బంతికి సంజు.. ఆఖరి బంతికి తెవాతియా ఔట్‌

ఈ ఓవర్లో షాబాజ్‌ అద్భుతం చేశాడు. కేవలం నాలుగు పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. లివింగ్‌స్టన్‌ (2), రియాన్‌ పరాగ్‌ క్రీజులో ఉన్నారు.

ఓహ్‌.. సంజు! షాబాజ్‌ తొలి బంతికే వికెట్

షాబాజ్‌ అహ్మద్‌ వేసిన 13.1వ బంతికి సంజు శాంసన్‌ (19:15b 0x4 2x6) ఔటయ్యాడు. జరిగి కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే బౌండరీ సరిహద్దు వద్ద పడిక్కల్‌కు చిక్కాడు.

మహిపాల్‌ స్టంపౌట్‌: 13 ఓవర్లకు రాజస్థాన్‌ 113-3

యుజ్వేంద్ర చాహల్‌ మూడో వికెట్‌ అందించాడు. నాలుగు పరుగులే ఇచ్చాడు. మహిపాల్‌ లోమ్రర్‌ (3; 4b 0x4 0x6)ను ఔట్‌ చేశాడు. ఐదో బంతికి భరత్‌ అతడిని స్టంపౌట్‌ చేశాడు. లివింగ్‌స్టన్‌ క్రీజులోకి వచ్చాడు. సంజు (19) నిలకడగా ఆడుతున్నాడు.

12 ఓవర్లకు రాజస్థాన్‌ 109-2

గార్టన్‌ తొమ్మిది పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఆఖరి బంతిని సంజు (17) స్క్వేర్‌లెగ్‌ మీదుగా సిక్సర్‌ బాదేశాడు. బంతికి వేగంగా స్పందించాడు. మహిపాల్‌ (1) అతడికి తోడుగా ఉన్నాడు.

లూయిస్‌ ఔట్‌: గార్టన్‌కు రిలీఫ్‌

గార్టన్‌ వేసిన 11.1వ బంతికి ఎవిన్‌ లూయిస్‌ (58; 37b 5x4 3x6) ఔటయ్యాడు. బ్యాటు అంచుకు తగలిన బంతి కీపర్‌ కేఎస్‌ భరత్‌ చేతుల్లో పడింది. బెంగళూరుకు రెండో వికెట్‌ లభించింది.

11 ఓవర్లకు రాజస్థాన్‌ 100-1

చాహల్‌ బౌలింగ్‌కు వచ్చాడు. కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చాడు.  బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆఖరి బంతిని సంజు శాంసన్‌ (10) డీప్ ఎక్స్ట్రా కవర్స్‌లో బౌండరీకి పంపించాడు. లూయిస్‌ (58) నిలకడగా ఆడుతున్నాడు.

లూయిస్‌ అర్ధశతకం: 10 ఓవర్లకు రాజస్థాన్‌ 91-1

హర్షల్‌ పటేల్‌ పది పరుగులు ఇచ్చాడు. ఎవిన్‌ లూయిస్‌ (56) వరుసగా రెండు బౌండరీలు బాది అర్ధశతకం అందుకున్నాడు. సంజు (3) ఆచితూచి ఆడుతున్నాడు.

9 ఓవర్లకు రాజస్థాన్‌ 81-1

డాన్‌ క్రిస్టియన్‌ ఈ ఓవర్లో బ్రేక్‌ ఇచ్చాడు. కీలకమైన జైశ్వాల్‌ను ఔట్‌ చేశాడు. సంజు శాంసన్‌ (3) క్రీజులోకి వచ్చాడు. లూయిస్‌ (47) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు.

జైశ్వాల్‌ ఔట్‌.. 77 పరుగుల భాగస్వామ్యం విడదీత

డాన్‌ క్రిస్టియన్‌ వేసిన 8.2వ బంతికి యశస్వీ జైశ్వాల్‌ (31; 22b 3x4, 2x6) ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో మహ్మద్ సిరాజ్‌కు చిక్కాడు.

8 ఓవర్లకు రాజస్థాన్‌ 71-0

మాక్సీ మళ్లీ వచ్చాడు. ఇద్దరూ లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్లు కావడంతో చాహల్‌కు బౌలింగ్‌ ఇవ్వడం లేదు. మాక్సీ ఈ ఓవర్లో పరుగుల్ని నియంత్రించాడు. కేవలం నాలుగే ఇచ్చాడు. జైశ్వాల్‌ (25), లూయిస్‌ (46) ఆచితూచి ఆడారు.

7 ఓవర్లకు రాజస్థాన్‌ 67-0

డాన్‌ క్రిస్టియన్‌ను రంగంలోకి దించారు. అయినా ఫలితం లేదు! ఈ ఓవర్లో పదకొండు పరుగులు వచ్చాయి. మూడు, ఆరో బంతిని జైశ్వాల్‌ (24) అద్భుతమైన బౌండరీలుగా మలిచాడు. లూయిస్‌ (43) అతడికి తోడుగా ఉన్నాడు.

6 ఓవర్లకు రాజస్థాన్‌ 56-0

సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పరుగులను నియంత్రించాడు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. చక్కని యార్కర్లు, స్లో బంతులు వేశాడు. లూయిస్‌ (41), జైశ్వాల్‌ (15)
ఆచితూచి ఆడారు.

5 ఓవర్లకు రాజస్థాన్‌ 52-0

హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌కు వచ్చాడు. పరుగులను నియంత్రించేందుకు ప్రయత్నించినా అతడి ఆటలు సాగనివ్వలేదు.  ఎవిన్‌ లూయిస్‌ (39) ఈ ఓవర్లో ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ సాధించాడు. జైశ్వాల్‌ (13) అతడికి తోడుగా ఉన్నాడు.

4 ఓవర్లకు రాజస్థాన్‌ 39-0

రాజస్థాన్‌ బ్యాటర్లు గార్టన్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ ఓవర్లో 18 పరుగులు చేశారు. లూయిస్‌ (28) రెండు భారీ సిక్సర్లు, ఒక బౌండరీ బాదేశాడు. షార్ట్‌పిచ్‌లో వేసిన బంతుల్ని స్టాండ్స్‌లోకి తరలించాడు. జైశ్వాల్‌ (11) మరో ఎండ్‌లో ఉన్నాడు.

3 ఓవర్లకు రాజస్థాన్‌ 21-0

ఇద్దరు లెఫ్ట్‌హ్యాండర్లు ఉండటంతో కోహ్లీ.. మాక్సీని రంగంలోకి దించాడు. కానీ అతడు పదమూడు పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని జైశ్వాల్‌ (11) అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. నాలుగో బంతిని లూయిస్‌ (10) బౌండరీకి పంపించాడు.

2 ఓవర్లకు రాజస్థాన్‌ 8-0

మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌ దాడికి వచ్చాడు. చక్కని క్రాస్‌సీమ్ బంతులతో ఆకట్టుకున్నాడు. ఎనిమిది పరుగులు ఇచ్చాడు. జైశ్వాల్‌ (4) ఆఖరి బంతికి బౌండరీ బాదాడు. లూయిస్‌ (4) అతడికి తోడుగా ఉన్నాడు.


 

1 ఓవర్‌కు రాజస్థాన్‌ 3-0

తొలి ఓవర్‌ను జార్జ్‌ గార్టన్‌ వేశాడు. అరంగేట్రం ఓవర్‌ను చక్కగా వేశాడు. కేవలం మూడు పరుగులు ఇచ్చాడు. లూయిస్‌ (3), యశష్వీ జైశ్వాల్‌ (0) క్రీజులో ఉన్నారు.

కోహ్లీ టాస్‌ గెలిచాడు

రాజస్థాన్‌, బెంగళూరు మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. 

Background

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇది 43వ మ్యాచ్. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబైని భారీ తేడాతో ఓడించి బెంగళూరు మంచి ఊపు మీదుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో బెంగళూరు మూడో స్థానంలో ఉంది. ఇక రాజస్తాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఢిల్లీ, సన్‌రైజర్స్‌పై ఓటములతో రాజస్తాన్ ఒత్తిడిలో ఉంది.


జోష్‌లో బెంగళూరు
గత మ్యాచ్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి ముంబైని ఏకంగా 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ గత మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడం విశేషం. యజ్వేంద్ర చాహల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా బంతితో రాణించారు.


రాజస్తాన్ పడుతూ లేస్తూ..
రాజస్తాన్ గత మ్యాచ్‌లో మూడు మార్పులు చేసింది. గాయపడ్డ కార్తీక్ త్యాగి స్థానంలో జయదేవ్ ఉనద్కత్ జట్టులోకి వచ్చాడు. ఈ మధ్య రాజస్తాన్‌కు కార్తీక్ చాలా కీలకంగా మారాడు. తను జట్టులోకి వస్తే బౌలింగ్ విభాగం బలోపేతం అవుతుంది. ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్‌ల్లో ఎవరిని ఈసారి జట్టులోకి తీసుకుంటారో చూడాలి.


రెండు జట్ల మధ్య 22 మ్యాచ్‌లు జరగ్గా.. 11 మ్యాచ్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించగా.. 10 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. గత ఐదు మ్యాచ్‌ల్లో అయితే మూడు సార్లు బెంగళూరు విజయం సాధించింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.